AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆహా..! ఏం సాంగ్ మావ.. వింటుంటే నరాలు జివ్వుమనాల్సిందే.. యూట్యూబ్‌ను ఊపేస్తున్న రొమాంటిక్ సాంగ్

సినిమా పాటలకు క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. సినిమాల విజయంలో సంగీతం కూడా కీలక పాత్రలు పోషిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ సంగీతం హిట్ అవుతుంటుంది. సినిమాలో పాటలన్ని హిట్ అవుతుంటాయి. చాలా సినిమా మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి.

ఆహా..! ఏం సాంగ్ మావ.. వింటుంటే నరాలు జివ్వుమనాల్సిందే.. యూట్యూబ్‌ను ఊపేస్తున్న రొమాంటిక్ సాంగ్
Tollywood Song
Rajeev Rayala
|

Updated on: May 10, 2026 | 11:29 AM

Share

కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. సినిమాలతో పాటు సినిమా సాంగ్స్ ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి. సినిమాలతో పోల్చుకుంటే సాంగ్స్ ఎక్కువగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంటాయి. కొన్ని సినిమాలను సాంగ్, మ్యూజిక్ నిలబెడుతుంటాయి. సినిమాలు ఫ్లాప్ అయినా కూడా సాంగ్స్ మాత్రం హిట్ అవుతుంటాయి. దాంతో దర్శకనిర్మాతలు కూడా మ్యూజిక్ పైనే ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటారు. ఇక కొన్ని సాంగ్స్ ఏళ్లు గడుతున్నా కూడా ట్రెండ్ అవుతూ ఉంటాయి. యూట్యూబ్ లో ఇప్పటికే మిలియన్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకున్న సాంగ్స్ ఉన్నాయి. ఇక ఓ రొమాంటిక్ సాంగ్ ఇప్పటికీ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

ఇది కూడా చదవండి : వార్నీ.. ఏం మారలేదు గురూ..! మేం వయసుకు వచ్చాం హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

ఈ సాంగ్ చాలా మంది ఫేవరెట్ సాంగ్.. చాలా మంది ప్లే లిస్ట్ లో ఈ సాంగ్ ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది. ఆ సాంగ్ ఎదో కాదు విక్టరీ వెంకటేష్, అంజలా జవేరి కలిసి నటించిన దేవి పుత్రుడు సినిమాలోని తెల్ల తెల్లని చీర సాంగ్. 2001లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమాలో వెంకటేష్, సౌందర్య, అంజలా జవేరి ముఖ్య పాత్రల్లో నటించారు. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించాడు. ఫాంటసీ డ్రామా గా వచ్చిన ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో భారీ వ్యయంతో రూపొందించబడింది.

ఇది కూడా చదవండి :OTT Movie: ఇది కదా సినిమా అంటే.. ఇండియాలోనే నెంబర్ 1.. రొమాంటిక్ ఎంటర్టైనర్

ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. వాటిలో తెల్ల తెల్లని చీర సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఈ సాంగ్ లో వెంకటేష్, అంజలా జవేరి డాన్స్ తో అదరగొట్టారు. ఈ సాంగ్ ఇప్పటికీ సెన్సేషనల్ వ్యూస్ తో దూసుకుపోతుంది. జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు రచించిన ఈ సాంగ్ ను.. ఉదిత్ నారాయణ్ , సుజాత కలిసి ఆలపించారు. ఈ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :నాన్న ఉన్నా లేనట్టే.. అమ్మకు అన్నం కూడా పెట్టలేదు..! నేను ఒంటరిగానే పోరాడుతున్నా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us