AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema OTT: పెళ్లికి ముందు ముఖం చూపిస్తే మరణమే.. ఓటీటీలో రచ్చ చేస్తున్న తెలుగు థ్రిల్లర్ మూవీ..

కొత్త కొత్త కంటెంట్ చిత్రాలకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఎలాంటి ప్రచారం, హడావిడి లేకుండా విడుదలైన కొన్ని చిత్రాలు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మాత్రం దూసుకుపోతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ కూడా అలాంటిదే. పెళ్లికి ముందు పరాయి పురుషుడికి ముఖం చూపిస్తే మరణశిక్ష విధించే వింత ఆచారం ఉన్న ఒక గ్రామం. ఊహకందని ఈ కట్టుబాటు నేపథ్యంగా తెరకెక్కిన తెలుగు సోషల్ డ్రామా గురించి ఇప్పుడు తెలుసుకుందామా.

Rajitha Chanti
|

Updated on: Oct 14, 2026 | 9:00 AM

Share
టాలీవుడ్ టాలెంటెడ్ నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియంటెడ్ సోషల్ థ్రిల్లర్ మూవీ 'పరదా'. భిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగియగానే ఊహించని విధంగా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం సైలెంట్‌గా ప్రత్యక్షమైంది. ప్రస్తుతం తెలుగుతో పాటు మలయాళ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది.

1 / 5
ప్రవీణ్ కంద్రగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌తో పాటు మలయాళ నటి దర్శన రాజేంద్రన్, టాలీవుడ్ ప్రముఖ నటి సంగీత (సంగీత క్రిష్) కీలక పాత్రలు పోషించారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న కట్టుబాట్లు, మూఢనమ్మకాలు, పితృస్వామ్య వ్యవస్థ, అస్తిత్వ పోరాటం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.

2 / 5
సినిమా కథ విషయానికొస్తే.. ఒక మారుమూల గ్రామంలో మహిళలు కఠినమైన ఆచారాలు, ముసుగు (పరధా) పద్ధతులను పాటిస్తుంటారు. అలాంటి ఊరికి చెందిన సుబ్బు (అనుపమ పరమేశ్వరన్) ముఖం అనుకోకుండా ఒక మ్యాగజైన్‌లో కనిపిస్తుంది. దీంతో ఆమె జీవితం ఒక్కసారిగా తల్లకిందులవుతుంది. తనపై నిందలు మోపిన ఆ పరిస్థితులను ఎదుర్కొంటూ, తన గౌరవాన్ని కాపాడుకోవడానికి సుబ్బు చేసే సాహసయాత్రే ఈ సినిమా ప్రధాన కథాంశం.

3 / 5
ఈ ప్రయాణంలో ఆమెకు ఎదురైన అనుభవాలు, రత్నమ్మ (సంగీత), అమి (దర్శన రాజేంద్రన్) పాత్రల మద్దతు సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలిచాయి. సాధారణంగా ఏ చిత్రమైనా థియేటర్లలో విడుదలైన కనీసం నాలుగు వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తుంటుంది. అయితే 'పరధా' మూవీ మాత్రం థియేట్రికల్ రన్ ముగిసిన వెంటనే మూడే వారాల వ్యవధిలో అమెజాన్ ప్రైమ్ వేదికగా డిజిటల్ ప్రేక్షకులను పలకరించింది.

4 / 5
గోపి సుందర్ అందించిన సంగీతం, మృదుల్ సుజిత్ సెన్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు, లేడీ ఓరియంటెడ్ కాన్సెప్ట్ చిత్రాలను ఇష్టపడే వారు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో ఈ సోషల్ థ్రిల్లర్‌ను చూడొచ్చు. ప్రస్తుతం ఈ సినిమా నెట్టింట దుమ్మురేపుతుంది.  ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయినవారు ఇప్పుడు నెట్టింట చూడొచ్చు.

5 / 5
Follow Us