AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RK Roja: ఒక్కహీరో కూడా నాకు లవ్ ప్రపోజ్ చేయలేదు.. కారణం ఏంటో చెప్పిన రోజా

ఆర్కే రోజా.. తెలుగు సినిమా రంగంలో తనదైన ముద్ర వేసి, ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి సక్సెస్ అయ్యారు రోజా. సినిమాలు, రాజకీయాలతోనే కాదు బుల్లితెరపై కూడా సందడి చేసి ప్రేక్షకులను అలరించారు రోజా. ఇటీవలే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు రోజా.. తమిళ్ లో ఓ సినిమాలో నటిస్తున్నారు

RK Roja: ఒక్కహీరో కూడా నాకు లవ్ ప్రపోజ్ చేయలేదు.. కారణం ఏంటో చెప్పిన రోజా
Rk Roja
Rajeev Rayala
|

Updated on: May 15, 2026 | 9:13 PM

Share

రోజా సెల్వమణి.. సినిమాల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా మెప్పించిన రోజా.. ఇప్పుడు రాజకీయనాయకురాలిగా రాణిస్తున్నారు. రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డి. సినిమాల్లోకి వచ్చాక రొజాగా మార్చుకున్నారు. తెలుగుతో పాటు క‌న్న‌డ‌, త‌మిళం, మ‌ల‌యాళం భాష‌ల్లో 100కు పైగా సినిమాల్లో నటించారు రోజా. అలాగే ఎంతో మంది హీరోలతో కలిసి ఆమె సినిమాలు చేసి హిట్స్ అందుకున్నారు. రోజా తమిళ్‌లో చామంతి అనే సినిమాతో పరిచయం అయ్యారు. అలాగే తెలుగులో రాజేంద్ర ప్రసాద్ నటించిన ప్రేమ తపస్సు అనే సినిమాతో పరిచయం అయ్యారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతోపాటు రోజా నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఇది కూడా చదవండి : నువ్వొద్దు.. నీ పాటలొద్దు..! బాలసుబ్రహ్మణ్యంతో గొడవపడ్డ ఒకే ఒక్క హీరో.. చివరకు ఏం జరిగిందంటే

తెలుగులో రోజా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించింది. తరువాత, సినీ నిర్మాతగా వ్యవహరించింది. ఆమధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చిన రోజా మొగుడు, గోలీమార్, శంభో శివ శంభో వంటి చిత్రాలతో మెప్పించారు. ఇక టీవీ షోల్లోనూ కనిపించి ఆకట్టుకున్నారు రోజా. ముఖ్యంగా జబర్దస్త్, బ్రతుకు జట్కా బండి షోల్లో కనిపించారు. అయితే రోజా ఇన్నేళ్ళుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ హీరోలు ఎవ్వరూ ఆమెకు ప్రపోజ్ చేయలేదట.. దానికి కారణం కూడా చెప్పారు రోజా.

ఇది కూడా చదవండి : OTT Movie : IMDB 7.4 రేటింగ్‌.. వణికిస్తున్న థ్రిల్లర్ మూవీ.. ఏకంగా ఆరు ఓటీటీల్లో

గతంలో రోజా ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి తనకు ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఉండేదని తెలిపారు. అయితే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మొదటి సినిమానే సెల్వమణి దర్శకత్వంలో చామంతి సినిమా చేయడం.. ఆ సినిమా మొదటి షెడ్యూల్ సమయంలోనే సెల్వమణి రోజాను చూసి ఇష్టపడటం జరిగిందట.. ఆతర్వాత ఆయన పెళ్లికి ప్రపోజల్ చేశారట.. అయితే అప్పటికే సెల్వమణి స్టార్ డైరెక్టర్ కావడంతో ఇండస్ట్రీలో రోజాను చాలా జాగ్రత్తగా, మర్యాదగా చూసుకున్నారట.. స్టార్ డైరెక్టర్ ప్రేమిస్తున్న అమ్మాయి కావడంతో రోజాకు ఏ హీరో నుంచి ప్రపోజల్స్ రాలేదని.. ఇండస్ట్రీలో ఒకరితో ప్రేమలో ఉన్న వారికి వేరొకరిదగ్గర నుంచి ప్రపోజల్స్ రావు అని రోజా తెలిపారు. ఇక సెల్వమణి నుంచి ప్రపోజల్ రాగానే మా బ్రదర్స్, మా ఫాదర్ ను ఒప్పించండి నాకు ఏం ప్రాబ్లెమ్ లేదు అని చెప్పారట రోజా. సెల్వమణికి తన ఫ్యామిలీ బాగా నచ్చిందని, అలాగే ఆయన కూడా మా ఇంట్లో వాళ్లకు నచ్చడంతో మా పెళ్లి జరిగింది అని రోజా తెలిపారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Siddarth: నా సినిమాలకు నంది అవార్డులు వచ్చాయి.. కానీ నన్ను పట్టించుకోలేదు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us