” రణబాలి ” ట్రైలర్ పై మంత్రి నారా లోకేష్ ప్రశంసలు
విజయ్ దేవరకొండ, రష్మికా మందన జంటగా నటించిన రణబాలి ట్రైలర్‌పై ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రశంసలు కురిపించారు. 1800 నాటి రాయలసీమ, బ్రిటిష్ కాలం నాటి కరువు పరిస్థితులను వాస్తవికంగా చిత్రీకరించడాన్ని అద్భుతమని కొనియాడారు. నటీనటుల నటనను, దర్శకుడి కృషిని అభినందించిన లోకేష్, అక్టోబర్ 16న విడుదల కానున్న ఈ సినిమాకు విజయం కలగాలని ఆకాంక్షించారు.
టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మికా మందన జంటగా నటిస్తున్న చిత్రం రణబాలి. దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, టీ సిరీస్ ఫిలిమ్స్ నిర్మించాయి. దసరా కానుకగా అక్టోబర్ 16న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, డాక్యుమెంటరీలతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యూట్యూబ్, సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ దుమ్ము రేపుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేష్ రణబాలి ట్రైలర్‌ను చూసి చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు.లోకేష్ తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, “రణబాలి ట్రైలర్ ఇప్పుడే చూశాను. వావ్. అద్భుతమైన అనుభూతి కలిగింది. 1800 నాటి రాయలసీమను పునఃసృష్టించడంలో, బ్రిటిష్ వారి కాలంలోని కరువు, అణిచివేతతో నిండిన ఆ హృదయ విదారక యుగాన్ని చిత్రీకరించడంలో చూపిన శ్రద్ధ అసాధారణం” అని పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం.. ఈసారి మహేష్ బాకీ తీర్చేస్తాడా?
నిన్న నాని.. నేడు విజయ్.. ఇది సీరియస్ మ్యాటర్..!
టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న మమితా బైజు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

