AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Majili Movie: ఎంత మారిపోయింది భయ్యా.. మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే మతిపోవాల్సిందే..

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు హీరోహీరోయిన్లుగా మారిపోయారు. తమ నటనతో, వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ వెండితెరపై సందడి చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఇంకా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటున్నారు. చదువులపై దృష్టి పెట్టి తమ పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ సందడి చేస్తున్నారు. తాజాగా ఓ చైల్డ్ ఆర్టి్స్టు ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

Majili Movie: ఎంత మారిపోయింది భయ్యా.. మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే మతిపోవాల్సిందే..
Malili Child Artist
Rajitha Chanti
|

Updated on: Aug 12, 2026 | 8:10 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హిట్ చిత్రాలు చాలా ఉన్నాయి. అందులో మజిలీ ఒకటి. అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన ఈ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ మూవీలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. 2019లో ఎలాంటి అంచనాలు, హడావిడి లేకుండా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ ఘన విజయం సాధించింది. ఇప్పటికీ ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇదంతా పక్కన పెడితే.. ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన అమ్మాయి గుర్తుందా..? తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది. ఇందులో మీరా అనే పాత్రలో కనిపించిన ఆ చిన్నారికి టాలీవుడ్ లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడిందంటే అతిశయోక్తి కాదు. ఈ మూవీ తర్వాత ఆమె మరో సినిమా చేయలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలతో అలరించింది. మజిలీ సినిమాలో నటించిన ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు అనన్య అగర్వాల్.

ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్..

మజిలీ తర్వాత తెలుగు చలన చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్న ఈ అమ్మడు.. హిందీలో మాత్రం పలు సినిమాలు, సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంటుంది. 2004లో ముంబైలో జన్మించిన అనన్య.. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. తుజ్ సంగ్ ప్రీత్ లగై సజ్నా అనే సీరియల్ ద్వారా బుల్లితెర ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అందులో తన అమాయకమైన నటనతో కట్టిపడేసింది. ఆ త్రవాత సబ్ కీ లాడ్లీ బెబో.. యహో మే ఘర్ ఘర్ ఖాలీ, ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూ, ఏక్ నయి చోటీ సీ జిందకీ, క్యా హుహా తేరీ వాదా, అమృత్ మంథన్, మహాభారత్, ది అడ్వైంచర్స్ ఆఫ్ హథీమ్, బంధన్, సియా కే రామ్, మేరీ దుర్గా, రూమ్ మర్ద్ కా నయా స్వరూప్, లాక్ డౌన్ కి లవ్ స్టోరీ వంటి అనేక సీరియల్స్ చేసి స్మాల్ స్క్రీన్ పై స్టార్ డమ్ సంపాదించుకుంది.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్..

అయితే తెలుగులో మాత్రం మజిలీ సినిమాతోనే అడుగుపెట్టింది. మొదటి చిత్రంతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. కానీ ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. ప్రస్తుతం బుల్లితెరపై నటనను కంటిన్యూ చేస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు హీరోయిన్ అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇన్ స్టాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. మజిలీ బ్యూటీ ఇంతగా మారిపోయిందేంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్..

అనన్య అగర్వాల్..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : రూ.150 కోట్లు పెట్టి పరమ చెత్త సినిమా తీశారు.. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్.. ఇప్పటికీ కోలుకోని నిర్మాత..

Follow Us