AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆమె కంటే నేనే బాగా నటించేదాన్ని.. రాధికా శరత్ కుమార్‌పై నటి షాకింగ్ కామెంట్స్

మధురైలో స్థిరపడిన పావునుతై అనే వృద్ధురాలి జీవిత కథను చెప్పే సినిమా తాయ్ కిళవి. రాధిక శరత్‌కుమార్ నటించిన ఈ చిత్రం రికార్డు సృష్టించింది. ఈ సినిమా కోసం కథానాయిక రాధిక శరత్‌కుమార్ తన ముఖానికి చాలా మార్పులు చేసుకున్నారు .

ఆమె కంటే నేనే బాగా నటించేదాన్ని.. రాధికా శరత్ కుమార్‌పై నటి షాకింగ్ కామెంట్స్
Thaai Kizhavi
Rajeev Rayala
|

Updated on: May 12, 2026 | 8:48 AM

Share

రీసెంట్ డేస్ లో కంటెంట్ ఉన్న సినిమాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి. హీరోలు, హీరోయిన్స్ ను నమ్ముకోకుండా కథను బేస్ చేసుకొని తెరకెక్కిన సినిమాలు థియేటర్స్ దగ్గర భారీ విజయాలను అందుకుంటున్నాయి. చిన్న సినిమాలుగా వచ్చి అటు థియేటర్స్ లో, ఇటు ఓటీటీల్లో అదరగొడుతున్నాయి. అలా వచ్చిన సినిమానే తాయ్ కిళవి. తమిళ్ లో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. తమిళనాడులోని ఉసిలంపట్టి ప్రాంతానికి చెందిన 75 ఏళ్ల మహిళ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈమూవీలో రాధికా శరత్ కుమార్ తన నటనతో కట్టిపడేసారు. ఆమె లుక్ , యాక్టింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఈ సినిమాలో..

ఇక సినిమాలో కథ, కామెడీ, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. థియేటర్స్ లో మంచి విజయాన్ని అందుకున్న ఈ మూవీ ఓటీటీలోనూ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఓటీటీలో తెలుగు, తమిళ్ వెర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. కాగా ఈ సినిమా పై మరో సీనియర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. రాధికా శరత్ కుమార్ కంటే నేను ఇంకా బాగా నటిస్తా అని చెప్పి షాక్ ఇచ్చింది ఆ నటి. ఇంతకూ ఆమె ఎవరో మరెవరో కాదు నటి షకీలా.

కెరీర్ బిగినింగ్ లో శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్నారు షకీలా.. ఎన్నో సినిమాల్లో వ్యాంప్ క్యారెక్టర్స్ లో నటించారు. అప్పటిలో స్టార్ హీరోలకు మించి క్రేజ్ తెచ్చుకున్నారు షకీలా. ఆతర్వాత ఆమె సినిమాలు తగ్గిస్తూ వచ్చారు. తెలుగు రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్నారు షకీలా.. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాయ్ కిళవి చిత్రంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘నిజంగా చెప్పాలంటే ‘తాయ్ కిళవి’ సినిమాలో రాధిక కాకుండా నేను ఉంటే ఇంకా బాగా చేసేదాన్ని.. అలాంటి సినిమాల్లో ఆమెకంటే నిన్నే బాగా నటిస్తా..  ఈ మధ్యే ఓ తెలుగు సినిమాలో మేకప్ లేకుండా చేశా.. ఆ రోల్ నాకు అద్భుతమైన కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అందుకే రాధిక కంటే నేనే బాగా చేసేదాన్ని అనిపించింది అంటూ షకీలా చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us