AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెట్రో లుక్‌తో హిస్టరీని గుర్తు చేస్తున్న Citroen2 CV కొత్త కారు.. మార్కెట్లోకి వచ్చేదెప్పుడు?

పాతకాలపు కార్ల డిజైన్‌ను ఇష్టపడేవారికి ఫ్రెంచ్ ఆటోమొబైల్ సంస్థ Citroen కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేసింది. 1948లో చరిత్ర సృష్టించిన 2 CV మోడల్‌ను ఆధునిక రూపంలో తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. రెట్రో స్టైలింగ్‌, ప్రత్యేకమైన క్యాబిన్‌, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ లక్ష్యంతో రూపొందిన ఈ కాన్సెప్ట్ ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది.

రెట్రో లుక్‌తో హిస్టరీని గుర్తు చేస్తున్న Citroen2 CV కొత్త కారు.. మార్కెట్లోకి వచ్చేదెప్పుడు?
Citroen 2 Cv
Nikhil
|

Updated on: Oct 14, 2026 | 7:30 AM

Share

ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో కొత్తదనం తీసుకొచ్చేందుకు Citroen సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా Citroen 2 CV Concept పేరుతో పాత ఐకానిక్ మోడల్‌కు ఆధునిక రూపాన్ని అందిస్తోంది. చిన్న సైజ్‌, ఆకట్టుకునే డిజైన్‌, వినూత్న ఇంటీరియర్‌తో రూపొందిన ఈ కాన్సెప్ట్‌కు ప్రొడక్షన్ రూపం వస్తే 2028లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

పాత డిజైన్‌కు ఆధునిక హంగులు..

Citroen 2 CV అసలు మోడల్‌ను 1948లో పరిచయం చేశారు. ఇప్పుడు అదే పేరుతో కొత్త కాన్సెప్ట్‌ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పాత మోడల్‌లోని ప్రత్యేకమైన రూపాన్ని కొనసాగిస్తూనే ఆధునిక డిజైన్ అంశాలను జోడించారు. ఈ కాన్సెప్ట్ పొడవు సుమారు 3.76 మీటర్లు. రోజువారీ ప్రయాణాలకు అనువైన చిన్న ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌గా దీన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యం ఉంది.

ముందు భాగంలో LED హెడ్‌ల్యాంప్స్‌, రౌండ్ DRLలు, ప్రత్యేకమైన గ్రిల్ డిజైన్ ఆకట్టుకుంటాయి. బోనెట్‌పై V ఆకారపు డిజైన్ పాత 2 CV మోడల్‌ను గుర్తు చేస్తుంది. విండ్‌స్క్రీన్‌పై ఉన్న 1948, 1990, 2026 సంఖ్యలు అసలు మోడల్ చరిత్రను, కొత్త కాన్సెప్ట్ ఆవిష్కరణను సూచిస్తాయి.

సైడ్ ప్రొఫైల్‌లో వంపులతో కూడిన రూఫ్‌లైన్‌, నల్లటి వీల్ ఆర్చ్‌లు, 18 అంగుళాల స్టీల్ వీల్స్ ప్రత్యేకంగా కనిపిస్తాయి. వెనుక భాగంలో LED టెయిల్‌లైట్లు, నల్లటి టెయిల్‌గేట్‌, వెండి రంగు యాక్సెంట్లు ఉన్నాయి. టైర్ల పరిస్థితిని పర్యవేక్షించేందుకు Michelin అభివృద్ధి చేసిన డిజిటల్ టెక్నాలజీని కూడా ఈ కాన్సెప్ట్‌లో ప్రస్తావించారు.

డ్యాష్‌బోర్డ్ లేకుండా వినూత్న క్యాబిన్..

Citroen 2 CV Concept ఇంటీరియర్ సంప్రదాయ కార్లకు భిన్నంగా ఉంటుంది. తెలుపు, పసుపు రంగుల కలయికతో క్యాబిన్‌ను రూపొందించారు. టార్టాన్ పసుపు అప్హోల్స్టరీతో బెంచ్ తరహా సీట్లు అందించారు. సాధారణ డ్యాష్‌బోర్డ్‌, సెంటర్ కన్సోల్ డిజైన్‌కు భిన్నంగా ఎక్కువ స్థలం ఉన్న అనుభూతిని కలిగించేలా క్యాబిన్‌ను తీర్చిదిద్దారు.

స్టీరింగ్ వీల్ సమీపంలో కంట్రోల్ లివర్‌, 8 అంగుళాల టచ్‌స్క్రీన్‌, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉన్నాయి. సెంటర్ కన్సోల్ స్థానంలో తొలగించగల స్టోరేజ్ బాస్కెట్‌ను ఏర్పాటు చేశారు. ఫ్యాబ్రిక్ సన్‌రూఫ్‌, వేరు చేసి స్పీకర్‌లా ఉపయోగించగల రేడియో యూనిట్ మరో ప్రత్యేకత. యాక్సిలరేటర్‌, బ్రేక్ పెడల్స్‌పై కుందేలు, తాబేలు గుర్తులు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి.

ఈ కాన్సెప్ట్ ప్రొడక్షన్ వెర్షన్‌ను 2028లో విడుదల చేయాలని సంస్థ భావిస్తున్నట్లు సమాచారం. మార్కెట్లోకి వస్తే Citroen Ami, C3 మోడళ్ల మధ్య స్థానంలో ఉండవచ్చని అంచనా. ప్రారంభ ధర సుమారు 15,000 యూరోలు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.16 లక్షలు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.

Follow Us