Today Gold Price: మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..
Today Gold Price: అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటం, యూఎస్ బాండ్ల రాబడులు పెరగడం వల్ల, పెట్టుబడిదారుల ఆసక్తి బంగారం నుండి డాలర్ వైపు మళ్లింది. గత కొన్ని రోజులుగా ధరలు పెరగడంతో పెద్ద పెట్టుబడిదారులు అధిక స్థాయిలలో లాభాలను స్వీకరించడంతో మార్కెట్ పతనానికి దారితీసింది..

Today Gold Price: బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. శనివారం ఎంసీఎక్స్ (MCX)లో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోవడంతో, ఫ్యూచర్స్ బంగారం, వెండి కూడా పడిపోయాయి. ఏడాది పాటు బంగారం కొనవద్దని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చిన తరుణంలో ఈ తగ్గుదల చోటుచేసుకుంది. దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,56,930 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,850 ఉంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,17,700 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి విషయానికొస్తే.. హైదరాబాద్, చెన్నై, కేరలలో కిలో వెండి ధర రూ.2,90,000 వద్ద కొనసాగుతుండగా, ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.2,80,000 వద్ద ట్రేడవుతోంది.
- హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,930 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,850 వద్ద కొనసాగుతోంది.
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,080 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,44,000 వద్ద కొనసాగుతోంది.
- ముంబైలో 4 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,930 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,850 వద్ద కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Personal Finance: నెలకు రూ. 1,000 పెట్టుబడితో రూ. 54 లక్షల ఫండ్..!
అలాగే అమెరికన్ డాలర్ విలువ పెరగడం వల్ల బంగారం, వెండి ధరలు కూడా తగ్గాయి. ఫిబ్రవరి 28న అమెరికా-ఇరాన్ ఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి బంగారం ధర సుమారు 13% పడిపోయింది. మీరు బంగారం లేదా వెండి కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇది బెస్ట్ సమయమనే చెప్పాలి. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న గందరగోళం మధ్య, శుక్రవారం భారత బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తీవ్రంగా పడిపోయాయి. అమ్మకాల ఒత్తిడితో బంగారం, వెండి ధరలు భారీగా పతనం అయ్యాయి.
అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటం, యూఎస్ బాండ్ల రాబడులు పెరగడం వల్ల, పెట్టుబడిదారుల ఆసక్తి బంగారం నుండి డాలర్ వైపు మళ్లింది. గత కొన్ని రోజులుగా ధరలు పెరగడంతో పెద్ద పెట్టుబడిదారులు అధిక స్థాయిలలో లాభాలను స్వీకరించడంతో మార్కెట్ పతనానికి దారితీసింది. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ప్రకారం, ద్రవ్యోల్బణ ఆందోళనలు కఠినమైన ద్రవ్య విధానంపై అంచనాలను పెంచాయి. ఇది విలువైన లోహాలపై ఒత్తిడిని పెంచింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




