Gold Purchases: బంగారం కొనుగోళ్లకు బ్రేక్.. మోదీ మాటపై ప్రజల షాకింగ్ నిర్ణయం.. సర్వేలో సంచలన విషయాలు..!
Gold Purchases: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు విపరీతంగా పెరగడం వల్లే దిగుమతి బిల్లు భారీగా పెరిగిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల కాలంలో కిలో బంగారం ధర సుమారు రూ. 76.6 లక్షల నుండి ఏకంగా రూ. 99.8 లక్షలకు చేరడమే ఇందుకు నిదర్శనం..

Gold Purchases: భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ అంతా ఇంతా కాదు. పండగైనా, పెళ్లయినా పసిడి కొనాల్సిందే. అయితే, దేశ ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, “బంగారపు కొనుగోళ్లను ఏడాది పాటు నిలిపివేయాలి” అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని చేసిన ఈ ప్రకటనపై ప్రముఖ రీసెర్చ్ సంస్థ ‘లోకల్ సర్కిల్స్’ (LocalCircles) ఒక ఆసక్తికరమైన సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో దేశ ప్రజల ఆలోచనలకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రధాని మాటకు జై కొట్టిన 61 శాతం మంది
దేశంలో బంగారం వాడకాన్ని తగ్గించాలన్న ప్రధాని పిలుపునకు మెజారిటీ భారతీయులు సానుకూలంగా స్పందించినట్లు సర్వే వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న వారిలో ఏకంగా 61 శాతం మంది భారతీయులు ఈ ఏడాది బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇందులో 36 శాతం మంది అసలు ఈ ఏడాది బంగారమే కొనబోమని స్పష్టంగా ప్రకటించగా.. మరో 28 శాతం మంది తమ కొనుగోళ్లను పూర్తిగా తగ్గించుకుంటామని వెల్లడించారు.
ఫారెక్స్ నిల్వల రక్షణే ముఖ్యం: 66% మంది అభిప్రాయం
భారతదేశం తన అవసరాల కోసం అత్యధికంగా బంగారాన్ని విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల దేశంలోని విదేశీ మార్పిడి నిల్వలు (Forex Reserves) కరిగిపోతాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 66 శాతం మంది ప్రజలు దేశ ఆర్థిక వ్యవస్థను, విదేశీ మార్పిడి నిల్వలను కాపాడుకునేందుకు బంగారం కొనుగోళ్లు తగ్గించడమే ఉత్తమమైన మార్గమని అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి: Android 17: ఆండ్రాయిడ్ 17లో అదిరిపోయే ప్రైవసీ అప్‌డేట్.. ఎలాంటి ఫీచర్స్ ఉంటాయో తెలిస్తే మైండ్ బ్లాంకే..!
ప్రధాని మోదీ పిలుపునిచ్చినప్పటికీ, భారతదేశంలో ఉన్న సంస్కృతి, సాంప్రదాయాల కారణంగా బంగారం కొనక తప్పదని కొందరు చెబుతున్నారు. పెళ్లిళ్లు, ఇతర సాంప్రదాయ పండుగల కోసం ప్రధాని పిలుపునిచ్చినప్పటికీ తాము బంగారం కొనుగోళ్లు జరుపుతామని 19 శాతం వెల్లడించినట్లు సర్వే ద్వారా తెలుస్తోంది. మరో 19 శాతం మంది ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల్లో (ఆర్థిక మందగమనం, యుద్ధాలు వంటివి) ‘బంగారమే సురక్షితమైన పెట్టుబడి’ (Safe Haven) అని నమ్ముతున్నారు. అందుకే తాము పెట్టుబడి రూపంలో పసిడిని కొనుగోలు చేస్తామని వీరు స్పష్టం చేశారు.
రికార్డు స్థాయికి చేరిన పసిడి దిగుమతులు:
గతేడాదితో పోలిస్తే భారతదేశంలోకి పసిడి దిగుమతులు భారీగా పెరిగాయి. ఆర్థిక సంవత్సరం 2026 లో ఏకంగా 71.98 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకుంది.
ధరల పెరుగుదలే ప్రధాన కారణం:
నిజానికి దిగుమతి చేసుకునే పరిమాణం కంటే, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు విపరీతంగా పెరగడం వల్లే దిగుమతి బిల్లు భారీగా పెరిగిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల కాలంలో కిలో బంగారం ధర సుమారు రూ. 76.6 లక్షల నుండి ఏకంగా రూ. 99.8 లక్షలకు చేరడమే ఇందుకు నిదర్శనం. దేశ ఆర్థిక భద్రత కోసం బంగారం వినియోగాన్ని తగ్గించాలన్న ప్రభుత్వ ఆలోచనకు ప్రజల నుండి మంచి మద్దతు లభిస్తోందని లోకల్ సర్కిల్స్ సర్వే స్పష్టం చేస్తోంది. మరి రానున్న రోజుల్లో ఈ సర్వే ఫలితాలు మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.
ఇది కూడా చదవండి: Indian Railways: తత్కాల్ టికెట్లు బుక్ కావట్లేదా? వేగం ఒక్కటే సరిపోదు.. ఈ ‘సీక్రెట్ ట్రిక్స్’ పాటిస్తే కన్ఫర్మ్ సీట్ మీదే!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




