AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puri Jagannath: ఇండస్ట్రీలో పూరిజగన్నాథ్ నా గాడ్ ఫాదర్.. ఆయనలేకపోతే నేను లేను

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన సినిమాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా యూత్ లో పూరికి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. సినిమాలతోనే కాదు పూరి తన “పూరి మ్యూజింగ్స్”లో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటారు. అనేక సామజిక అంశాల పైన పూరి చెప్పే మాటలను ఎంతో మంది ఇష్టపడుతూ ఉంటారు

Puri Jagannath: ఇండస్ట్రీలో పూరిజగన్నాథ్ నా గాడ్ ఫాదర్.. ఆయనలేకపోతే నేను లేను
Puri Jagannadh
Rajeev Rayala
|

Updated on: May 10, 2026 | 12:05 PM

Share

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రముఖ వ్యక్తి. చాలా పాపులర్ ఆయన, ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పూరి జగన్నాథ్ తన “గాడ్‌ఫాదర్”గా పేర్కొంటూ, ఆయనతో తన అనుబంధాన్ని, సినీ ప్రయాణంలో పూరి గారు అందించిన మద్దతును వివరించారు. పూరి జగన్నాథ్ తనకు కేవలం స్నేహితుడిగానే కాకుండా, కెరీర్‌లో కీలక మలుపులకు కారణమయ్యారని ఆయన తెలిపారు. పూరి జగన్నాథ్ తన బ్యాచ్‌లోని సీనియర్ అని, మధు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొంది, నటుడిగా ప్రయత్నించి, ఆ తర్వాత దర్శకత్వంలోకి వచ్చారని గుర్తు చేసుకున్నారు ఇంతకూ ఆయన ఎవరో తెలుసా.? ఆయన మరెవరో కాదు మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, యాక్టర్ రఘు కంచె. ఓ ఇంటర్వ్యూలో రఘు కుంచె మాట్లాడుతూ.. హిందీ శివా సినిమాలో నటుడిగా కనిపించిన పూరి జగన్నాథ్ తన కెరీర్ ప్రారంభంలో నటనపై ఆసక్తి చూపారని రఘు తెలిపారు. ఇండస్ట్రీలో తాను పూరికి చాలా జూనియర్‌నైనప్పటికీ, వారి స్నేహ బంధం బలమైనదిగా మారిందని, పూరి దర్శకుడిగా మారిన తర్వాత తన కెరీర్‌కు అది ఒక బ్రేక్ పాయింట్‌గా నిలిచిందని వివరించారు.

ఇది కూడా చదవండి : వార్నీ.. ఏం మారలేదు గురూ..! మేం వయసుకు వచ్చాం హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

ఓ సందర్భంలో పూరి జగన్నాథ్ గారు మణికొండలో ఎప్పుడో కొన్న భూమిని మర్చిపోయి వెతుకుతుండగా, రాజమౌళి గారు కలుసుకుని, “మీది ఇక్కడే ఉంది, మా పక్కనే” అని చెప్పిన ఆసక్తికర సంఘటనను పంచుకున్నారు. పూరి జగన్నాథ్ గారు నూతన ప్రతిభను ప్రోత్సహించడంలో ముందుంటారని ఆయన పేర్కొన్నారు. సంగీత దర్శకుడు చక్రికి మొదటి సినిమా బాచికి సంగీతం అందించే అవకాశం కల్పించిన తీరును వివరించారు. సత్యదేవ్ అనే వ్యక్తి చక్రిని పూరి గారి వద్దకు తీసుకువచ్చినప్పుడు, కేవలం ట్యూన్‌లు వినిపించిన వెంటనే పూరి గారు అతనికి సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చారని తెలిపారు. పూరి గారు లక్ష్మి లక్ష్మి పాటను పాడమని తనకు అవకాశం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.

ఇది కూడా చదవండి :OTT Movie: ఇది కదా సినిమా అంటే.. ఇండియాలోనే నెంబర్ 1.. రొమాంటిక్ ఎంటర్టైనర్

అదేవిధంగా, పూరి తనను బంపర్ ఆఫర్ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా నియమించాలని నిర్ణయించుకున్నారని, “నువ్వు కూడా సంపాదించుకోవాలి కదా, ఎన్నాళ్లు ఈ పావలా బేరాల్లో” అని తనకు చెప్పి, బలవంతంగా ఆ బాధ్యతను అప్పగించారని తెలిపారు. అయితే, ఆర్థిక విషయాలపై తనకు అవగాహన లేకపోవడం, స్నేహం దెబ్బతింటుందేమోనన్న భయంతో తాను ఆ బాధ్యతను నిరాకరించినట్లు వెల్లడించారు. ఆ సమయంలో పూరి గారు మొదట అనుకున్న సంగీత దర్శకుడు ఇబ్బందులు సృష్టించడంతో, పూరి గారు తనను మ్యూజిక్ డైరెక్టర్‌గా చేయమని కోరారని, తాను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాధ్యతలను వేరొకరికి అప్పగించి, సంగీత దర్శకత్వంపై దృష్టి పెట్టానని వివరించారు. ఒకవేళ ఆ రోజు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాధ్యతను సీరియస్‌గా తీసుకుని ఉంటే, ఈపాటికి పూర్తిస్థాయి నిర్మాత అయ్యేవాడినని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :నాన్న ఉన్నా లేనట్టే.. అమ్మకు అన్నం కూడా పెట్టలేదు..! నేను ఒంటరిగానే పోరాడుతున్నా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us