AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ డైరెక్టర్‌కి విపరీతమైన క్లారిటీ ఉంది.. సిరివెన్నెల మనసు దోచుకున్న దర్శకుడు

ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్రి మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మనల్ని వదిలేసి ఇన్నేళ్లు అవుతున్నా ఆయన మరణాన్ని తెలుగు చిత్రపరిశ్రమ జీర్ణించుకోలేకపోతుంది. ఇండస్ట్రీకి ఎన్నో అద్భుతమైన పాటలు రచించారు సిరివెన్నెల సీతారామశాస్రి. ఇప్పటికీ ఆయన పాటలు ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తున్నాయి.

ఆ డైరెక్టర్‌కి విపరీతమైన క్లారిటీ ఉంది.. సిరివెన్నెల మనసు దోచుకున్న దర్శకుడు
Sirivennela Seetharama Sast
Rajeev Rayala
|

Updated on: May 17, 2026 | 9:47 AM

Share

ప్రఖ్యాత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఎన్నో అద్భుతమైన పాటలను అందించారు. తెలుగు ప్రేక్షకుల మనస్సులో చిరగని ముద్రవేశారు సిరివెన్నెల. ఆయన రచించిన సినిమా పాటల గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి  మాట్లాడుతూ.. పాటలను కేవలం సినిమాలో ఒక భాగంలా కాకుండా, అవి స్వతంత్రంగా నిలబడే కళా రూపాలుగా చూడాలని ఆయన తెలిపారు. దర్శకుడికి సన్నివేశంపై సంపూర్ణ స్పష్టత, సహజత్వం ఉన్నప్పుడు, ఆ పాట గేయ రచయిత సొంతం అవుతుందని, సార్వత్రిక భావాలను ప్రతిబింబిస్తుందని సిరివెన్నెల గారి మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయాన్ని వివరించడానికి, సిరివెన్నెల రామ్ గోపాల్ వర్మ (RGV) దర్శకత్వంలో వచ్చిన క్షణ క్షణం సినిమాను ఉదాహరణగా తీసుకున్నారు. క్షణ క్షణం చిత్రంలో పాటలు ఇంటర్వెల్ తర్వాతే మొదలవుతాయని, కేవలం రెండే రెండు పాటలకే చోటు ఉందని RGV ముందుగానే స్పష్టంగా ఉన్నారని తెలిపారు. RGV “మనీ” అనే థీమ్‌ను తీసుకుని ఒక సీన్ రాయమని, దానిని పాటగా మారుద్దామని సూచించారని సిరివెన్నెల గుర్తుచేసుకున్నారు.

ఇది కూడా చదవండి :RK Roja: ఒక్కహీరో కూడా నాకు లవ్ ప్రపోజ్ చేయలేదు.. కారణం ఏంటో చెప్పిన రోజా

ఓ దొర దోచుకో పాటలో మధ్యతరగతి ఆశలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్లు చిత్రీకరించబడిన సీన్, RGV స్పష్టతకు నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు. క్షణ క్షణం చిత్రంలోని మరో పాటకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు ఎదురయ్యాయని సిరివెన్నెల వెల్లడించారు. నెమ్మదిగా సాగే ట్యూన్, శ్రీదేవి వంటి సౌందర్యరాశిపై బురద చల్లి చిత్రీకరించడం వంటి అంశాలపై ప్రశ్నలు తలెత్తాయి. అయితే, RGV తన దృక్పథంపై చాలా స్పష్టంగా ఉన్నారని, కేవలం శ్రీదేవి అందం, హొయలు మాత్రమే తనకు కావాలని, సాహిత్యం ఎలా ఉన్నా తాను అనుకున్న విధంగానే చిత్రీకరిస్తానని చెప్పినట్లు సిరివెన్నెల వివరించారు. సంగీత దర్శకుడు కీరవాణి ట్యూన్ ఎలా చేసినా, తాను అనుకున్నట్లుగానే చిత్రీకరిస్తానని RGV చెప్పిన మాటలు అతని తిరుగులేని క్లారిటీని తెలియజేస్తాయని సిరివెన్నెల తెలిపారు.

ఇది కూడా చదవండి : మూడు పెళ్లిళ్లు చేసుకొని తప్పు చేశా.. టైం అంతా వేస్ట్.. ఇప్పుడు బుద్దొచ్చింది

సినిమా కథకు నేరుగా సంబంధం లేని అరూప భావాలు లేదా సార్వత్రిక భావాలను పాటలు కలిగి ఉండాలని సిరివెన్నెల గారు అన్నారు. అందనంత ఎత్తా తారా తీరం వంటి పాట సినిమా కథకు సంబంధం లేకపోయినా, ఎవరైనా పాడుకోవచ్చని, అది ఒక తండ్రి తన పాపకు పాడుకోవచ్చు లేదా ఒక ప్రియుడు తన ప్రియురాలికి పాడుకోవచ్చు అని వివరించారు. పాట కేవలం ప్రేమ వికారానికి మాత్రమే పరిమితం కాదని, పురుషులలో తండ్రి, బిడ్డ, స్నేహితుడు వంటి అనేక కోణాలు ఉంటాయని, స్త్రీని కూడా ఆ గౌరవప్రదమైన దృష్టితో చూడగలగాలని ఆయన అభిప్రాయపడ్డారు. సహజమైన సన్నివేశాల నుంచి అవకాశాలను రాబట్టుకోవడం తన బాధ్యత అని సిరివెన్నెల పేర్కొన్నారు. ఈ పాటలు విన్నప్పుడు ఏ సిట్యుయేషన్‌కైనా అన్వయించుకోవచ్చు, అప్పుడు హీరో, హీరోయిన్ గుర్తుకు రారని, అదే తనకు కావలసిందని ఆయన అన్నారు. ఒక బహుమతిని అందమైన ర్యాపర్‌లతో చుట్టి ఇవ్వడం ద్వారా, దాని లోపల ఉన్న వస్తువు మరింత ఆనందాన్ని ఇస్తుందని ఆయన పోల్చారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :భర్తను దర్శకుడిని చేద్దాం అనుకుంది.. కానీ బెడిసికొట్టింది.. సంపాదించిందంతా పోగొట్టుకొని చివరకు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us