భర్తను దర్శకుడిని చేద్దాం అనుకుంది.. కానీ బెడిసికొట్టింది.. సంపాదించిందంతా పోగొట్టుకొని చివరకు
పాత తరం హీరోయిన్లలో దేవికది ఒక ప్రత్యేక స్థానం. తెలుగు సినిమా పరిశ్రమకు పితామహుడిగా పేరు పొందిన రఘుపతి వెంకయ్య నాయుడుకు దేవిక మనవరాలి వరస అవుతుంది. ఆమె తల్లికి వెంకయ్య గారు చిన్నాన్న. దేవిక తండ్రి గజపతి రావు నాయుడు ఎలక్ట్రికల్ ఇంజనీర్.

అలనాటి అందాల నటి దేవకి జీవిత ప్రస్థానం తెలుగు సినీ చరిత్రలో ఒక విషాద గాథగా నిలిచింది. నెలవంక తొంగి చూసిందా అన్నట్లు ఉండే రూపం ఆమె సొంతం. తెలుగు సినీ పరిశ్రమ పితామహుడిగా పేరుగాంచిన రఘుపతి వెంకయ్య నాయుడు గారికి మనవరాలి వరసయ్యే దేవకి, 1943 ఏప్రిల్ 25న చెన్నైలో గజపతి రావు నాయుడు దంపతులకు జన్మించారు. ఆమెకు మొదట మోహన కృష్ణ అనే పేరు ఉండగా, ఆమె నాన్నగారు మగపిల్లవాడి పేరులా ఉందని ప్రమీలగా మార్చారు. ఆమె తండ్రి మద్రాసు ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లో ఇంజనీర్‌గా పనిచేసేవారు. దేవకి లాయర్ కావాలనే ఆశయం పెట్టుకున్నారు, తన లాయర్ బాబాయ్ ఆదర్శంగా. కానీ, ఆమె అమ్మమ్మ గారికి లలిత కళలపై ఉన్న ఆసక్తి వలన దేవకిని సంగీతం స్కూల్లో చేర్చారు. మద్రాసులో నివసిస్తున్నందున, మనవరాలిని సినిమాల్లోకి పంపాలని అమ్మమ్మ కోరిక. అటుపై, దేవకి “పుట్టిల్లు” అనే చిత్రంతో సినిమారంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత “పక్కింటి అమ్మాయి” సినిమాలో అంజలి దేవి గారి స్నేహితురాలిగా నటించారు. ఈ రెండు చిత్రాలు ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు.
ఇది కూడా చదవండి : నువ్వొద్దు.. నీ పాటలొద్దు..! బాలసుబ్రహ్మణ్యంతో గొడవపడ్డ ఒకే ఒక్క హీరో.. చివరకు ఏం జరిగిందంటే
అయితే, ఆమెను ఒక ఫోటోలో చూసిన డైరెక్టర్ సి. పుల్లయ్య గారు 1955లో వచ్చిన “రేచుక్క” సినిమాలో ఏకంగా కథానాయికగా అవకాశం ఇచ్చారు. ఇందులో ఆమె ఎన్టీఆర్ సరసన నటించారు. నటనకు కొత్త కావడం, ఎన్టీఆర్ వంటి గొప్ప నటునితో కలిసి నటించడం వల్ల, సినిమా అంతా కాస్త ఇబ్బందిగా నటించారని అంటారు. “రేచుక్క” బ్లాక్‌బస్టర్ విజయం సాధించినప్పటికీ, దేవకి అందానికి ఎన్ని మార్కులు పడ్డాయో, నటనకు అంతే విమర్శలు వచ్చాయి. విమర్శలను ప్రశంసలుగా మార్చుకోవాలని దేవకి సంకల్పించారు. దాంతో నాటకరంగంలో చేరి, తన నటనకు పదును పెట్టారు. క్రమంగా తనలో నైపుణ్యాలను పెంచుకుని, తమిళ, తెలుగు చిత్రాలలో వరుస అవకాశాలు అందిపుచ్చుకొని విజయవంతమైన నటిగా నిలిచారు.
ఇది కూడా చదవండి : OTT Movie : IMDB 7.4 రేటింగ్.. వణికిస్తున్న థ్రిల్లర్ మూవీ.. ఏకంగా ఆరు ఓటీటీల్లో
అలా సజావుగా సాగుతున్న ఆమె సినీ ప్రస్థానంలో, ఒక తమిళ అసిస్టెంట్ డైరెక్టర్‌తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారి 1968 ఫిబ్రవరి 12న దేవదాసు అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. తన సహనటులు వారిస్తున్నా ఆమె లెక్కచేయలేదు. తన భర్తను గొప్ప దర్శకునిగా చూడాలని శపథం చేసి, అప్పటివరకు తను కూడబెట్టిన ఆస్తులన్నిటినీ అమ్మి, భర్తను దర్శకునిగా ప్రయత్నించారు. అయితే, ఆ ప్రయత్నం విఫలమై, బూడిదలో పోసిన పన్నీరైంది. దేవకికి ఒక కూతురు కూడా ఉన్నారు, ఆమె తమిళ, మలయాళ చిత్రాలలో నటిగా రాణించారు. దాదాపు 40 చిత్రాలలో నటించిన ఆమె, యూఎస్‌లో ఒక ఇంజనీర్‌ను పెళ్ళాడి, సినీ రంగానికి దూరమై అక్కడే స్థిరపడ్డారు. దేవకి మాత్రం తన భర్తను మధ్యలోనే వదిలేసి, ఆ తర్వాత కాలంలో ఒంటరిగానే ఉంటూ మరణించారు. వెండితెరపై మెరిసిన ఒక అందమైన తార జీవితం వ్యక్తిగత విషాదాలతో ముగియడం ఆమె అభిమానులకు బాధను మిగిల్చింది.




