అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరులో శీతాకాలం ముందే తన ప్రభావాన్ని చూపుతోంది. దట్టమైన పొగమంచు, పడిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా చలి తీవ్రత పెరిగింది. ప్రస్తుతం ఉష్ణోగ్రత 15 డిగ్రీలకు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు. ఈ అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు ఏజెన్సీకి క్యూ కడుతున్నారు.