14ఏళ్లకే ఎంట్రీ.. పెళ్ళైన దర్శకుడితో ఎఫైర్.. కట్ చేస్తే ఫ్యాన్‌కు ఉరేసుకొని..
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది అందాల తారలు చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించారు. కొంతమంది చిన్న వయసులోనే స్టార్ డమ్ కూడా సొంతం చేసుకున్నారు.. అలాగే చేతులారా కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్స్ కూడా చాలా మంది ఉన్నారు.

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రాణించారు. వారిలో నటి శోభ ఒకరు. అందాల తార శోభ, తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు. ఆమె చిన్న వయసులోనే స్టార్ డమ్ చూసింది.. అలాగే చిన్నవయసులోనే విషాదకరంగా కన్నుమూశారు. శోభ అసలు పేరు మహాలక్ష్మి మేనన్. ఆమె 1961లో కేరళలో జన్మించారు. ఐదవ ఏటనే తట్టుంగల్ తిరుక్కప్పడం అనే మలయాళ చిత్రంతో బాలనటిగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. కే. ఆర్. విజయ, మనోహర్, ప్రేమ్ నజీర్, సత్యన్ వంటి అగ్రతారలతో నటించి, బాలనటిగా అద్భుతమైన గుర్తింపు పొందారు. ఆమె సహజ నటనకు, ముఖ కవళికలకు పేరు పొందారు. కేవలం 14-15 సంవత్సరాల వయసులోనే కథానాయికగా నటించి, మలయాళ, తమిళ చిత్రాలకు రెండు కేరళ రాష్ట్ర పురస్కారాలను గెలుచుకున్నారు శోభ. అప్పుడే ఆమెకు సహజ నటి అనే బిరుదు కూడా లభించింది.
ఇది కూడా చదవండి : Suman Setty: ఆ హీరో నన్ను పిలిచి సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.. అంతకన్నా ఏం కావాలి
తెలుగులో ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తొలి చిత్రం తరం మారిందిలో శోభ కథానాయికగా నటించారు. ఈ చిత్రానికి బాలు మహేంద్ర కెమెరామెన్‌గా పనిచేశారు. తరం మారిందిలో వృద్ధుడికి ఇచ్చి పెళ్లి చేయబడిన యువతిగా శోభ నటించారు. ఆ తర్వాత మన ఊరి పాండవులు చిత్రంలో రావు గోపాలరావు పాత్ర చేత మోసపోయిన అమ్మాయిగా, బాలచందర్ దర్శకత్వంలో తమిళ చిత్రంలో కూడా గర్భవతి పాత్రలో కనిపించారు. విచిత్రంగా, ఆమె నటించిన చాలా చిత్రాలలో కథానాయికలు మగాళ్ల చేతిలో మోసపోయిన పాత్రలే చేశారు. ప్రఖ్యాత దర్శకుడు, కెమెరామెన్ బాలు మహేంద్ర.. విశ్వనాథ్, సింగీతం శ్రీనివాసరావు వంటి వారికి కెమెరామెన్‌గా పనిచేశారు. స్వతహాగా దర్శకుడు కూడా అయిన బాలు మహేంద్ర, కమల్ హాసన్, శ్రీదేవి నటించిన ముండ్రాం పిరై (వసంత కోకిల) వంటి విజయవంతమైన చిత్రాలను తీశారు. బాలు మహేంద్ర తన కన్నడ చిత్రం కోకిలకు శోభను కథానాయికగా తీసుకున్నారు. షూటింగ్ సమయంలో, ఆయన శోభను తన సొంత బిడ్డలా చూసుకోవడం ప్రారంభించారు.
ఇది కూడా చదవండి : సౌందర్య కాదు.. వెంకటేష్‌తో ఆరు సినిమాలు.. అన్నీ సూపర్ హిట్లే.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?
అప్పటికి 15-17 సంవత్సరాల వయసున్న శోభ, ఆ ఆప్యాయతను అపార్థం చేసుకుని, బాలు మహేంద్ర పట్ల గాఢమైన అనురాగాన్ని పెంచుకున్నారట. ఆయనకు అప్పటికే వివాహమై పిల్లలు ఉన్నప్పటికీ, శోభ ఆయనను తన జీవితంలో దేవుడిలా భావించారట. శోభ పట్టుబట్టడంతో, బాలు మహేంద్ర ఆమెను వివాహం చేసుకున్నారట. ఈ సంబంధం తర్వాత, శోభలో తీవ్రమైన పొసెసివ్‌నెస్ పెరిగింది. బాలు మహేంద్ర తన మొదటి కుటుంబాన్ని, పిల్లలను లేదా సినిమా షూటింగ్‌లను పట్టించుకోవడం ఆమెకు నచ్చలేదు. అర్ధరాత్రి ఫోన్ చేసి తన దగ్గరకు రావాలని డిమాండ్ చేసేవారు. ఎవరెన్ని చెప్పినా, ఆమె వయసు రీత్యా కలిగిన ఆవేశం వల్ల ఎవరి మాట వినేవారు కాదట. ఒక సందర్భంలో, బాలు మహేంద్ర వస్తున్నానని చెప్పి, అనివార్య కారణాల వల్ల ఆ రాత్రి శోభ వద్దకు రాలేకపోయారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన ఫోన్ ఎత్తకపోవడంతో శోభ తీవ్ర ఆవేశానికి లోనయ్యారు. ఆ క్షణికావేశంలో, ఎదురుగా కనిపించిన చీరను తీసుకుని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారట. ఆమె మరణం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది.
