AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: ఆ ఇద్దరి మధ్యనే బిగ్‌బాస్ తెలుగు 10 టైటిల్ రేస్.. కప్పు కొట్టేది ఎవరో చెప్పేసిన చరణ్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఎలిమినేట్ అయిన చరణ్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా తన బిగ్ బాస్ జర్నీ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఇదే క్రమంలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరో కూడా జోస్యం చెప్పాడు.

Bigg Boss Telugu 10: ఆ ఇద్దరి మధ్యనే బిగ్‌బాస్ తెలుగు 10 టైటిల్ రేస్.. కప్పు కొట్టేది ఎవరో చెప్పేసిన చరణ్
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Oct 13, 2026 | 12:02 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో మెయిన్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు చరణ్. అగ్ని పరీక్ష సీజన్ 2లో సత్తా చాటి కామనర్స్ కోటాలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆశ్చర్యకరంగా మొదటి మూడు రోజుల్లోనే ఎలిమినేట్ అయ్యాడు. ఆ తర్వాత అదృష్టం కొద్దీ మళ్లీ హౌస్ లోకి రీ ఎంట్రీఇచ్చాడు. కానీ ఈ సెకెండ్ ఛాన్స్ ను ఏ మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయాడు చరణ్. ఆడియెన్స్ కు అవసరమైన ఎంటర్ టైన్మెంట్ అందించలేకపోయాడు. కనీసం కంటెంట్‌ ఇవ్వకుండా హౌస్ లో సైలెంట్ గా ఉండిపోయాడు. ఫిజికల్ టాస్కుల్లోనూ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. దీంతో ఐదో వారంలో మళ్లీ ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు చరణ్. బిగ్ బాస్ హిస్టరీ లో హౌస్ మేట్స్ ఓట్లతో ఒకసారి ఎలిమినేట్ అయిన వాళ్లను చూశాం.. కానీ, రెండు సార్లు హౌస్ మేట్స్ ఓట్లతో ఎలిమినేట్ అవ్వడం మాత్రం ఇదే మొదటిసారి. కాగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాడు చరణ్. ఈ క్రమంలోనే తన బిగ్ బాస్ జర్నీ, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు. ఇదే క్రమంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ టైటిల్ విన్నర్ అవుతారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు చరణ్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.

బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు కానీ ఆడియెన్స్ కు కానీ త్రిగున్ చేసేవి నచ్చొచ్చు కాబట్టి , ఆయనకు ఓట్లు వేస్తుండొచ్చు, మరికొంత మందికి రోహిత్ గేమ్ ప్లాన్ నచ్చి ఉండొచ్చు. ప్రస్తుతానికి ఎవరు బెస్ట్ అనేది అంచనా వేయడం కష్టం. కానీ ఫైనల్ గా రోహిత్, త్రిగున్ మధ్యనే బిగ్ బాస్ టైటిల్ రేస్ ఉంటుంది’ అని సమాధానం ఇచ్చాడు చరణ్. ఇక తన ఎలిమినేషన్ పై స్పందిస్తూ.. ‘నా ఎలిమినేషన్ హౌస్‌మేట్స్ ఓటింగ్‌తో జరిగింది. రెండుసార్లూ ఇలాగే జరిగింది. ప్రేక్షకుల ఓట్లతో రెండుసార్లూ నేను ఇంటిలోకి వెళ్లినా, హౌస్‌మేట్స్ నిర్ణయం వల్లే బయటకొచ్చాను. అగ్నిపరీక్ష నుంచి మొదలైన నా ప్రయాణంలో ప్రేక్షకులు చూపిన ప్రేమకు కృతజ్ఞతలు. డే వన్ ఆడిషన్స్ నుంచి ప్రేక్షకులు నన్ను ఆదరించారు. ఈ ప్రేమ ఇలాగే కొనసాగాలి. నాకు ఓట్లు వేసి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు చెబుతున్నాను’ అని పేర్కొన్నాడు చరణ్.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ హౌస్ లో చరణ్ జర్నీ..

బిగ్ బాస్ తెలుగు 10 లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us