AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

150 లక్కీ పర్సన్స్‌లో మీరూ ఉండాలా? BYD కొత్త ఎడిషన్​లో అంత స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా

ప్రీమియం ఎలక్ట్రిక్ SUV కొనాలనుకునే వారికి BYD కొత్త స్పెషల్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. BYD Sealion 7 Festive Edition పేరుతో విడుదలైన ఈ మోడల్‌ ధర రూ.50.60 లక్షలుగా ఉంది. కొత్త టాన్‌, బ్లాక్ ఇంటీరియర్ థీమ్‌తో ఆకట్టుకుంటున్న ఈ SUV కేవలం 150 యూనిట్లకే పరిమితం కావడం విశేషం.

150 లక్కీ పర్సన్స్‌లో మీరూ ఉండాలా? BYD కొత్త ఎడిషన్​లో అంత స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా
Byd Sealion 7 Festive Edition
Nikhil
|

Updated on: Oct 14, 2026 | 7:20 AM

Share

ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ప్రీమియం మోడళ్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో BYD Sealion 7 కోసం ప్రత్యేక ఎడిషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణ ప్రీమియం వేరియంట్‌తో పోలిస్తే కొత్త క్యాబిన్ కలర్ థీమ్‌తో వచ్చిన ఈ మోడల్‌లో అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్‌, ఆకట్టుకునే రేంజ్ ఉన్నాయి. దీని ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

కొత్త ఇంటీరియర్ థీమ్‌..

BYD Sealion 7 Festive Edition ధరను రూ.50.60 లక్షలుగా నిర్ణయించారు. ఇది సాధారణ ప్రీమియం వేరియంట్ కంటే రూ.70,000 ఎక్కువ. ఈ స్పెషల్ ఎడిషన్‌లో ప్రధానంగా ఇంటీరియర్ డిజైన్‌లో మార్పులు చేశారు. టాన్‌, బ్లాక్ కలర్ కాంబినేషన్‌తో క్యాబిన్‌కు కొత్త రూపాన్ని ఇచ్చారు. డ్యాష్‌బోర్డ్‌, డోర్ ప్యానెల్స్‌, సీట్లు, సెంటర్ కన్సోల్ ప్రాంతంలో ఈ రంగుల కలయిక కనిపిస్తుంది.

ధరల విషయానికి వస్తే.. BYD Sealion 7 డైనమిక్ వేరియంట్ రూ.41.90 లక్షలకు, ప్రీమియం వేరియంట్ రూ.49.90 లక్షలకు అందుబాటులో ఉన్నాయి. ప్రీమియం ఫెస్టివ్ ఎడిషన్ ధర రూ.50.60 లక్షలు కాగా, టాప్ పెర్ఫార్మెన్స్ వేరియంట్ ధర రూ.55.90 లక్షలుగా ఉంది. బయటి డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. కొత్త ఇంటీరియర్ కలర్ థీమ్‌నే ఈ ఎడిషన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. కేవలం 150 యూనిట్లను మాత్రమే విక్రయించనున్నట్లు సమాచారం.

567 కి.మీ. రేంజ్‌..

BYD Sealion 7 Festive Editionలో 15.6 అంగుళాల రొటేటింగ్ టచ్‌స్క్రీన్‌, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పనోరమిక్ గ్లాస్ రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముందు సీట్లకు ఎలక్ట్రిక్ అడ్జస్ట్‌మెంట్‌, వెంటిలేషన్ సదుపాయాలను అందించారు. 12 స్పీకర్ల ఆడియో సిస్టమ్‌ ప్రయాణ సమయంలో వినోదాన్ని అందిస్తుంది. భద్రత కోసం 11 ఎయిర్‌బ్యాగ్స్‌, 360 డిగ్రీ కెమెరా, Level 2 ADAS వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఇవి డ్రైవింగ్ సమయంలో భద్రతను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

బ్యాటరీ, పనితీరు విషయానికి వస్తే.. ఇందులో 82.56kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. వెనుక భాగంలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 313hp పవర్‌, 380Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ పేర్కొన్న NEDC పరీక్షా ప్రమాణాల ప్రకారం ఒక్కసారి ఛార్జ్‌తో 567 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ SUV గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 6.7 సెకన్లలో అందుకుంటుంది.

Follow Us