ఈ పండ్లు తింటే చర్మం నిగారింపు రెట్టింపు!

Jyothi Gadda

22 November 2026

వీటిలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచుతాయి. ముడతలు, పొడిబారడం వంటి సమస్యలు తగ్గుతాయి.

స్ట్రాబెర్రీలలో ఉండే పాలీఫెనాల్స్, పొటాషియం, ఫైబర్ రక్తపోటు నియంత్రణకు సహాయపడి చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి మేలు చేస్తాయి.

డైటరీ ఫైబర్ అధికంగా ఉండే స్ట్రాబెర్రీలు జీర్ణక్రియను సులభతరం చేసి మలబద్ధకం సమస్య రాకుండా పేగుల ఆరోగ్యాన్ని చురుకుగా ఉంచడానికి తోడ్పడతాయి.

తక్కువ కేలరీలు, ఎక్కువ నీటి శాతం, ఫైబర్ కలిగి ఉండటం వల్ల ఇవి త్వరగా కడుపు నిండిన భావన కలిగించి బరువు నియంత్రణకు సహాయపడతాయి.

తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన స్ట్రాబెర్రీలు మితంగా తింటే చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రించడంలో సహాయపడతాయి.

ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు మెదడు కణాలకు ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించి వయస్సు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపడటానికి తోడ్పడతాయి.

యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి కంటిలోని రెటీనా కణాలను కాపాడి వయస్సు సంబంధిత కంటి సమస్యల ముప్పును తగ్గించడంలో సహాయపడతాయి.

స్ట్రాబెర్రీలను తినే ముందు పురుగుమందుల అవశేషాలు పోయేలా బాగా కడగాలి. అలెర్జీ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మితంగా తీసుకోవడం ఉత్తమం.