ఇల్లు నిర్మించేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకూడదు..!

May 8, 2026

Subhash

సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితకాల కల. నిర్మాణం సమయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీస్తాయి. ఇల్లు కట్టే ప్లానింగ్‌లో ఉంటే ఇవి గుర్తుంచుకోండి.

సొంత ఇల్లు

ఇల్లు కట్టేటప్పుడు నిర్మాణ ఖర్చులనే లెక్కవేస్తారు. కానీ రిజిస్ట్రేషన్, ఇంటీరియర్, పన్నులు వంటి అదనపు ఖర్చులను మర్చిపోతారు. దీనివల్ల డబ్బు ఇబ్బందితో నిర్మాణం ఆగిపోయే ప్రమాదం ఉంది.

బడ్జెట్ అంచనా

డబ్బు ఆదా చేయడానికి సిమెంట్, ఇనుము లేదా ఇటుకల విషయంలో నాణ్యత తగ్గించకండి. దీనివల్ల ఇంటి గోడలు త్వరగా బీటలు వారడం లేదా ఇతర నిర్మాణ సమస్యలు తలెత్తుతాయి.

మెటీరియల్

ఇంట్లోకి సహజమైన గాలి, వెలుతురు రాకపోతే ఇల్లు ఇరుకుగా, చీకటిగా అనిపిస్తుంది. కిటికీలు, తలుపుల అమరిక విషయంలో జాగ్రత్త వహించండి. ఇది మీ ఆరోగ్యానికి కూడా ముఖ్యం.

వెంటిలేషన్:

నిర్మాణం ప్రారంభించే ముందే గదుల సైజు, కిచెన్, బాత్‌రూమ్‌ల స్థానాల గురించి స్పష్టమైన ప్లాన్ ఉండాలి. పని మొదలయ్యాక మార్పులు చేయడం వల్ల ఖర్చు పెరుగుతుంది.

సరైన ప్లానింగ్ లేకపోవడం:

స్విచ్ బోర్డులు ఎక్కడ ఉండాలి, నీటి పైపుల కనెక్షన్లు ఎలా ఉండాలి అనేవి ముందే నిర్ణయించుకోవాలి. ఇల్లు పూర్తయ్యాక గోడలు పగలగొట్టి మళ్ళీ వైరింగ్ చేయడం వల్ల ఇంటి అందం దెబ్బతింటుంది.

ఎలక్ట్రికల్, ప్లంబింగ్:

ఇల్లు కట్టేటప్పుడు కేవలం ప్రస్తుత కుటుంబ సభ్యుల సంఖ్యనే కాకుండా, భవిష్యత్తులో వచ్చే మార్పులను (పిల్లల గదులు లేదా గెస్ట్ రూమ్స్) కూడా దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేయాలి.

భవిష్యత్తు అవసరాలను:

ఇల్లు కట్టేటప్పుడు ఇలాంటి విషయాలను గుర్తించుకుని ముందస్తు ప్లాన్‌తో నిర్మాణం సాగిస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి గుర్తించుకోవాల్సిందే: