Indian Railways: తత్కాల్ టికెట్లు బుక్ కావట్లేదా? వేగం ఒక్కటే సరిపోదు.. ఈ ‘సీక్రెట్ ట్రిక్స్’ పాటిస్తే కన్ఫర్మ్ సీట్ మీదే!
Indian Railways: సామాన్యుల నుంచి ఉన్నత వర్గాల వరకు చాలా మంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. అయితే రైలు ప్రయాణం చేయాల్సి వస్తే నెలల ముందే ప్లాన్ చేసుకోకపోతే రైలు టికెట్లు దొరకడం గగనమే. ఇక అత్యవసరంగా ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు..

Indian Railways: వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. ఫ్యామిలీతో కలిసి వెకేషన్లకు వెళ్లేవారు కొందరైతే, సొంతూళ్లకు, పుణ్యక్షేత్రాలకు ప్రయాణమయ్యే వారు మరికొందరు. భారతదేశంలో బస్సులు, ఫ్లైట్లతో పోలిస్తే రైలు ప్రయాణమే అత్యంత చౌకైనది. సౌకర్యవంతమైనది. అందుకే మన దగ్గర రైళ్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అయితే, నెలల ముందే ప్లాన్ చేసుకోకపోతే రైలు టికెట్లు దొరకడం గగనమే.
ఇక అత్యవసరంగా ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు మనకు గుర్తొచ్చే ఏకైక ఆప్షన్ ‘తత్కాల్’ (Tatkal). కానీ తత్కాల్ విండో ఓపెన్ అయిన రెండు నిమిషాలకే టికెట్లు అన్నీ అయిపోతుంటాయి. తత్కాల్ బుకింగ్‌లో కేవలం ఇంటర్నెట్ వేగం ఒక్కటే ఉంటే సరిపోదు. సరైన ప్లానింగ్ కూడా ఉండాలి. ఆ కన్ఫర్మ్ టికెట్ మీ సొంతం కావాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించి చూడండి.
ఇది కూడా చదవండి: Android 17: ఆండ్రాయిడ్ 17లో అదిరిపోయే ప్రైవసీ అప్‌డేట్.. ఎలాంటి ఫీచర్స్ ఉంటాయో తెలిస్తే మైండ్ బ్లాంకే..!
1. టైమింగ్స్ గుర్తున్నాయా? ముందే లాగిన్ అవ్వండి:
తత్కాల్ బుకింగ్స్ రైలు బయల్దేరే ఒక రోజు ముందు ప్రారంభమవుతాయి. ఏసీ (AC) క్లాస్ టికెట్ల కోసం: ఉదయం 10:00 గంటలకు నాన్-ఏసీ (Non-AC/Sleeper) టికెట్ల కోసం: ఉదయం 11:00 గంటలకు చాలా మంది కరెక్ట్‌గా 10 లేదా 11 గంటలకు లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఆ సమయంలో సర్వర్లపై లోడ్ ఎక్కువై ‘టైమ్ అవుట్’ ఎర్రర్ వస్తుంది. అందుకే బుకింగ్ విండో ఓపెన్ కావడానికి 2-3 నిమిషాల ముందే IRCTC వెబ్‌సైట్ లేదా రైల్ వన్ (Rail Connect) యాప్‌లోకి లాగిన్ అయి సిద్ధంగా ఉండండి.
2. ‘మాస్టర్ లిస్ట్’ (Master List) మంత్రం:
తత్కాల్ బుకింగ్‌లో ప్రతి సెకనూ విలువైందే. బుకింగ్ ఓపెన్ అయ్యాక ప్రయాణికుల పేర్లు, వయసు, ఆధార్ నంబర్ వంటి వివరాలు టైప్ చేస్తూ కూర్చుంటే సీట్లు ఖాళీ అయిపోతాయి. చేయాల్సింది ఇదే: IRCTC యాప్ లేదా వెబ్‌సైట్‌లోని ‘My Profile’ లోకి వెళ్లి ‘Master List’ ఆప్షన్ ద్వారా ప్రయాణికుల వివరాలను ముందే సేవ్ చేసి పెట్టుకోండి. దీనివల్ల బుకింగ్ సమయంలో కేవలం ఆ పేర్లను ‘టిక్’ చేస్తే సరిపోతుంది. టైపింగ్ చేసే సమయం చాలా వరకు ఆదా అవుతుంది.
3. స్టేషన్ కోడ్స్, ట్రైన్ నంబర్స్ రెడీగా ఉంచుకోండి:
చివరి నిమిషంలో ఏ రైలు? ఏ స్టేషన్? అని వెతుక్కునే పని లేకుండా.. మీరు ప్రయాణించాల్సిన ట్రైన్ నంబర్, బోర్డింగ్, డెస్టినేషన్ స్టేషన్ కోడ్‌లను ముందే ఒక పేపర్ మీదనో లేదా మొబైల్ నోట్స్‌లోనో రాసి పెట్టుకోండి.
4. పేమెంట్ ప్రాసెస్ ఫాస్ట్‌గా అవ్వాలంటే..
తత్కాల్ టికెట్ చేజారిపోవడానికి ప్రధాన కారణం ‘పేమెంట్’ ఆలస్యం కావడం. OTP రాకపోవడం లేదా బ్యాంక్ సర్వర్ స్లో ఉండటం వల్ల టికెట్లు మిస్ అవుతుంటాయి.
బెస్ట్ ఆప్షన్: IRCTC వాలెట్ (Wallet) లో ముందే డబ్బులు లోడ్ చేసి పెట్టుకోవడం ద్వారా పేమెంట్ కేవలం ఒక్క క్లిక్‌తో పూర్తవుతుంది. మరో మార్గం ఏమిటంటే.. ఒకవేళ యూపీఐ (UPI) లేదా నెట్ బ్యాంకింగ్ వాడాలనుకుంటే మీ యూపీఐ ఐడీలను ముందే కాపీ చేసి పెట్టుకోండి లేదా కార్డ్ వివరాలను రెడీగా ఉంచుకోండి. తత్కాల్ బుకింగ్ అనేది ఒక రకంగా ‘టైమ్ రేస్’ లాంటిది. ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్‌గా ఉండేలా చూసుకోవడంతో పాటు, పైన పేర్కొన్న ట్రిక్స్ పాటిస్తే.. ఈ సమ్మర్ సీజన్‌లో కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా ఈజీగా తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: PM Kisan: పీఎం కిసాన్ సాయం పొందే భార్యాభర్తలకు షాకింగ్.. డబ్బులు కట్..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




