రూటు మారుస్తున్న నేచురల్ స్టార్ నాని
న్యాచురల్ స్టార్ నాని తన కెరీర్ ప్లానింగ్‌లో కీలక మార్పులు చేస్తున్నారు. మాస్, యాక్షన్ సినిమాల నుంచి సున్నితమైన, ఫ్యామిలీ ప్రేక్షకుల మెచ్చే కథల వైపు అడుగులు వేస్తున్నారు. బ్లడీ రోమియో స్క్రిప్ట్‌లో మార్పులతో పాటు, 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో ఓ ప్రేమకథకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
న్యాచురల్ స్టార్ నాని తన కెరీర్ దిశను మారుస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవల ది ప్యారడైజ్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన నాని, త్వరలో బ్లడీ రోమియోతో రానున్నారు. అయితే, వరుస యాక్షన్ చిత్రాలతో మాస్ ఇమేజ్ తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఒక క్రేజీ నిర్ణయం తీసుకున్నారు. హిట్ 3, ది ప్యారడైజ్ వంటి సినిమాలతో మాస్ ప్రేక్షకులకు దగ్గరైన నాని, వాటిలో హింస ఎక్కువగా ఉండటంతో కుటుంబ ప్రేక్షకులకు కాస్త దూరమయ్యారనే టాక్ నడుస్తోంది. దీంతో నాని ఇకపై మితిమీరిన హింసకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. సుజిత్ దర్శకత్వంలో రూపొందనున్న బ్లడీ రోమియో స్క్రిప్ట్‌లోనూ కొన్ని మార్పులు చేయించి, వైలెన్స్ తగ్గించి యు/ఏ సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కేవలం వైలెంట్‌గా కాకుండా స్టైలిష్‌గా, విట్టిగా ఉంటుందని నాని స్వయంగా వెల్లడించారు. బ్లడీ రోమియో తర్వాత, నాని ఒక సెన్సిటివ్ లవ్ స్టోరీ చేయబోతున్నట్లు కూడా కన్ఫర్మ్ చేశారు. 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. క్లాస్ మూవీస్ తీసే ప్రేమ్ కుమార్, నానితో వర్క్ చేయడం కొంత రిస్కే అని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం.. ఈసారి మహేష్ బాకీ తీర్చేస్తాడా?
నిన్న నాని.. నేడు విజయ్.. ఇది సీరియస్ మ్యాటర్..!
టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న మమితా బైజు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

