AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie : IMDB 7.4 రేటింగ్‌.. వణికిస్తున్న థ్రిల్లర్ మూవీ.. ఏకంగా ఆరు ఓటీటీల్లో

ప్రస్తుతం ఓటీటీలో ఓ సినిమా అరాచకం సృష్టిస్తుంది. ముఖ్యంగా కొన్నాళ్లుగా నెట్టింట రొమాంటిక్ లవ్ స్టోరీస్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చూసేందుకు అడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆక్టటుకుంటుంది. ఈ థ్రిల్లర్ సినిమా ఏకంగా ఆరు ఓటీటీల్లో అందుబాటులో ఉంది.

OTT Movie : IMDB 7.4 రేటింగ్‌.. వణికిస్తున్న థ్రిల్లర్ మూవీ.. ఏకంగా ఆరు ఓటీటీల్లో
Ott Movie
Rajeev Rayala
|

Updated on: May 14, 2026 | 10:12 AM

Share

ఈ మధ్యకాలంలో ఓటీటీల హడావిడి ఎక్కువైంది. థియేటర్స్ సంగతి పక్కన పెడితే ఓటీటీలో మాత్రం సినిమాలు తెగ రిలీజ్ అవుతున్నాయి. శుక్రవారం కోసం ఓటీటీ లవర్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. రకరకాల సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. కేవలం తెలుగు సినిమాలే కాదు, హిందీ, తమిళ్, మలయాళ సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాలు కూడా మన భాషలో డబ్ అయ్యి ఓటీటీల్లో అందుబాటులో ఉంటున్నాయి. దాంతో ఆడియన్స్ ఇంట్లో కూర్చొని సినిమాలను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఓటీటీలో థ్రిల్లర్, రొమాంటిక్, హారర్ సినిమాలకు క్రేజ్ ఎప్పుడు తగ్గదు. ఇప్పుడు ఓ థ్రిల్లర్ సినిమా ఆడియన్స్ ను కట్టిపడేస్తుంది.

ఇది కూడా చదవండి : ఆ హీరో నాకు గంటసేపు క్లాస్ క్లాస్ తీసుకున్నాడు.. ఆయన మాటలు ఒక ఇంజెక్షన్‌లా పని చేశాయి

ఈ సినిమా తమిళ్ లో తెరకెక్కింది.. తెలుగులోనూ అందుబాటులో ఉంది ఈ సినిమా.. ఈ సినిమాను ఏకంగా ఆరు ఓటీటీల్లో రిలీజ్ చేశారు. ఈమూవీలో ప్రతి సీన్ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. ఊహించని ట్విస్ట్ లు , ఆసక్తికర సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.. 7.4 రేటింగ్‌తో ఓటీటీలో దుమ్మురేపుతోంది ఈ సినిమా..ఇంతకు ఈ సినిమా ఎదో తెలుసా.? తమిళ్ లో తెరకెక్కి మంచి విజయాన్ని అందుకున్న కాళిదాస్ 2, గతంలో వచ్చిన కాళిదాస్ సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీ వచ్చింది. కానీ ఈ సినిమాకు ఆ సినిమాకు పొంతన ఉండదు. కాబట్టి మొదటి పార్ట్ చూడకపోయినా పర్లేదు.. కానీ ఈ సినిమా మాత్రం మిస్ అవ్వకండి.

ఇది కూడా చదవండి : బాబోయ్.. ఇదెక్కడి రొమాంటిక్ సిరీస్ రా బాబు..! ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో స్ట్రీమింగ్

ఈ సినిమాలో ఓగేటెడ్ కమ్యూనిటీలో న్యూఇయర్ పార్టీ జరుగుతుంటుంది. అక్కడ ఓ చిన్న పాప మిస్ అవుతుంది. ఆ కేసును ఇన్వెస్ట్ గేట్ చేయడానికి కాళిదాస్ వస్తాడు. అయితే ఆ తర్వాత ఆ చిన్నపాప శవం దొరుకుతుంది. ఆతర్వాత వరుసగా మరణాలు జరుగుతుంటాయి. అదేసమయంలో ఆ కమ్యూనిటీ సెక్రటరీ ఏదో నిజం దాస్తున్నాడని అర్థం అవుతుంది. దాంతో కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆతర్వాత ఏం జరిగింది అనేది సినిమాలోనే చూడాలి. ఈ సినిమా ప్రస్తుతం ఆరు ఓటీటీల్లో రిలీజ్ అయ్యింది. అమెజాన్ ప్రైమ్, లయన్స్ గేట్ ప్లే, టెంట్ కొట్ట, ఆహా తమిళ, సన్ NXT, షార్ట్ ఫిక్స్ ఇండియా  ఓటీటీల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : 14ఏళ్లకే ఎంట్రీ.. పెళ్ళైన దర్శకుడితో ఎఫైర్.. కట్ చేస్తే ఫ్యాన్‌కు ఉరేసుకొని..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అప్పుడు ఎత్తుకుని పెంచాం.. ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు..
అప్పుడు ఎత్తుకుని పెంచాం.. ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు..
ఇంటి గోడలపై పగుళ్లు వస్తున్నాయా? ఈ తప్పులు చేయకపోతే మీ భవనం పదిలం
ఇంటి గోడలపై పగుళ్లు వస్తున్నాయా? ఈ తప్పులు చేయకపోతే మీ భవనం పదిలం
హిమాలయాల్లో భారత ఆర్మీ సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్!
హిమాలయాల్లో భారత ఆర్మీ సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్!
సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో జర్నీ చేసిన టీమిండియా దిగ్గజం..!
సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో జర్నీ చేసిన టీమిండియా దిగ్గజం..!
వర్షాకాలంలో గులాబీలు పూలతో కళకళలాడాలంటే.. సింపుల్ టిప్స్ పాటిస్తే
వర్షాకాలంలో గులాబీలు పూలతో కళకళలాడాలంటే.. సింపుల్ టిప్స్ పాటిస్తే
అమెరికా పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
అమెరికా పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
రోజుకో రంగు మారే వింత పువ్వు.. నిన్న, నేడు, రేపు మొక్కను ఇంట్లోనే
రోజుకో రంగు మారే వింత పువ్వు.. నిన్న, నేడు, రేపు మొక్కను ఇంట్లోనే
నా బిడ్డకు తండ్రి అతనే.. 21 ఏళ్ల తర్వాత కుమారుడితో కలిసి ధర్నా..
నా బిడ్డకు తండ్రి అతనే.. 21 ఏళ్ల తర్వాత కుమారుడితో కలిసి ధర్నా..
మాడిన పాత్రలపై మసి పోవాలంటే.. ఈ కూరగాయలతో తలా తలా మెరిసిపోతాయ్
మాడిన పాత్రలపై మసి పోవాలంటే.. ఈ కూరగాయలతో తలా తలా మెరిసిపోతాయ్
విడాకుల విషయంలో తప్పంతా నాదే.. ఆమె నన్ను భరించలేకపోయింది..
విడాకుల విషయంలో తప్పంతా నాదే.. ఆమె నన్ను భరించలేకపోయింది..