AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్ తరపున, భారత గడ్డపై వైభవ్ తొలి మ్యాచ్.. టీ20ల్లో బుడ్డోడి అరాచకంపై ఓ లుక్కేయండి..!

Vaibhav Sooryavanshi: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, కేవలం 15 ఏళ్ల వయసులోనే IPL, అంతర్జాతీయ T20లలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మొత్తంగా వైభవ్ 48 T20 మ్యాచ్‌లు ఆడాడు. అతని గణాంకాలు, ముఖ్యంగా 200+ స్ట్రైక్ రేట్, భవిష్యత్ క్రికెట్ స్టార్‌గా అతన్ని నిలబెడుతున్నాయి. వెస్టిండీస్‌తో జరిగే నాలుగో T20లో వైభవ్‌కు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది.

భారత్ తరపున, భారత గడ్డపై వైభవ్ తొలి మ్యాచ్.. టీ20ల్లో బుడ్డోడి అరాచకంపై ఓ లుక్కేయండి..!
Vaibhav Suryavanshi Stats
Venkata Chari
|

Updated on: Oct 13, 2026 | 12:12 PM

Share

భారత క్రికెట్‌లో ఇప్పుడు అందరి దృష్టి యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi)పైనే ఉంది. 15 ఏళ్ల ఈ ఎడమచేతి బ్యాటర్ ఇప్పటికే ఐపీఎల్‌లో సంచలన ప్రదర్శనలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ అడుగుపెట్టి సత్తా చాటాడు. తాజాగా వెస్టిండీస్‌తో హైదరాబాద్‌లో జరిగే నాలుగో టీ20లో అతడికి తుది జట్టులో అవకాశం లభించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. వైభవ్ ఇప్పటికే భారత్ తరపున 8 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో 246 పరుగులు చేశాడు. అతడి సగటు 30.75 కాగా, స్ట్రైక్ రేట్ ఏకంగా 186.36గా ఉంది. అత్యధిక స్కోరు 81. రెండు అర్ధశతకాలు సాధించాడు. 22 ఫోర్లు, 18 సిక్సర్లు బాదాడు. అయితే, ఇప్పటి వరకు భారత గడ్డపై అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. ఒకవేళ ప్లేయింగ్ 11లో చోటు దక్కితే హైదరాబాద్‌లో భారత జట్టు తరపున స్వదేశంలో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ క్రమంలో బుడ్డోడి రికార్డులను ఓసారి చూద్దాం..!

ఐపీఎల్‌తో కలిపితే 40 టీ20లు..

ఐపీఎల్‌తో పాటు ఇతర దేశవాళీ టీ20 మ్యాచ్‌లను కలిపి చూస్తే వైభవ్ ఇప్పటివరకు 40 టీ20లు ఆడాడు. వీటిలో 1,670 పరుగులు చేశాడు. సగటు 42.82, స్ట్రైక్ రేట్ 216.32. 132 ఫోర్లు, 148 సిక్సర్లు బాదాడు. 4 శతకాలు, 8 అర్ధశతకాలు అతడి ఖాతాలో ఉన్నాయి. అత్యధిక స్కోరు 144.

ఎక్కువమంది చదివినది: 6,W,6,W,6,W,6,W,6,W.. సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!

ఇవి కూడా చదవండి

ఐపీఎల్‌లో మాత్రమే చూస్తే వైభవ్ 23 మ్యాచ్‌ల్లో 1,028 పరుగులు చేశాడు. అతడి సగటు 44.70 కాగా, స్ట్రైక్ రేట్ ఏకంగా 228.95. 81 ఫోర్లు, 96 సిక్సర్లు, 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

అంటే సీనియర్ టీ20లు, టీ20 ఇంటర్నేషనల్స్ కలిపి చూసినప్పుడు వైభవ్ ఇప్పటివరకు 48 టీ20 మ్యాచ్‌ల్లో 1,916 పరుగులు చేసినట్టవుతుంది. మొత్తం 154 ఫోర్లు, 166 సిక్సర్లు అతడి ఖాతాలో ఉన్నాయి. ఈ గణాంకాలు అక్టోబర్ 3న పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా క్రీడల మ్యాచ్ వరకు ఉన్న రికార్డుల ఆధారంగా ఉన్నాయి.

ఎక్కువమంది చదివినది: బ్రేకప్‌కు బ్రేక్.. మళ్లీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్.. అసలు ఏం జరిగిందంటే?

వైభవ్ గణాంకాలు ఒకసారి చూస్తే..

Vaibhav Sooryavanshi Stats

(*సీనియర్ T20, T20I గణాంకాలను కలిపిన లెక్క.)

హైదరాబాద్‌లో ఏం జరగనుంది?

వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. నాలుగో మ్యాచ్ అక్టోబర్ 14న హైదరాబాద్‌లో జరగనుంది. వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కితే, హైదరాబాద్ ప్రేక్షకుల ముందు మరోసారి అతడి భారీ షాట్లను చూసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో 200కు పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగుల వరద పారించిన ఈ యువ బ్యాటర్.. అంతర్జాతీయ స్థాయిలోనూ తన దూకుడును కొనసాగిస్తున్నాడు. అయితే 15 ఏళ్లకే ఇంతటి టీ20 అనుభవం, 1,900కు పైగా పరుగులు, 166 సిక్సర్లు సాధించడం మాత్రం అతడి అసాధారణ బ్యాటింగ్ సామర్థ్యాన్ని చాటుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us