AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో ఎన్ని అంతస్తుల్లో నిర్మిస్తున్నారంటే?

హైదరాబాద్‌ కోకాపేట్‌లో రూ.2,000 కోట్ల పెట్టుబడితో ట్రంప్ టవర్స్‌ నిర్మాణం కానుంది. గోల్డెన్ మైల్ రోడ్డుపై 65 అంతస్తుల రెండు టవర్లలో సుమారు 450 లగ్జరీ నివాసాలు ఉంటాయి. స్కై బ్రిడ్జ్, ట్రంప్ క్లబ్ ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నాయి. అపార్ట్‌మెంట్ల ధరలు రూ.5 కోట్ల నుంచి ప్రారంభం కానున్నాయి.

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో ఎన్ని అంతస్తుల్లో నిర్మిస్తున్నారంటే?
Trump Towers Hyderabad
SN Pasha
|

Updated on: Aug 12, 2026 | 7:37 AM

Share

కోకాపేట్‌లోని గోల్డెన్ మైల్ రోడ్డుపై ట్రంప్ బ్రాండెడ్ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ రాబోతోంది. ట్రైబెకా డెవలపర్స్, ఐరా రియల్టీ కలిసి ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనున్నాయి. ఇది దక్షిణ భారతదేశంలో తొలి ట్రంప్ బ్రాండెడ్ ప్రాజెక్ట్‌గా నిలవనుంది. ప్రాజెక్టుకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TGRERA) కూడా రిజిస్ట్రేషన్ ఇచ్చింది.

రూ.2,000 కోట్ల పెట్టుబడి.. 800 అడుగుల ఎత్తు

డెవలపర్ల ప్రకటన ప్రకారం ఈ ప్రాజెక్ట్‌లో సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. రెండు భారీ టవర్లను నిర్మించనుండగా, ఒక్కో టవర్ దాదాపు 65 అంతస్తులు, సుమారు 800 అడుగుల ఎత్తు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. మొత్తం సుమారు 450 లగ్జరీ నివాసాలు ఉండనున్నాయి. ప్రాజెక్టు విస్తీర్ణం, యూనిట్ల సంఖ్యకు సంబంధించి అధికారిక RERA రికార్డులో రెండు భవనాలు, 2,64,580 చదరపు మీటర్ల ఆమోదిత బిల్ట్-అప్ ఏరియా నమోదైంది.

స్కై బ్రిడ్జ్.. ప్రత్యేక ఆకర్షణ

రెండు టవర్లను అనుసంధానించే స్కై బ్రిడ్జ్ ఈ ప్రాజెక్టుకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇందులో ప్రత్యేకమైన క్లబ్ ఫ్లోర్, లగ్జరీ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు డెవలపర్లు తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్ట్‌ను హైదరాబాద్‌లోని అత్యంత ప్రీమియం లగ్జరీ రెసిడెన్షియల్ డెవలప్‌మెంట్లలో ఒకటిగా రూపొందిస్తున్నారు.

రూ.5 కోట్ల నుంచి ఇళ్ల ధరలు

ప్రాజెక్టులో 3.5 BHK, 4 BHK, డబుల్-హైట్ సింప్లెక్స్‌లు, పెంట్‌హౌస్‌లు ఉండనున్నాయి. డెవలపర్ల ప్రకారం సాధారణ అపార్ట్‌మెంట్ల ధరలు సుమారు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఉండొచ్చు. కొన్ని పెంట్‌హౌస్ డీల్స్ ఇప్పటికే వందల కోట్ల విలువలో జరిగాయని సంస్థ వెల్లడించింది. మార్కెట్ లిస్టింగ్స్‌లో కూడా ప్రాజెక్ట్ ధరలు యూనిట్, సైజు ఆధారంగా భారీగా మారుతున్నాయి.

2031 నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక

ఈ ప్రాజెక్ట్‌కు TGRERA రిజిస్ట్రేషన్ నంబర్ P02400010871. కోకాపేట్ గోల్డెన్ మైల్‌లో 16,389.76 చదరపు మీటర్ల స్థలంలో ఇది నిర్మాణం కానుంది. అధికారిక RERA రికార్డు ప్రకారం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి 2031 మే 15 గడువుగా పెట్టుకున్నారు. హైదరాబాద్‌లో ట్రంప్ బ్రాండ్‌కు ఇది తొలి అడుగు కాగా, దక్షిణ భారతదేశంలో లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో బ్రాండ్ విస్తరణకు ఇది కీలక ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు.

Follow Us
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..