AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mamata Banerjee: మాసీ సీఎం మమతా బెనర్జీపై హత్యాయత్నం.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు!

బెంగాల్‌లో మాజీ సీఎం మమతా బెనర్జీ నివాసం వద్ద ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మమతా బెనర్జీపై కత్తితో దాడికి యత్నించినట్లు తృణమూల్ కాంగ్రెస్ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఘటనలో కత్తి ప్రస్తావన ఏదీ లేదని, అక్కడ కేవలం వాగ్వాదం మాత్రమే జరిగిందని పోలీసులు వెల్లడించారు.

Mamata Banerjee: మాసీ సీఎం మమతా బెనర్జీపై హత్యాయత్నం.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు!
Security Scare At Mamata Banerjees House
Anand T
|

Updated on: Oct 14, 2026 | 9:16 AM

Share

బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ అసభ్య పదజాలంతో దూషిస్తూ..నానా హంగా చేసినట్టు టీఎంసీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు మహిళ రోడ్డుపై పడుకుని దురుసుగా ప్రవర్తించినట్లు పేర్కొన్నారు. అంతేకాదు ఈ సమయంలో మాజీ సీఎం మమతా బెనర్జీపై కత్తితో దాడి చేసేందుకు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ప్రయత్నించారని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు.

జెడ్-ప్లస్ భద్రత ఉన్న నేతకే సరైన రక్షణ కరవైందని పార్టీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఈ ఉదంతం వెనుక రాజకీయ కుట్ర ఉందని తృణమూల్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక టీఎంసీ నేతల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనకు సంబంధించి మహిళను అదుపులోకి తీసుకున్నారు.ఆమెను అనుసూయా సాహా అనే సివిక్ వాలంటీర్‌గా గుర్తించారు.

వీడియో చూడండి..

ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. భద్రతా సిబ్బంది ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నారు. అయితే టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నట్టుగా.. మమతా బెనర్జీపై ఎలాంటి హత్యప్రయత్నంగాని, కత్తితో దాడికి యత్నం కాని జరగలేదని..అక్కడ జరిగింది కేవలం వాగ్వాదం మాత్రమేనని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మాసీ సీఎం మమతా బెనర్జీపై హత్యాయత్నం.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు!
మాసీ సీఎం మమతా బెనర్జీపై హత్యాయత్నం.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు!
నవరాత్రుల నాలుగో రోజు మహా చండీదేవి అలంకారంలో కనకదుర్గ..
నవరాత్రుల నాలుగో రోజు మహా చండీదేవి అలంకారంలో కనకదుర్గ..
ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ డ్రామా..
ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ డ్రామా..
ఎప్పటికీ ఎవరూ బ్రేక్ చేయలేని సచిన్ ఆ 3 రికార్డులు ఇవే
ఎప్పటికీ ఎవరూ బ్రేక్ చేయలేని సచిన్ ఆ 3 రికార్డులు ఇవే
దసరా రోజు జమ్మిఆకులను ఎందుకు పంచుకుంటారు..దీని వెనక రహస్యం తెలుసా
దసరా రోజు జమ్మిఆకులను ఎందుకు పంచుకుంటారు..దీని వెనక రహస్యం తెలుసా
హైదరాబాద్‌లో భారత్-విండీస్ పోరు.. వైభవ్‌ కి చోటు దక్కుతుందా ?
హైదరాబాద్‌లో భారత్-విండీస్ పోరు.. వైభవ్‌ కి చోటు దక్కుతుందా ?
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. 2,721 పోస్ట్‌లతో నోటిఫికేషన్
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. 2,721 పోస్ట్‌లతో నోటిఫికేషన్
ఆ హీరోతో ఎక్కువ సినిమాలు ఎందుకు చేశానంటే.. హీరోయిన్ రోజా..
ఆ హీరోతో ఎక్కువ సినిమాలు ఎందుకు చేశానంటే.. హీరోయిన్ రోజా..
శ్రీ మహాచండీ దేవి అలంకారంలో కనకదుర్గమ్మ అమ్మవారు.. వీడియో చూశారా
శ్రీ మహాచండీ దేవి అలంకారంలో కనకదుర్గమ్మ అమ్మవారు.. వీడియో చూశారా
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తిరుమలలో నీటి ఎద్దడి!
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తిరుమలలో నీటి ఎద్దడి!