AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బొద్దింక తర్వాత ఈగ.. సీజేఐ ఒక్క కామెంట్‌తో పుట్టుకొచ్చిన మక్కీ జనతా పార్టీ..

కాక్రోచ్ జనతా పార్టీ హవా ఇంకా తగ్గకముందే.. ఇప్పుడు దేశంలోకి మరో కొత్త పార్టీ వచ్చేసింది.. అదే మక్కీ జనతా పార్టీ.. సీజేఐ నోటి నుంచి వచ్చిన ఒక్క చిన్న మాటతో ఇది పురుడుపోసుకుంది. కేవలం మూడు రోజుల్లోనే 3.3 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకుని పార్టీ అధికార ప్రతినిధుల కోసం దరఖాస్తులు కూడా ఆహ్వానిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

బొద్దింక తర్వాత ఈగ.. సీజేఐ ఒక్క కామెంట్‌తో పుట్టుకొచ్చిన మక్కీ జనతా పార్టీ..
Makhi Janta Party
Krishna S
|

Updated on: Oct 13, 2026 | 8:44 PM

Share

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన ఓ వ్యాఖ్య సోషల్ మీడియాలో సరికొత్త సెటైరికల్ ఉద్యమానికి తెరలేపింది. గతంలో వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ తరహాలోనే.. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మక్కీ జనతా పార్టీ పేరుతో ఏర్పాటైన ఒక వ్యంగ్య ఖాతా నెట్టింట విపరీతమైన వైరల్ అవుతోంది. కేవలం 72 గంటల వ్యవధిలోనే ఈ పేజీకి 40 లక్షలకు పైగా వ్యూస్, 3.3 లక్షలకు పైగా ఫాలోవర్లు వచ్చి చేరడం విశేషం. అక్టోబర్ 9న ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన నిరసనకు ముందు ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా స్తంభింపజేయడంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. భద్రతా కారణాలతో రవాణాను నియంత్రించవచ్చని, కానీ మొత్తం వ్యవస్థను ఆపేయడం సరికాదని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా అధికారుల చర్యలను తప్పుబడుతూ.. ‘‘ఒక చిన్న ఈగను చంపడానికి ఏకంగా సుత్తిని ఉపయోగించలేరు కదా’’ అంటూ ప్రధాన న్యాయమూర్తి చురకలంటించారు.

ఈగ పేరుతో నయా పార్టీ ఆవిర్భావం

సీజేఐ చేసిన ఈ వ్యాఖ్యను ఆధారంగా చేసుకుని సోషల్ మీడియాలో మక్కీ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. ‘‘స్వయంగా సీజేఐ ఈగను చంపడానికి సుత్తి వాడకూడదు అని అన్నప్పుడు.. మేమేమీ ఎవరికీ తక్కువ కాదని ఇప్పుడు ఈగ కూడా గర్వంగా చెబుతుంది’’ అంటూ హిందీలో పోస్టు పెట్టింది. ఆర్యన్ అనే విద్యార్థి ఈ పేజీ వ్యవస్థాపకుడిగా గుర్తించగా.. తమ పార్టీకి అధికార ప్రతినిధులు కావాలంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల్లో ప్రకటనలు కూడా ఇస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

గతంలో CJP.. ఇప్పుడు MJP

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వివరాల ప్రకారం.. ఈ పేజీ జూన్ 2021లోనే ప్రారంభమైనప్పటికీ, సుమారు ఎనిమిది సార్లు యూజర్‌నేమ్ మార్చుకుని చివరకు makhijantapartyగా స్థిరపడింది. గతంలో సీజేఐ చేసిన వ్యాఖ్యలతో కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చి తర్వాత పెద్ద ప్రజా ఉద్యమంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో మక్కీ జనతా పార్టీ కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షించే పనిలో పడింది.

View this post on Instagram

A post shared by @makhijantaparty.ig

Follow Us
సీజేఐ ఒక్క కామెంట్‌తో పుట్టుకొచ్చిన మక్కీ జనతా పార్టీ..
సీజేఐ ఒక్క కామెంట్‌తో పుట్టుకొచ్చిన మక్కీ జనతా పార్టీ..
ఈజీగా బరువు తగ్గేందుకు జపనీస్‌ 3-3-3 వాకింగ్ ఫార్ములా..ఇది నిజంగా
ఈజీగా బరువు తగ్గేందుకు జపనీస్‌ 3-3-3 వాకింగ్ ఫార్ములా..ఇది నిజంగా
దుబాయ్‌లో పంజాబీ ట్రక్ డ్రైవర్‌కు రూ.1.3 కోట్ల లాటరీ..!
దుబాయ్‌లో పంజాబీ ట్రక్ డ్రైవర్‌కు రూ.1.3 కోట్ల లాటరీ..!
అందమైన జా లైన్ కోసం సులువైన చిట్కాలు.. ముఖంపై కొవ్వుకు చెక్!
అందమైన జా లైన్ కోసం సులువైన చిట్కాలు.. ముఖంపై కొవ్వుకు చెక్!
విజయవాడ ఉత్సవ్‌లో చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌..
విజయవాడ ఉత్సవ్‌లో చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌..
ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!
ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!
ఇడ్లీ, దోశ పిండిలో ఇదొక్కటి వేస్తే జరిగే మ్యాజిక్కే వేరు..
ఇడ్లీ, దోశ పిండిలో ఇదొక్కటి వేస్తే జరిగే మ్యాజిక్కే వేరు..
సోఫా కింద ఉంచిన పింగాణీ పళ్లానికి వేలంలో కళ్లు చెదిరే ధర!
సోఫా కింద ఉంచిన పింగాణీ పళ్లానికి వేలంలో కళ్లు చెదిరే ధర!
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3రోజుల వాతావరణం ఎలా ఉంటుందంటే?
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3రోజుల వాతావరణం ఎలా ఉంటుందంటే?
గౌతమ్ రాజు ఆ జబ్బుతో బాధపడుతున్నారా?స్వయంగా క్లారిటీ ఇచ్చిన నటుడు
గౌతమ్ రాజు ఆ జబ్బుతో బాధపడుతున్నారా?స్వయంగా క్లారిటీ ఇచ్చిన నటుడు