AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..? ఈ బిజినెస్ సీక్రెట్స్ మిస్ అవ్వకండి..

డీమార్ట్‌లో షాపింగ్ చేయడం అందరికీ అలవాటే.. కానీ అదే డీమార్ట్ ద్వారా లక్షల్లో వ్యాపారం చేయవచ్చని ఎంతమందికి తెలుసు? మీ దగ్గర మంచి క్వాలిటీ ప్రాడక్ట్ ఉంటే చాలు.. డీమార్ట్ బోర్డుతో మీ వ్యాపారాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లవచ్చు. డీమార్ట్ వెండర్‌గా మారడం ఎలా? అసలు ఏ ఏ వస్తువులకు అనుమతి ఉంటుంది? అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..? ఈ బిజినెస్ సీక్రెట్స్ మిస్ అవ్వకండి..
How To Sell Your Products In D Mart
Krishna S
|

Updated on: Aug 12, 2026 | 7:45 AM

Share

దేశంలోనే అత్యంత పాపులర్ అయిన రిటైల్ నెట్‌వర్క్‌లలో డీమార్ట్‌ది ఫస్ట్ ప్లేస్. రోజు ఏదైనా నిత్యావసరాల కోసం సగటు మధ్యతరగతి కుటుంబం మొదటి ప్రాధాన్యత డీమార్ట్‌కే ఇస్తుంది. అయితే డీమార్ట్ కేవలం వస్తువులు కొనుగోలు చేసే స్టోర్ మాత్రమే కాదు.. చిన్న, మధ్య తరహా వ్యాపారులకు తమ ఉత్పత్తులను కోట్లాది మంది కస్టమర్లకు చేరువ చేసే ఒక గొప్ప వ్యాపార వేదిక కూడా. సాధారణంగా డీమార్ట్ థర్డ్ పార్టీ వ్యక్తులకు ఎలాంటి ఫ్రాంచైజీలను ఇవ్వదు. అంటే మనం స్వయంగా డీమార్ట్ పేరుతో అవుట్‌లెట్ తెరవలేం. కానీ మన దగ్గర నాణ్యమైన ఉత్పత్తులు ఉంటే, డీమార్ట్‌కు వెండర్‌గా మారి మన వస్తువులను వారి స్టోర్లలో విక్రయించవచ్చు. అయితే డీమార్ట్‌లో మన ప్రాడక్ట్‌ను షెల్ఫ్‌లోకి తీసుకెళ్లడానికి కొన్ని కఠినమైన నిబంధనలు, అర్హతలు ఉన్నాయి.

ఉండాల్సిన ప్రాథమిక అర్హతలు

నాణ్యత – పోటీ ధరలు: డీమార్ట్ బ్రాండ్ ఇమేజ్‌కు తగినట్లు ఉత్పత్తుల క్వాలిటీ అద్భుతంగా ఉండాలి. అలాగే మార్కెట్‌లోని ఇతర బ్రాండ్లతో పోటీపడేలా తక్కువ ధరలో అందించగలగాలి.

ఆకర్షణీయమైన ప్యాకేజింగ్: ప్రొడక్ట్ ప్యాకింగ్ ఇంటర్నేషనల్ ప్రమాణాలకు తగ్గట్టుగా చూడగానే ఆకట్టుకునేలా ఉండాలి.

నిరంతర సరఫరా: డీమార్ట్ ఆర్డర్ ఇచ్చే భారీ పరిమాణంలో సరుకును ఎప్పుడూ కొరత రాకుండా వేగంగా సరఫరా చేసే సామర్థ్యం ఉండాలి.

తప్పనిసరి డాక్యుమెంట్లు – కనీస అవసరాలు

డీమార్ట్‌లో ప్రాడక్ట్ అమ్మాలంటే వ్యాపారానికి సంబంధించిన అన్ని లీగల్ అనుమతులు ఉండాలి.

జీఎస్‌టీ – పాన్: వ్యాపార జీఎస్‌టీ రిజిస్ట్రేషన్, పాన్ కార్డ్ తప్పనిసరి.

FSSAI లైసెన్స్: ఒకవేళ మీరు అమ్మేది తినే పదార్థాలు, ఆహార ఉత్పత్తులు అయితే ఆహార భద్రతా శాఖ లైసెన్స్ తప్పనిసరిగా సమర్పించాలి.

BIS సర్టిఫికేషన్: ఎలక్ట్రానిక్స్ లేదా కొన్ని నిర్దిష్ట వస్తువులకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనుమతి ఉండాలి.

GS1 బార్‌కోడ్: మీ ఉత్పత్తులపై అంతర్జాతీయ గుర్తింపు పొందిన GS1 బార్‌కోడ్ ఖచ్చితంగా ముద్రించి ఉండాలి.

MSME – ఉద్యమ్ రిజిస్ట్రేషన్: చిన్న పరిశ్రమలు నడిపే వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ సర్టిఫికేట్ ఉంటే ప్రాధాన్యత లభిస్తుంది.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది?

డీమార్ట్ మాతృ సంస్థ అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. అందులోని Partner With Us విభాగానికి వెళ్లి Vendor Registration ఫారమ్‌ను పూరించాలి. మీ ప్రొడక్ట్ వివరాలు, క్యాటలాగ్, సర్టిఫికేట్లు, ధరల జాబితాను అప్‌లోడ్ చేయాలి. డీమార్ట్ క్వాలిటీ చెకింగ్ టీమ్ మీ వివరాలను పరిశీలించి, మీ ప్రాడక్ట్ నచ్చితే సంప్రదిస్తుంది.

వ్యాపార ఒప్పందం – పేమెంట్ నిబంధనలు

ప్లేస్‌మెంట్ ఫీజు: స్టోర్ల షెల్ఫ్‌లలో మీ ప్రాడక్ట్‌ను ప్రదర్శించడానికి డీమార్ట్ కొన్నిసార్లు ప్రారంభ నిబంధనల ప్రకారం కొంత రుసుము వసూలు చేసే అవకాశం ఉంటుంది.

ఆర్టీవీ పాలసీ: అమ్ముడుపోని సరుకు లేదా రవాణాలో డ్యామేజ్ అయిన వస్తువులను వెనక్కి తీసుకునే నిబంధనలకు ఒప్పుకోవాల్సి ఉంటుంది.

పేమెంట్ సైకిల్: సాధారణంగా సరుకు సప్లై చేసిన 30 నుండి 60 రోజుల్లోపు డీమార్ట్ బిల్లులను క్లియర్ చేస్తుంది.

మీ దగ్గర మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ఉండి, నిరంతరం సప్లై చేసే కెపాసిటీ ఉంటే.. డీమార్ట్ వెండర్‌గా మారడం ద్వారా మీ బిజినెస్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లవచ్చు.

Follow Us