AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC Civils Admit Card 2026: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ 2026 ప్రిలిమ్స్ అడ్మిట్‌ కార్డులు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే?

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (CSE) 2026 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారు మెయిన్స్ రాసేందుకు అవకాశం ఉంటుంది..

UPSC Civils Admit Card 2026: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ 2026 ప్రిలిమ్స్ అడ్మిట్‌ కార్డులు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే?
UPSC CSE Admit Card
Srilakshmi C
|

Updated on: May 17, 2026 | 6:55 AM

Share

హైదరాబాద్‌, మే 17: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (CSE) 2026 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ మొబైల్ నంబర్, రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ, యూఆర్ఎన్ నంబర్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి హాల్‌టికెట్లను upsconline.nic.in, upsc.gov.in, లేదా upsconline.gov.in డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థులు అందులోని వివరాలన్నింటినీ ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా పరిశీలించుకోవల్సి ఉంటుంది. ముఖ్యంగా పేరు, రోల్ నంబర్, కేటాయించిన పరీక్షా కేంద్రం, రిపోర్టింగ్ సమయం, ఎగ్జామ్ డే ఇన్‌స్ట్రక్షన్ల వంటి వాటిని సరిచూసుకోవాలి.

ఇక యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ప్రిలిమ్స్ 2026 పరీక్ష దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పరీక్షా కేంద్రాలలో మే 24న జరగనుంది. పరీక్షా కేంద్రానికి వెళ్లేటప్పుడు అడ్మిట్ కార్డుతో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్​ ఐడీ వంటి ఏదైనా ఒక అధికారిక ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారిని మెయిన్స్‌ పరీక్షలు రాసేందుకు అనుమతిస్తారు. యూపీఎస్సీ CSE ప్రిలిమ్స్ పరీక్ష ఆఫ్ లైన్ విధానంలో పెన్, పేపర్ మోడ్ లో జరుగుతుంది.

ఈ ఏడాది మొత్తం 933 పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నియామక ప్రక్రియ కొనసాగిస్తుంది. అభ్యర్థులు తమ పేరు, రోల్ నంబర్, పరీక్షా కేంద్రం, రిపోర్టింగ్ సమయం, పరీక్ష రోజు సూచనలతో సహా హాల్ టికెట్‌పై పేర్కొన్న అన్ని వివరాలను జాగ్రత్తగా తనిఖీ చేసుకుని, ఆ ప్రకారంగా సూచనలు పాటించడం మంచిది. ఎంపికైన వారిని ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఇతర గ్రూప్-ఎ, గ్రూప్-బి సెంట్రల్ సర్వీసులు కేటాయిస్తారు. యేటా ఈ పరీక్షలకు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఈ పోస్టులకు పోటీ పడుతుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us