AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెట్‌ఫ్లిక్స్‌లో భారీగా ఉద్యోగాల కోత

నెట్‌ఫ్లిక్స్‌లో భారీగా ఉద్యోగాల కోత

Samatha J
|

Updated on: Oct 13, 2026 | 11:28 AM

Share

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో భారీగా ఉద్యోగాల కోతకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో 5 శాతం మందిని తొలగించాలని యాజమాన్యం ప్రణాళికలు రచిస్తోంది. మార్కెట్‌లో తీవ్రమైన పోటీ, ఖర్చుల నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, దీనిపై నెట్‌ఫ్లిక్స్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో భారీగా ఉద్యోగాల కోతకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కంపెనీలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 5 శాతం మందిని తొలగించాలని యాజమాన్యం ప్రణాళికలు రచిస్తోంది. దీనికి సంబంధించి వచ్చే వారంలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఈ వార్తలపై నెట్‌ఫ్లిక్స్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.ప్రస్తుతం మార్కెట్‌లో పోటీ విపరీతంగా పెరిగిపోవడంతో నెట్‌ఫ్లిక్స్ తన వ్యాపార విధానాల్లో మార్పులు చేస్తోంది. యూట్యూబ్ వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తీవ్ర పోటీ ఎదురుకావడంతో కంపెనీ తన వ్యూహాలను మార్చుకుంటోంది. ఇందులో భాగంగానే ఖర్చులను నియంత్రించుకోవడానికి ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆదాయాన్ని పెంచుకునేందుకు లైవ్ ప్రోగ్రామింగ్, గేమింగ్ మరియు ప్రకటనల ఆధారిత ప్లాన్‌లపై నెట్‌ఫ్లిక్స్ భారీగా పెట్టుబడులు పెడుతోంది. గతంలో 2022లో కూడా సబ్‌స్క్రైబర్ల సంఖ్య తగ్గడం, వ్యాపార వృద్ధి మందగించడం వల్ల నెట్‌ఫ్లిక్స్ ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. గతేడాది చివరి నాటికి ఈ సంస్థలో సుమారు 16,000 మంది పూర్తికాలపు ఉద్యోగులు సేవలు అందిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం.. ఈసారి మహేష్ బాకీ తీర్చేస్తాడా?

నిన్న నాని.. నేడు విజయ్.. ఇది సీరియస్ మ్యాటర్..!

టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న మమితా బైజు

రజినీకాంత్ ట్రిపుల్ ధమాకా.. అంత తొందరేంటో..?

హిట్ కొట్టాలంటే డీ గ్లామర్ తప్ప మరో దారిలేదా..?

Follow Us