” రౌడీ ” పేరు తప్పితే అన్నీ ఓకే..ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట
హీరో విజయ్ దేవరకొండకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. అనుమతి లేకుండా పేరు, ఫోటోలు, గొంతును వాడకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డీప్‌ఫేక్, ఏఐ దుర్వినియోగంపై కోర్టు తీవ్రంగా స్పందించింది. అయితే, రౌడీ పేరును ఒంటరిగా వాడకుండా నిషేధించడానికి నిరాకరించింది, సాక్ష్యాలను కోరింది.
హీరో విజయ్ దేవరకొండకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన అనుమతి లేకుండా పేరు, ఫోటోలు, గొంతు, ఇతర వ్యక్తిగత హక్కులను అనధికారికంగా ఇతరులు వాడకుండా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌ఫేక్, ఫేస్ మార్ఫింగ్ టెక్నాలజీలను ఉపయోగించి ఆయనను అశ్లీల లేదా అసభ్యకర రీతిలో చిత్రీకరిస్తున్న కంటెంట్‌పై కోర్టు తీవ్రంగా స్పందించింది.మెటా, గూగుల్, ఎక్స్ వంటి సోషల్ మీడియా సంస్థలు గుర్తించిన అక్రమ కంటెంట్, వీడియోలు, రీల్స్, పోస్టులు, అకౌంట్లను వెంటనే తొలగించాలని కోర్టు ఆదేశించింది. అలాగే, ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లు, సంబంధిత లింకులను 72 గంటల్లోగా తొలగించాలని స్పష్టం చేసింది. తన పేర్లయిన విజయ్ దేవరకొండ, విజయ్ సాయి దేవరకొండ, వీడీ ఇనిషియల్స్, సిగ్నేచర్లు, వాయిస్ రికార్డింగ్‌లు, ఫ్యాషన్ స్టైల్, సినిమా స్టిల్స్ వంటి వాటిని వాణిజ్యపరంగా దుర్వినియోగం చేయకుండా రక్షణ కోరుతూ విజయ్ దేవరకొండ కోర్టును ఆశ్రయించారు.అయితే, ఆయనకు ఎంతో ఇష్టమైన రౌడీ అనే పేరును కేవలం ఒంటరిగా వాడడంపై మాత్రం కోర్టు ఎక్స్-పార్టీ ఇంజక్షన్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆ పేరు ఆయనకు మాత్రమే ప్రత్యేకంగా చెందుతుందని నిరూపించే తగిన సాక్షాధారాలు అవసరమని కోర్టు పేర్కొంది.
మరిన్ని వీడియోల కోసం :
అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం.. ఈసారి మహేష్ బాకీ తీర్చేస్తాడా?
నిన్న నాని.. నేడు విజయ్.. ఇది సీరియస్ మ్యాటర్..!
టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న మమితా బైజు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

