AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

El Nino: ఎల్‌నీనో ఎఫెక్ట్.. ఏపీ రైతుల్లో పెరుగుతున్న కిడ్నీ సమస్యలు.. తాజా నివేదికల్లో..

ఎల్‌నినో అంటే ఇప్పటివరకు వర్షాభావ పరిస్థితులు, ఎండిపోయే పంటపొలాలు, నీటి ఎద్దడి మాత్రమే గుర్తొచ్చేవి. కానీ, ఈ వాతావరణ మార్పు ఇప్పుడు నేరుగా మనుషుల ప్రాణాల మీదికే దాడి చేస్తోందన్న చేదు నిజం తాజా నివేదికల్లో వెల్లడైంది. ఎల్‌నినో సృష్టిస్తున్న భానుడి భగభగలకు ఎండలో శ్రమించే రైతులు, కూలీలు తీవ్ర కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారట. అసలు ఎల్‌నినో ప్రభావం మూత్రపిండాలపై ఎలా పడుతోంది? వైద్య నిపుణులు చెబుతున్న హెచ్చరికలేంటి? ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

El Nino: ఎల్‌నీనో ఎఫెక్ట్.. ఏపీ రైతుల్లో పెరుగుతున్న కిడ్నీ సమస్యలు.. తాజా నివేదికల్లో..
El Ninos Impact On The Kidneys Of Ap Farmers
Anand T
|

Updated on: Oct 13, 2026 | 12:11 PM

Share

ఎల్‌నినో తీవ్రతపై వస్తున్న నివేదికలు దేశ ప్రజలను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఇవి కేవలం పంటపొలాలపైనే కాకుండా.. రోజువారీ కూలీలు, రైతుల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని తాజా నివేదికలు చెబుతున్నాయి. పెరుగుతున్న ఎండ తీవ్రత కారణంగా ఒడిశాలోని బర్‌గఢ్ జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్దానం వంటి ప్రాంతాల్లో ఎండలో పనిచేసే రైతుల్లో డీహైడ్రేషన్, మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు, కిడ్నీల పనితీరు దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతున్నట్లు పేర్కొన్నాయి.

గ్లోబల్ హీట్ హెల్త్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్ సౌత్ ఏషియా హబ్ నివేదిక ప్రకారం.. ఒడిశాలోని బర్‌గఢ్ జిల్లా రైతులు రోజంతా ఎండలో పనిచేయడం, వ్యవసాయంలో ఎక్కువగా రసాయనాలు వాడటం వల్ల వారిలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు గుర్తించారు. అయితే ఒడిశాతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, గోవాలలో ఈ కిడ్నీ సమస్యలు ఎక్కువగా పెరుగుతున్నప్పటికీ.. వాటికి నిర్దిష్ట కారణం ఏంటనేది మాత్రం తెలియట్లేదు. అంతేకాదు, మధ్య అమెరికా, శ్రీలంక, ఈజిప్ట్‌లలో ఎక్కువగా కనిపించిన కేసుల లక్షణాలతో ఇవి సరిపోలడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఉద్దానం పరిశోధనలో వెలుగుచూసిన నిజాలు

రాష్ట్రంలోని రైతుల్లో రోజురోజుకూ పెరుగుతున్న ఈ కిడ్నీ సమస్యలపై దృష్టి పెట్టిన నిపుణులు.. ఉద్దానం ప్రాంతంలోని 36 గ్రామాల పరిధిలో 18 నుంచి 75 ఏళ్ల వయసున్న కార్మికులపై అధ్యయనం నిర్వహించారు. ఇందులో వ్యవసాయం, ఇటుక బట్టీలు, నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు ఎండ వేడిమి వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నట్టు గుర్తించారు. ఉష్నోగ్రతలు 27.5 డిగ్రీల సెల్సియస్ దాటినప్పుడు బరువైన పనులు చేసేవారికి, 28 డిగ్రీలు దాటినప్పుడు సాధారణ పనులు చేసేవారికి కిడ్నీల పనితీరు దెబ్బతినే ప్రమాదం సాధారణం కంటే రెండింతలు ఎక్కువగా ఉందని గుర్తించారు.

అంతేకాదు, ఈ తీవ్రమైన ఎండలు కేవలం అనారోగ్యానికే కాకుండా కార్మికుల పని సామర్థ్యాన్ని, కుటుంబ ఆదాయాన్ని కూడా దెబ్బతీస్తున్నాయని నివేదికలు పేర్కొన్నాయి. పెరుగుతున్న ఆరోగ్య సమస్యల కారణంగా వైద్య ఖర్చులు పెరిగి వారి ఆర్థిక పరిస్థితిపై కూడా భారం పడుతోందని స్పష్టం చేశాయి. 2021-23 మధ్య కాలంలో తమిళనాడులో ఏర్పడిన పరిస్థితులే ఇందుకు నిదర్శనమని నివేదికలు తెలిపాయి.

నివేదికలు చేస్తున్న సూచనలు

ఎల్‌నినో ప్రభావంతో పెరుగుతున్న ఎండలు, ముందస్తు చర్యలు లేకపోవడం వల్లే దేశంలో ఎండ తీవ్రతతో వచ్చే రోగాలు, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని.. వీటిని తగ్గించేందుకు కేవలం ఎండలు ముదిరినప్పుడు మాత్రమే స్పందించడం కాకుండా, ప్రజలందరినీ కాపాడేందుకు ప్రభుత్వం ముందునుంచే పక్కా ప్రణాళికతో అన్ని రంగాలను కలుపుకొని పనిచేయాలని నివేదిక సూచిస్తోంది. రైతులు, కూలీలకు ఎండ తగలకుండా పని వేళలు మార్చడం, సరిపడా తాగునీరు అందించడం, నగరాల్లో చెట్లు, నీడ ఉండేలా ప్లాన్ చేసుకోవడం, ఆసుపత్రులను ముందుగానే సిద్ధం చేయడం వంటి చర్యలను పక్కా ప్రణాళికతో అమలు చేయాలని స్పష్టం చేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us