AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిజంగా నాకు దాని గురించి తెలియదు.. చీఫ్ గెస్ట్‌గా పిలిస్తే వెళ్లాను అంతే.. క్లారిటీ ఇచ్చిన రాజీవ్

ఎన్నో సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు నటుడు రాజీవ్ కనకాల. చిన్న చిన్న పాత్రలతో పాటు విలన్ పాత్రల్లోనూ నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఈ సీనియర్ నటుడు. ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించారు రాజీవ్ కనకాల.

నిజంగా నాకు దాని గురించి తెలియదు.. చీఫ్ గెస్ట్‌గా పిలిస్తే వెళ్లాను అంతే.. క్లారిటీ ఇచ్చిన రాజీవ్
Rajeev Kanakala
Rajeev Rayala
|

Updated on: May 13, 2026 | 3:49 PM

Share

టాలీవుడ్ లో తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు రాజీవ్ కనకాల. విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు రాజీవ్ కనకాల. ఎన్నో విలక్షణమైన పాత్రలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాజీవ్ కనకాల.. ఇటీవల ఏ సినిమా విడుదలైన రాజీవ్ కనకాల కచ్చితంగా ఉండాల్సిందే. ఎదో ఒక పాత్రలో ఆయన కనిపించి ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా రాజీవ్ కనకాల ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఓ స్కూల్ కార్యక్రమానికి గెస్ట్ గా వెళ్లిన రాజీవ్ అనుకోని చుక్కులో పడ్డారు. దాంతో ఆయన ఓ వీడియా ద్వారా క్లారిటీ అవ్వాల్సి వచ్చింది. అసలు ఇంతకూ ఎం జరిగిందంటే.. హైదరాబాద్‌లో ఉన్న వైబ్రాంట్ అనే స్కూల్‌‌ ఈవెంట్ కు రాజీవ్ గెస్ట్ గా హాజరయ్యారు.

ఇది కూడా చదవండి : Suman Setty: ఆ హీరో నన్ను పిలిచి సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.. అంతకన్నా ఏం కావాలి

రాజీవ్ గెస్ట్ హాజరవ్వడంతో నవ తెలంగాణ స్టూడెంట్ శక్తి ఆర్గనైజేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ స్కూల్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుందని.. అలాంటి స్కూల్ ను రాజీవ్ కనకాల ప్రమోట్ చేయడంపై నవ తెలంగాణ స్టూడెంట్ శక్తి ఆర్గనైజేషన్ ఫైర్ అయ్యింది. అలాంటి స్కూల్ ను ఎలా ప్రమోట్ చేస్తారు అంటూ నిలదీశారు. దీని పై రాజీవ్ కనకాల క్లారిటీ ఇస్తూ ఓ వీడియోను విడుదల చేశారు.

ఇది కూడా చదవండి : సౌందర్య కాదు.. వెంకటేష్‌తో ఆరు సినిమాలు.. అన్నీ సూపర్ హిట్లే.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?

రాజీవ్ కనకాల మాట్లాడుతూ..  హైదరాబాద్‌లోని వైబ్రాంట్ స్కూల్ ఫంక్షన్‌కి చీఫ్ గెస్ట్‌గా వెళ్లాను. పేరెంట్స్‌తో ఇంటరాక్షన్, మంచి మార్కులు సంపాదించిన స్కూల్ పిల్లలకు నా చేతుల మీదుగా చిన్నపాటి బహుమతులు, సత్కారాలు, సన్మానాలు జరిగాయి.  సెలబ్రిటీ అనుకోండి.. తెలిసిన వ్యక్తి అనుకోండి.. మీలో ఒకడిగా అక్కడికి రావడం జరిగింది. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అక్కడ నవ తెలంగాణ స్టూడెంట్ శక్తి ఆర్గనైజేషన్ పవన్ వచ్చి కొన్ని ప్రశ్నలు అడిగారు. నాకు నిజంగా ఆ స్కూల్ గురించి అవన్నీ తెలియదు. సందేహాలు ఏమైనా ఉంటే పేరెంట్స్ అంతా ఆ స్కూల్ దగ్గరకు వెళ్లి కనుక్కోండి. NVTS వాళ్లు ఏవైతే అడిగారో.. అవన్నీ కనుక్కుని మీ పిల్లల్ని జాయిన్ చేయండి. ఇవన్నీ ఫాలో అవుతారని నేను ఆశిస్తున్నాను. అలాగే స్కూల్ ప్రమోషన్స్ లో నా ఫోటోలు, వీడియోలు వాడొద్దు అని చెప్పా అని క్లారిటీ ఇచ్చారు రాజీవ్ కనకాల.

ఇది కూడా చదవండి : ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఆయన ముందు నిలబడాలన్నా చాలా సిగ్గుపడేదాన్ని..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us