AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: ఎల్‌నినో ఎఫెక్ట్.. తిరుమలలో ఎండిపోతున్న డ్యామ్‌లు.. 90 రోజులకే నీటి నిల్వలు..

Tirumala Water Crisis: తిరుమలలో నీటి సంక్షోభం కలవరపెడుతోంది. ఎల్ నినో ప్రభావంతో తిరుమలలోని డ్యాములు ఖాళీ అవుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో గత ఏడాది కంటే 75 శాతం అధికంగా నీరు ఆవిరి అయినట్టు తెలుస్తోంది. దీంతో తిరుమలలోని హోటల్స్‌, అతిథి గృహాల్లో ఇప్పటికే నీటి పొదుపు చర్యలు పాటిస్తున్నారు.

Tirumala: ఎల్‌నినో ఎఫెక్ట్.. తిరుమలలో ఎండిపోతున్న డ్యామ్‌లు.. 90 రోజులకే నీటి నిల్వలు..
Tirumala Water Crisis
Raju M P R
| Edited By: |

Updated on: Oct 14, 2026 | 8:06 AM

Share

కలియుగ వైకుంఠం తిరుమలలోనూ నీటి కష్టాలు తలెత్తుతున్నాయి. ఎల్‌నినో ప్రభావం ఏడుకొండలపైనా పడింది. తిరుమలలో ఉన్న ఆరు డ్యాములు అడుగంటిపోతున్నాయి. ఆకాశగంగలో నీరు ఇప్పటికే పాతాళానికి పడిపోయింది. దీంతో కొండపై ఇప్పటికే నీటి పొదుపు చర్యలు మొదలయ్యాయి. తిరుమలలో ఉన్న ఆరు డ్యాములు ఆకాశగంగ, కుమారధార, పసుపు ధార, గోగర్భం, పాపనాశనం, కల్యాణి డ్యామ్‌ ఎండిపోతున్నాయి. వీటిలో ఆకాశగంగ పూర్తిగా ఎండిపోయింది. దీంతో ఇప్పుడు తిరుమలలో 100 రోజులకు కూడా సరిపడే నీటి నిల్వలు లేవు.. ప్రస్తుత అంచనా ప్రకారం.. 90 రోజులకే నీటి నిల్వలు ఉన్నట్లు చెబుతున్నారు.

75 శాతం అధికంగా నీరు ఆవిరి కావడంతో

తిరుమలలోని 5 డ్యాముల నీటి కెపాసిటీ 14,305 లక్షల గ్యాలన్లు. ప్రస్తుతం 5 డ్యాముల్లో 4000 లక్షల గ్యాలరీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. తిరుమలలో నీటి డిమాండ్ ప్రతిరోజు 52 లక్షల గ్యాలన్లు. ప్రస్తుతం రోజు తిరుమలలోని డ్యామ్‌లలో నుంచి 30 లక్షల గ్యాలన్లు, మిగతా 20 లక్షల గ్యాలన్ల నీటిని కళ్యాణి డ్యామ్‌ నుంచి TTD పంపింగ్ చేస్తోంది. కళ్యాణి డాం కెపాసిటీ 10 వేల లక్షల గ్యాలన్లు. ప్రస్తుతం ఈ డ్యామ్‌లో 5 వేల 672 లక్షల గ్యాలన్లు మాత్రమే నీటి నిలువ ఉంది. ఎల్ నినో ప్రభావంతో గత ఏడాది కంటే 75 శాతం అధికంగా నీరు ఆవిరి కావడంతో తిరుమలలోని డ్యామ్‌లు ఖాళీ అవుతున్నాయి.

టీటీడీ యాక్షన్ ప్లాన్ సిద్ధం

దీంతో తిరుమలలో నీటి కష్టాలను అధిగమించేందుకు టీటీడీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. తిరుపతి నుంచి అదనంగా మరో కొత్త పైపులైన్ వేయాలని టీటీడీ నిర్ణయించింది. గతంలో 24 గంటలపాటు నీటి సరఫరా జరుగుతుండగా ప్రస్తుతం 4 గంటలపాటు మాత్రమే నీటి విడుదల జరుగుతోంది. ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలపాటు మాత్రమే TTD నీటి సరఫరా చేస్తోంది. తిరుమలలో నీటి కష్టాలు పెరగడంతో హోటల్స్, అతిథి గృహాల్లో యజమానులు, భక్తులు నీటి పొదుపు పాటిస్తున్నారు.

Follow Us