AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siddarth: నా సినిమాలకు నంది అవార్డులు వచ్చాయి.. కానీ నన్ను పట్టించుకోలేదు..

సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 2002లో మణిరత్నం దర్శకత్వం వహించిన “కన్నతిల్ ముత్తమిట్టల్” చిత్రంలో చిన్న పాత్రతో సిద్ధార్థ్ సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత శంకర్ తెరకెక్కించిన బాయ్స్ సినిమాతో హీరోగా మారారు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న సిద్ధార్థ్.. తెలుగులో వరుస హిట్స్ అందుకున్నారు.

Siddarth: నా సినిమాలకు నంది అవార్డులు వచ్చాయి.. కానీ నన్ను పట్టించుకోలేదు..
Siddharth
Rajeev Rayala
|

Updated on: May 14, 2026 | 11:14 AM

Share

తెలుగులో లవర్ బాయ్స్ లిస్ట్ లో ముందు వరుసలో ఉండే హీరో సిద్ధార్థ్. అమ్మాయిల డ్రీమ్ బాయ్ సిద్ధార్థ్. సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు సిద్ధార్థ్. తెలుగు, తమిళ్ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు సిద్ధార్థ్. ప్రస్తుతం ఈ స్టార్ హీరో సినిమాల స్పీడ్ తగ్గించారు. ఇటీవల సిద్ధార్థ్ నటించిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఆ మధ్య వచ్చిన చిన్న సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత సిద్ధార్థ్ నటించిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూపర్ హిట్ సినిమాల్లో నటించినప్పటికీ తనకు అనుకున్నంత గుర్తింపు రాలేదని సిద్ధార్థ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి : ఆ హీరో నాకు గంటసేపు క్లాస్ క్లాస్ తీసుకున్నాడు.. ఆయన మాటలు ఒక ఇంజెక్షన్‌లా పని చేశాయి

గతంలో ఓ ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి విజయవంతమైన తెలుగు చిత్రాలకు సంబంధించిన నంది అవార్డుల ప్రక్రియపై ఒక వ్యక్తి తన ఆవేదనను వ్యక్తం చేశారు. బొమ్మరిల్లు చిత్రం 500 శాతం విజయాన్ని సాధించి, సుమారు 12 నుంచి 13 నంది అవార్డులను గెలుచుకుందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ చిత్రంలో తాను చేసిన కృషికి ఎటువంటి అవార్డు రాలేదని, కనీసం ప్రోత్సాహక సర్టిఫికేట్ లేదా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా లభించలేదని తెలిపారు సిద్ధార్థ్.

ఇది కూడా చదవండి : బాబోయ్.. ఇదెక్కడి రొమాంటిక్ సిరీస్ రా బాబు..! ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో స్ట్రీమింగ్

అదే విధంగా, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రం కూడా ఒక గొప్ప విజయవంతమైన సినిమా అని, అది ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే చిత్రమని ఆయన గుర్తుచేశారు. ఈ సినిమాకు సుమారు 15 నంది అవార్డులు వచ్చాయని, కానీ ఈ చిత్రంలో తాను చేసిన పాత్రకు మాత్రం నంది అవార్డు లభించలేదని అన్నారు. తనకు అవార్డులు రాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాల విషయంలో తనను ఎందుకు పట్టించుకోలేదో అర్ధంకాలేదు. ఆయా సంవత్సరాల్లో తనకంటే మెరుగ్గా నటించిన వారు ఎవరైనా ఉన్నారా.? అని కూడా ఆయన నిలదీశారు.  ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : 14ఏళ్లకే ఎంట్రీ.. పెళ్ళైన దర్శకుడితో ఎఫైర్.. కట్ చేస్తే ఫ్యాన్‌కు ఉరేసుకొని..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us