స్కిన్ చికెన్ వీరికి విషంతో సమానం.. అస్సలు తినొద్దు!

13 Oct 2026

Anand T

నాన్‌వెజ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది చికెన్.. చాలా మంది సండే వచ్చిదంటే ముక్కలేనిదే ముద్దదిగదు.

చికెన్

అయితే మార్కెట్‌లో మనకు స్కిన్ చికెన్, స్కిన్‌లెస్ 2 దొరుకుతాయి. మరి ఈ రెండింట్లో ఏది బెస్ట్.. స్కిన్‌ చికెన్ తినడం మంచిదా కాదా తెలుసుకుందాం.

స్కిన్ చికెన్

అయితే స్కిన్ చికెన్‌ కూడా ఆరోగ్యకరమైనదే. కానీ ఇది అందిరికీ మంచిది కాకపోవచ్చు.

అందరికీ కాదు

ఎందుకంటే చికెన్ చర్మంలో కొవ్వు, కేలరీలు అధికంగా ఉంటాయి. బరువు తగ్గాలి అనుకునే వారికి వీటిని తినకపోవడమే మంచిది.

బరువు తగ్గేవారు

అంతేకాదు చికెన్ చర్మంలోని సంతృప్త కొవ్వులు ఎక్కవుగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులకు కారణం కావచ్చు

గుండె జబ్బు

ముఖ్యంగా అధిక కొలెస్ట్రాల్ ఉన్న వ్యక్తులు స్కిన్‌ చికెన్‌కు చాలా దూరంగా ఉండాలి. లేదంటే కొలెస్ట్రాల్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది?

కొలెస్ట్రాల్

రక్తపోటు ఉన్నవారు కూడా ఈ స్కిన్ చికెన్‌కు దూరంగా ఉండాలి.. ఎందుకంటే చికెన్‌ స్కి్న్‌లో ఉండే కొవ్వులు రక్తనాళాలను కుదించి రక్తపోటును మరింత పెంచుతాయి.

రక్తపోటు

జీర్న సమస్యలు ఉన్నవారు కూడా దీనిని తినవద్దు.. ఎందుకంటే ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. తద్వారా కడుపు సమస్యలు రావచ్చు.

జీర్ణ సమస్యలు

కాబట్టి స్కిన్ చికెన్ రుచికి మంచిగానే ఉన్నప్పటికీ..ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తినే ముందు కచ్చితంగా వైద్యులను సంప్రదించండి.

వైద్యుల సలహా