AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Report: తెలుగురాష్ట్రాల్లోకి ఈశాన్య తురుపవనాలు.. రాబోయే 3రోజుల వాతావరణం ఎలా ఉంటుందంటే?

రాబోయే 2 రోజుల్లో దేశంలోని మిగిలిన ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాలు మరింతగా ఉపసంహరించుకోవడానికి, అదే సమయంలో దక్షిణ ద్వీపకల్పంలో ఈశాన్య రుతుపవన వర్షాలు ప్రారంభం కావడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయనని.. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు వాతావరణం ఎలా ఉండబోతుందో భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

Weather Report: తెలుగురాష్ట్రాల్లోకి ఈశాన్య తురుపవనాలు.. రాబోయే 3రోజుల వాతావరణం ఎలా ఉంటుందంటే?
Ap And Telangana Brace For Rains As Northeast Monsoon
Anand T
|

Updated on: Oct 13, 2026 | 7:30 PM

Share

తెలుగురాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. మన్నార్ గల్ఫ్, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ తమిళనాడు తీరంపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు దక్షిణ శ్రీలంక తీరానికి దూరంగా నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి, సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని.. అలాగే దక్షిణ శ్రీలంక తీరానికి దూరంగా నైరుతి బంగాళాఖాతంలో ఉన్న పై ఉపరితల ఆవర్తనం నుండి తూర్పు గాలులలోని ద్రోణి మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి, ఎత్తు పెరిగే కొద్దీ దక్షిణం వైపు వంగి సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని దీని ప్రభావంతో ఏపీలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఏపీలో రాబోయే 3 రోజుల వాతావరణం

కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం: మంగళవారం కోస్తాంధ్రలో, యానాంలోని పలు ప్రాంలాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. బుధ, గురువారాల్లో వర్షాలతో పాటు బలమైన గాలులు గంటకు 30-40 గరిష్టముగా 50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

రాయలసీమ: ఇక రాయలసీమలో మంగళవారం తేలికపాటినుండి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని.. బలమైన గాలులు గంటకు 30-40 గరిష్టముగా 50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంద వాతావరణ శాఖ తెలిపింది. ఇక బుధ, గురువారంలో ఇదే తరహా వాతావరణం ఉంటుందని. కానీ వర్షాల సమయంలో మాత్రం బలమైన గాలులు గంటకు 40-50 గరిష్టముగా 60 కిలోమీటర్ల వేగముతో వీస్తాయని తెలిపింది.

తెలంగాణలో వాతవారణం ఇలా

ఈశాన్య రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశించేందుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని.. రాబోయే రెండు మూడు రోజుల్లో రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశించే ఛాన్స్ ఉందని.. వాటి ప్రభావంతో మంగళ, బుధవారాల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అంచానా వేసింది. అలాగే గురువారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే వర్షాల సమయంలో గంటకు 30 నుండి 40 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులు కూడా వీస్తాయని అంచానా వేసింది.

నగరాల్లో వెదర్ అప్‌డేట్స్ ఇక్కడ చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us