ఎవ్వరు ఊహించని విధంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలిస్తే షాక్

May 13, 2026

Subhash

బంగారం, వెండి కొనుగోలుదారులకు ఇది బ్యాడ్‌న్యూస్‌ అనే చెప్పాలి. ఎందుకంటే బంగారం, వెండి రికార్డు స్థాయిలో దూసుకుపోయాయి.

బంగారం, వెండి 

ప్రస్తుతం వార్త రాసే సమయానికి 10 గ్రాముల బంగారంపై 8 వేలకుపైగా పెరిగింది. అదే వెండిపై 20 వేల రూపాయల వరకు పెరిగింది. 

10 గ్రాముల బంగారం

అయితే మే 13న ఉదయం తులంపై ఏకంగా 13 వేల వరకు పెరిగింది. కానీ మధ్యాహ్నం సమయానికి కాస్త తగ్గి రూ.8 వేల వరకు పెరుగుదల ఉంది.

 మే 13న ఉదయం

ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,62,000 రూపాయల వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,48,500 రూపాయల వద్ద ట్రేడవుతోంది.

హైదరాబాద్‌లో

ఇదే ధర ముంబై, కోల్‌కతా, బెంగళూరులలో కొనసాగుతోంది. ఇక్కడ కూడా తులం బంగారం ధర 1,62,000 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఇతర నగరాల్లో

ఢిల్లీలో అయితే కాస్త ఎక్కువగా ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,62,150 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,48,650 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో

వెండి ధర 20 వేల రూపాయలు పెరిగిన తర్వాత కిలో వెండి   హైదరాబాద్‌లో 3,30,000 రూపాయల వద్ద కొనసాగోతోంది. అదే ఇతర ప్రాంతాల్లో 3,10,000 రూపాయల వద్ద కొనసాగుతోంది.

వెండి ధర

కేంద్రం బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని భారీగా పెంచిన తర్వాత ఒక్కసారిగా ఈ ధరల్లో మార్పులు వచ్చింది. దీంతో కొనుగోలుదారులకు భారమనే చెప్పాలి.

కస్టమ్స్ డ్యూటీ