AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోహ్లీ కంటే ఖతర్నాక్ ప్లేయర్స్.. కట్‌చేస్తే.. బ్యాడ్‌లక్‌తో టీమిండియాకు దూరమైన ముగ్గురు..!

Failed Cricket Careers: ఒకప్పుడు విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ ప్రతిభావంతులుగా భావించిన ముగ్గురు భారత క్రికెటర్ల గురించి ఈ కథనం. మనీష్ పాండే, మనోజ్ తివారీ, సౌరభ్ తివారీలు అద్భుతమైన ప్రారంభాలు చేసినా, గాయాలు, నిలకడ లేమి, అవకాశాల కొరత వంటి కారణాలతో టీమిండియాలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయారు. వారి కెరీర్‌లు ఎందుకు ఆశించిన స్థాయిలో కొనసాగలేదో ఇక్కడ తెలుసుకోండి.

కోహ్లీ కంటే ఖతర్నాక్ ప్లేయర్స్.. కట్‌చేస్తే.. బ్యాడ్‌లక్‌తో టీమిండియాకు దూరమైన ముగ్గురు..!
Virat Kohli Like Talent Players
Venkata Chari
|

Updated on: Oct 12, 2026 | 5:29 PM

Share

Failed Cricket Careers: కుడిచేతి వాటం బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) భారత క్రికెట్ చరిత్రలో గొప్ప ఆటగాళ్లలో ఒకడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో పాటు నిలకడైన ప్రదర్శనతో అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే ఎంతో మంది యువ క్రికెటర్లకు విరాట్ కోహ్లీలా ఉన్నత స్థాయికి చేరుకోవాలనే కల ఉంటుంది. అయితే ఒకప్పుడు ముగ్గురు భారత ఆటగాళ్లను విరాట్ కోహ్లీ కంటే కూడా ఎక్కువ ప్రతిభావంతులుగా భావించేవారు. కానీ అంతర్జాతీయ క్రికెట్‌లో తమ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో నిరూపించుకోలేకపోవడంతో జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయారు. ఇంతకీ ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం.

మనీష్ పాండే..

2009లో ఐపీఎల్‌లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచిన మనీష్ పాండే (Manish Pandey).. కెరీర్ ఆరంభంలోనే తన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. 2016లో సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో అజేయంగా 104 పరుగులు చేసి భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. ఆ ఇన్నింగ్స్‌తో తన ప్రతిభను మరోసారి చాటుకున్నాడు. అయితే నిలకడ లేకపోవడం, స్ట్రైక్ రేట్ వంటి అంశాలు అతడి కెరీర్‌పై ప్రభావం చూపాయి. దీంతో జట్టులో తన స్థానాన్ని శాశ్వతం చేసుకోలేకపోయాడు. తరచూ జట్టులోకి రావడం, బయటకు వెళ్లడం జరుగుతూ వచ్చింది.

ఎక్కువమంది చదివినది: గంభీర్ నమ్మకానికే వెన్నుపోటు.. కట్‌చేస్తే.. హైదరాబాద్‌ మ్యాచ్‌లోనూ ఈ ముగ్గురు బెంచ్‌కే ఫిక్స్..!

ఇవి కూడా చదవండి

మనోజ్ తివారీ..

బెంగాల్‌కు చెందిన బ్యాటర్ మనోజ్ తివారీ (Manoj Tiwary)ను ఒకప్పుడు కెవిన్ పీటర్సన్ వంటి స్టార్ ఆటగాళ్లతో పోల్చేవారు. దేశవాళీ క్రికెట్‌లో తన జట్టు తరఫున ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. దీంతో అతడిని విరాట్ కోహ్లీ కంటే కూడా ప్రమాదకరమైన బ్యాటర్‌గా కొందరు భావించేవారు. అయితే గాయాలు, జట్టులో చోటు కోసం తీవ్ర పోటీ కారణంగా మనోజ్ తివారీ అంతర్జాతీయ క్రికెట్‌లో ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయాడు. అతడిపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగా సుదీర్ఘ కెరీర్‌ను కొనసాగించలేకపోయాడు.

సౌరభ్ తివారీ..

ఈ జాబితాలో చివరి పేరు జార్ఖండ్‌కు చెందిన ఎడమచేతి వాటం బ్యాటర్ సౌరభ్ తివారీ (Saurabh Tiwary). పొడవాటి జుట్టు, బలమైన శరీరాకృతి, భారీ సిక్సర్లు కొట్టే సామర్థ్యంతో అతడిని ‘ఎంఎస్ ధోనీ క్లోన్’, ‘జూనియర్ ధోనీ’ అని పిలిచేవారు. 2008లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత అండర్-19 జట్టులో సౌరభ్ తివారీ భాగంగా ఉన్నాడు. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లోనూ మంచి ప్రదర్శనలు చేశాడు. ఈ ప్రదర్శనల ఆధారంగా 2010లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టుకు అరంగేట్రం చేసే అవకాశం దక్కింది.

ఎక్కువమంది చదివినది: రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే.. ఫ్యూచర్ చెప్పేసిన ఆసీస్ దిగ్గజం..!

అయితే తగినన్ని అవకాశాలు లభించకపోవడంతో అంతర్జాతీయ క్రికెట్‌లో తన కెరీర్‌ను ఎక్కువ కాలం కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు ఫిట్‌నెస్ సమస్యలు, ఫామ్‌లో పడిపోయిన స్థాయి కూడా అతడి కెరీర్‌కు అడ్డంకులుగా మారాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us