AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI 4th T20I: ఉప్పల్ స్టేడియంలో కాటేరమ్మ కొడుకు రికార్డులు ఇవే.. విండీస్‌కు దబిడ దిబిడే..!

Abhishek Sharma IPL stats Hyderabad: భారత్ వర్సెస్ వెస్టిండీస్ 4వ టీ20ఐకి ముందు, హైదరాబాద్‌ రాజీవ్ గాంధీ స్టేడియంలో అభిషేక్ శర్మ రికార్డు అభిమానులలో ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం సిరీస్‌లో మంచి ఫామ్‌లో ఉన్న అభిషేక్, ఈ స్టేడియంలో అద్భుతమైన టీ20ఐతోపాటు ఐపీఎల్‌లో అద్భుత గణాంకాలు కలిగి ఉన్నాడు. అదేంటో ఓసారి చూద్దాం..!

IND vs WI 4th T20I: ఉప్పల్ స్టేడియంలో కాటేరమ్మ కొడుకు రికార్డులు ఇవే.. విండీస్‌కు దబిడ దిబిడే..!
Abhishek Sharma Ipl Stats Hyderabad
Venkata Chari
|

Updated on: Oct 12, 2026 | 5:42 PM

Share

Abhishek Sharma IPL stats Hyderabad: ఆదివారం జరిగిన మూడో టీ20లో వెస్టిండీస్‌పై భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇప్పుడు సిరీస్ తదుపరి మ్యాచ్ కోసం హైదరాబాద్‌కు చేరుకుంది. భారత క్రికెట్‌లోని పలువురు స్టార్ ఆటగాళ్లకు ఇది ఐపీఎల్ వేదిక కాగా, అభిషేక్ శర్మకు మాత్రం సొంత మైదానంలాంటి ప్రాంతం.

భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత్-వెస్టిండీస్ 2026 టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అతను ఐదో స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు మూడు ఇన్నింగ్స్‌ల్లో 110 పరుగులు చేశాడు. ఇండోర్‌లో జరిగిన గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించి మంచి ఊపులో ఉన్నాడు.

ఇక టీమిండియా హైదరాబాద్‌కు చేరుకోవడంతో అభిమానుల దృష్టి అభిషేక్ శర్మపైనే ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్‌లో అతని రికార్డు కూడా ఆకట్టుకునేలా ఉంది. ఈ నేపథ్యంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో అభిషేక్ శర్మ గణాంకాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఇవి కూడా చదవండి

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో అభిషేక్ శర్మ ఓవరాల్ రికార్డు

గణాంకాలు వివరాలు
ఇన్నింగ్స్ 31
పరుగులు 975
సగటు 34.82
స్ట్రైక్-రేట్ 211
100/50 2/7

(టీ20 క్రికెట్‌లో రాజీవ్ గాంధీ స్టేడియంలో అభిషేక్ శర్మ రికార్డు)

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో అభిషేక్ శర్మ మొత్తం 32 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. భారత్‌తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ మైదానంలో బరిలోకి దిగాడు. 32 ఇన్నింగ్స్‌ల్లో అభిషేక్ శర్మ 975 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ సగటు 34.82గా ఉంది. స్ట్రైక్ రేట్ ఏకంగా 211గా నమోదైంది. ఈ వేదికపై అతని ఖాతాలో రెండు సెంచరీలు, ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

హైదరాబాద్‌లోని ఈ మైదానంలో అత్యధిక టీ20 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. అతని కంటే ముందు డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్ ఉన్నారు.

ఎక్కువమంది చదివినది: గంభీర్ నమ్మకానికే వెన్నుపోటు.. కట్‌చేస్తే.. హైదరాబాద్‌ మ్యాచ్‌లోనూ ఈ ముగ్గురు బెంచ్‌కే ఫిక్స్..!

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో అభిషేక్ శర్మ T20I రికార్డు

గణాంకాలు వివరాలు
ఇన్నింగ్స్ 1
పరుగులు 4
సగటు 4
స్ట్రైక్-రేట్ 100
100/50 0/0

(T20Iల్లో రాజీవ్ గాంధీ స్టేడియంలో అభిషేక్ శర్మ రికార్డు)

అభిషేక్ శర్మ భారత జట్టు తరఫున రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇప్పటివరకు ఒక్క టీ20 అంతర్జాతీయ మ్యాచ్ మాత్రమే ఆడాడు. 2024లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను బరిలోకి దిగాడు. అయితే ఆ మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. T20Iల్లో ఈ వేదికపై అభిషేక్ శర్మ ఒక ఇన్నింగ్స్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 100.00గా ఉంది.

ఎక్కువమంది చదివినది: రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే.. ఫ్యూచర్ చెప్పేసిన ఆసీస్ దిగ్గజం..!

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో అభిషేక్ శర్మ IPL రికార్డు

గణాంకాలు వివరాలు
ఇన్నింగ్స్ 26
పరుగులు 821
సగటు 35.70
స్ట్రైక్-రేట్ 208.91
100/50 2/5

(IPLలో రాజీవ్ గాంధీ స్టేడియంలో అభిషేక్ శర్మ రికార్డు)

IPLలో ఉప్పల్ స్టేడియంలో అభిషేక్ శర్మకు అద్భుతమైన రికార్డు ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఈ వేదికపై 26 ఇన్నింగ్స్‌లు ఆడిన అతను 821 పరుగులు సాధించాడు. అతని బ్యాటింగ్ సగటు 35.70గా ఉండగా, స్ట్రైక్ రేట్ 208.91గా ఉంది. ఈ మైదానంలో IPLలో అభిషేక్ శర్మ రెండు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు సాధించాడు. దీంతో వెస్టిండీస్‌తో జరిగే నాలుగో టీ20లో సొంత ప్రేక్షకుల ముందు అతని బ్యాటింగ్ ఎలా ఉంటుందన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us