AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC: మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..? తెరవెనుక ఇంత జరుగుతుందా..?

లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కోట్లాదిమంది దేశవ్యాప్తంగా పాలసీలు కలిగి ఉన్నాయి. అయితే ఈ పాలసీలను ఎల్‌ఐసీ ఎక్కడ పెట్టుబడి పెడుతుందనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. అసలు ఎల్‌ఐసీ పాలసీదారుల డబ్బు ఎక్కడికి పోతుంది? స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తారా..?

LIC: మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..? తెరవెనుక ఇంత జరుగుతుందా..?
Lic
Venkatrao Lella
|

Updated on: Aug 12, 2026 | 7:49 AM

Share

దేశంలో లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ)లో కోట్లాది మంది పాలసీలు కలిగి ఉన్నారు. ఎల్‌ఐసీ అనేక పాలసీలను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొస్తుంది. పెట్టిన పెట్టుబడికి మంచి రిటర్న్స్‌తో పాటు జీవిత బీమా లభించే స్కీములకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. సామాన్య, మధ్యతరగతి ప్రజల కోసం స్వల్ప మొత్తంలో ప్రీమియం ఉండే పాలసీలతో పాటు కోటీశ్వరుల కోసం అనేక పాలసీలను ఎల్‌ఐసీ నిర్వహిస్తోంది. అయితే ఏదైనా పాలసీ తీసుకుంటే ఏడాదికి ఒకసారి లేదా ఆరు నెలలు, నెలకు ఒకసారి ప్రీమియం చెల్లించే ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. పాలసీ నియమ నిబంధనలు, వయస్సు, పాలసీ కవరేజీని బట్టి ప్రీమియం ఎంత అనేది నిర్ణయిస్తారు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఈ ప్రీమియం చెల్లించవచ్చు. అయితే చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటుంది. పాలసీదారులు కట్టిన ప్రీమియంను ఎల్‌ఐసీ ఏం చేస్తుందనే అనుమానం ఉంటుంది. వాటికి సమాధానాలు ఇప్పుడు చూద్దాం.

స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి

పాలసీదారుల డబ్బులను ఎల్‌ఐసీ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెడుతుంది. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల షేర్లను కొనుగోలు చేస్తుంది. గత ఐదేళ్లలో ఎల్ఐసీ పెట్టుబడుల విస్తృతిని ఎప్పటికప్పుడు మారుస్తుంది. బోర్డు సభ్యుల ఆమోదం, ఇన్వెస్ట్‌మెంట్ అసెస్‌మెంట్, ఒక క్లియర్ ఫ్రేమ్‌వర్క్, కంపెనీల వృద్ది అంచనా ఆధారంగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడతారు. పరిస్థితులకు అనుగుణంగా, మార్కెట్లలోని ఒడిదొడుకుల ఆధారంగా కొన్నిసార్లు కంపెనీల్లో వాటాను పెంచడం లేదా తగ్గించడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఏయే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టామనే విషయాలను ఎల్‌ఐసీ వెల్లడించదు. ఆయా కంపెనీల వివరాలను బయటికి చెప్పారు. ఆయా కంపెనీల వ్యాపార ప్రయోజనాలతో పాటు ఎల్‌ఐసీ ఆర్ధిక ప్రయోజనాలపై ప్రత్యక్ష ప్రభావం చూపే ప్రమాదం ఉన్నందున ఎల్‌ఐసీ వివరాలను బయటకి వెల్లడించదు.

స్టాక్స్‌ను ఎలా ఎంచుకుంటుంది..?

ఏదైనా కంపెనీలో షేర్లు కొనుగోలు చేసే సమయంలో ముందుగా తనిఖీ ప్రక్రియను ఎల్‌ఐసీ అధికారులు చేపడతారు. కంపెనీల ఆర్ధిక పరిస్థితి, భవిష్యత్ వృద్ది, బిజినెస్ మోడల్, బిజినెస్ ప్రాస్పెక్ట్స్ వంటి వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. సెబీ, ఆర్బీఐ, ఐఆర్‌డీఏఐ, ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 గైడ్‌లైన్స్ ఆధారంగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు అనేవి పెడతారు. ఇక స్టాక్ మార్కెట్లలో నష్టపోకుండా ఉండేందుకు స్టాప్ లాస్ మెకానిజం కూడా ఉపయోగిస్తారు. ఇక పెట్టబడులను ఎప్పటికప్పుడు రీబ్యాలెన్స్ చేసుకుంటారు. ఏ రంగానికి ఎంత కేటాయింపులు చేయాలనేది నిర్ణయం తీసుకుంటారు. ఆడిటర్లు ఎప్పటికప్పుడు ఈ పెట్టబడులను నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు.

Follow Us
విపరీతంగా జుట్టు రాలుతోందా డెర్మటాలజిస్ట్ చెప్పిన టాప్ 10 కారణాలు
విపరీతంగా జుట్టు రాలుతోందా డెర్మటాలజిస్ట్ చెప్పిన టాప్ 10 కారణాలు
ఇన్‌స్టా రీల్స్‌ చూసి దొంగనోట్ల తయారీ.. ముగ్గురు అరెస్ట్
ఇన్‌స్టా రీల్స్‌ చూసి దొంగనోట్ల తయారీ.. ముగ్గురు అరెస్ట్
పిల్లల లంచ్‌బాక్స్, బ్రేక్‌ఫాస్ట్‌లోకి హెల్తీ చపాతీ ఎగ్ రోల్!
పిల్లల లంచ్‌బాక్స్, బ్రేక్‌ఫాస్ట్‌లోకి హెల్తీ చపాతీ ఎగ్ రోల్!
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్.. కీలక నిర్ణయం
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్.. కీలక నిర్ణయం
ఐసీసీ ర్యాంకింగ్స్ వెనుక అసలు రహస్యం.. పాయింట్లు ఎలా ఇస్తారు?
ఐసీసీ ర్యాంకింగ్స్ వెనుక అసలు రహస్యం.. పాయింట్లు ఎలా ఇస్తారు?
బీఆర్‌ఎస్ నేత జక్కుల కిరణ్‌కుమార్‌పై కేసు నమోదు
బీఆర్‌ఎస్ నేత జక్కుల కిరణ్‌కుమార్‌పై కేసు నమోదు
లడ్డూ పవిత్రతకు.. వైరల్‌ కల్చర్‌ ఎసరు?
లడ్డూ పవిత్రతకు.. వైరల్‌ కల్చర్‌ ఎసరు?
ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచే 5 సింపుల్ జపనీస్ సూత్రాలు
ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచే 5 సింపుల్ జపనీస్ సూత్రాలు
జన్మాష్టమి ఉపవాసం ఎలా చేయాలి? ఏం తినాలి.. ఎప్పుడు విరమించాలి?
జన్మాష్టమి ఉపవాసం ఎలా చేయాలి? ఏం తినాలి.. ఎప్పుడు విరమించాలి?
పవన్ కల్యాణ్ అభిమాని మృతి.. గొప్ప మనసు చాటుకున్న నిర్మాత ఎస్కేఎన్
పవన్ కల్యాణ్ అభిమాని మృతి.. గొప్ప మనసు చాటుకున్న నిర్మాత ఎస్కేఎన్