AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దక్షిణ భారతదేశంలో తప్పక దర్శించాల్సిన 8 ప్రసిద్ధ దేవాలయాలు.. ఆధ్యాత్మికతతో పాటు అద్భుతమైన అనుభూతి!

Famous Temples in South India: దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ దేవాలయాలు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు అద్భుతమైన వాస్తుశిల్పం, గొప్ప చరిత్రకు ప్రసిద్ధి. మీనాక్షి అమ్మన్ ఆలయం నుంచి తిరుమల వేంకటేశ్వర స్వామి దేవాలయం వరకు తప్పక దర్శించాల్సిన 8 పుణ్యక్షేతరాల విశిష్టతలను తెలుసుకోండి.

దక్షిణ భారతదేశంలో తప్పక దర్శించాల్సిన 8 ప్రసిద్ధ దేవాలయాలు.. ఆధ్యాత్మికతతో పాటు అద్భుతమైన అనుభూతి!
Famous Temples In South India
Rajashekher G
|

Updated on: Oct 13, 2026 | 1:59 PM

Share

దక్షిణ భారతదేశం ప్రాచీన దేవాలయాలు, అద్భుతమైన వాస్తుశిల్పం, గొప్ప ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రసిద్ధి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఎన్నో చారిత్రక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ప్రతి ఆలయానికి ప్రత్యేకమైన స్థలపురాణం, నిర్మాణ శైలి, ఆచార వ్యవహారాలు ఉంటాయి. భక్తితో పాటు భారతీయ సంస్కృతి, చరిత్రను తెలుసుకోవాలనుకునే వారికి ఈ దేవాలయాల సందర్శన ఒక ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. దక్షిణ భారతదేశంలో తప్పక దర్శించాల్సిన ఎనిమిది ప్రసిద్ధ దేవాలయాల గురించి తెలుసుకుందాం.

1. మీనాక్షి అమ్మన్ దేవాలయం – మదురై

తమిళనాడులోని మదురైలో ఉన్న మీనాక్షి అమ్మన్ దేవాలయం దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. మీనాక్షి అమ్మవారు, సుందరేశ్వర స్వామికి అంకితమైన ఈ ఆలయం రంగురంగుల శిల్పాలతో అలంకరించిన ఎత్తైన గోపురాలకు ప్రసిద్ధి. ఆలయంలోని మండపాలు, శిల్పాలు తమిళ సంస్కృతి, వాస్తుశిల్ప వైభవాన్ని ప్రతిబింబిస్తాయి.

2. రామనాథస్వామి దేవాలయం – రామేశ్వరం

తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్న రామనాథస్వామి దేవాలయం పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని పొడవైన ప్రాకారాలు, అందంగా చెక్కిన స్తంభాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఆలయానికి సంబంధించిన పవిత్ర తీర్థాల్లో స్నానం చేయడం భక్తులు విశేషంగా భావిస్తారు.

3. బృహదీశ్వర దేవాలయం – తంజావూరు

చోళుల కాలంనాటి అద్భుత నిర్మాణ నైపుణ్యానికి బృహదీశ్వర దేవాలయం ప్రతీకగా నిలుస్తుంది. శివుడికి అంకితమైన ఈ ఆలయం భారీ విమానం, రాతి శిల్పాలు, విశిష్ట నిర్మాణ శైలికి ప్రసిద్ధి. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలో భాగమైన ఈ ఆలయం చరిత్ర, కళలపై ఆసక్తి ఉన్నవారు తప్పక చూడాల్సిన ప్రదేశం.

4. శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం – తిరుమల

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల కొండలపై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. గోవింద నామస్మరణలు, సంప్రదాయ పూజలు, కొండల మధ్య ఆధ్యాత్మిక వాతావరణం భక్తులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి.

5. శ్రీ పద్మనాభస్వామి దేవాలయం – కేరళ

కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్న పద్మనాభస్వామి ఆలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ఇక్కడ స్వామివారు అనంతశయన భంగిమలో దర్శనమిస్తారు. ద్రావిడ, కేరళ నిర్మాణ శైలుల సమ్మేళనం, సున్నితమైన శిల్పాలు ఈ ఆలయ ప్రత్యేకతలు.

6. విరూపాక్ష దేవాలయం – హంపి

కర్ణాటకలోని హంపిలో ఉన్న విరూపాక్ష దేవాలయం శివుడికి అంకితమైన చారిత్రక ఆలయం. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని గుర్తుచేసే ఈ పుణ్యక్షేత్రం ఇప్పటికీ పూజలు అందుకుంటోంది. ఆలయంతో పాటు హంపిలోని పురాతన కట్టడాలను సందర్శించడం ద్వారా చరిత్రను దగ్గరగా తెలుసుకోవచ్చు.

7. మురుడేశ్వర్ దేవాలయం – కర్ణాటక

అరేబియా సముద్ర తీరంలో ఉన్న మురుడేశ్వర్ ఆలయం భారీ శివ విగ్రహానికి ప్రసిద్ధి. సముద్రం, కొండలు, ఆలయ నిర్మాణం కలిపి ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన అందాన్ని అందిస్తాయి. భక్తితో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే వారికి ఇది మంచి గమ్యస్థానం.

8. గురువాయూర్ దేవాలయం – కేరళ

కేరళలోని గురువాయూర్ దేవాలయం శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది. దీనిని భక్తులు ‘దక్షిణ ద్వారక’గా పిలుస్తారు. సంప్రదాయ పూజలు, పండుగలు, భక్తి కార్యక్రమాలకు ఈ ఆలయం ప్రసిద్ధి. శ్రీకృష్ణుడిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

మొత్తంగా.. ఈ ఎనిమిది దేవాలయాలు దక్షిణ భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకలు. ప్రతి ఆలయం ప్రత్యేకమైన చరిత్ర, సంప్రదాయాలు, నిర్మాణ వైభవాన్ని పరిచయం చేస్తుంది. భక్తి యాత్రతో పాటు సంస్కృతి, చరిత్ర, ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునేవారు తమ ప్రయాణ ప్రణాళికలో ఈ పుణ్యక్షేత్రాలను చేర్చుకోవచ్చు. ఈ దసరా సెలవులలో వీటితోపాటు అరుణాలం, శ్రీరంగం వంటి ఇతర ప్రసిద్ధ క్షేత్రాలను కూడా తమ యాత్రలో దర్శించవచ్చు.

Follow Us
దక్షిణ భారతదేశంలో తప్పక దర్శించాల్సిన 8 ప్రసిద్ధ దేవాలయాలు..
దక్షిణ భారతదేశంలో తప్పక దర్శించాల్సిన 8 ప్రసిద్ధ దేవాలయాలు..
డిసెంజర్ 4న రింకూ సింగ్, ప్రియా సరోజ్ పెళ్లి.. అతిథుల జాబితా ఇదే?
డిసెంజర్ 4న రింకూ సింగ్, ప్రియా సరోజ్ పెళ్లి.. అతిథుల జాబితా ఇదే?
గుడి ప్రసాదం రుచిని తలపించే దద్దోజనం.. ఇలా చేస్తే రోజంతా తాజాగా
గుడి ప్రసాదం రుచిని తలపించే దద్దోజనం.. ఇలా చేస్తే రోజంతా తాజాగా
వాట్సప్‌లో "నో" అనే మెస్సేజ్ వస్తే అలర్ట్.. క్లిక్ చేస్తే అంతే..
వాట్సప్‌లో
దుర్గా నిమజ్జనం రాత్రిపూట ఎందుకు చేయకూడదు? సరైన సమయం, నియమాలు ఇవే
దుర్గా నిమజ్జనం రాత్రిపూట ఎందుకు చేయకూడదు? సరైన సమయం, నియమాలు ఇవే
విడాకులు తీసుకున్న 'అగ్నిసాక్షి' సీరియల్ హీరోయిన్
విడాకులు తీసుకున్న 'అగ్నిసాక్షి' సీరియల్ హీరోయిన్
మెట్ల కింద టాయిలెట్ నిర్మిస్తున్నారా? వాస్తు ప్రకారం ఈ విషయాలు..
మెట్ల కింద టాయిలెట్ నిర్మిస్తున్నారా? వాస్తు ప్రకారం ఈ విషయాలు..
భారత్‌లో 6జీ ఎప్పుడంటే..? అప్పటిలోగా సేవలు..
భారత్‌లో 6జీ ఎప్పుడంటే..? అప్పటిలోగా సేవలు..
భార్యను వదిలేసిన అన్న.. పెళ్లాడిన తమ్ముడు.. చివరకు
భార్యను వదిలేసిన అన్న.. పెళ్లాడిన తమ్ముడు.. చివరకు
బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంది.. తెలుగోడిపై మాజీ ఓపెనర్ ఫైర్
బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంది.. తెలుగోడిపై మాజీ ఓపెనర్ ఫైర్