AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. రూ.9,800 పెరిగిన బంగారం ధర.. రికార్డ్‌ స్థాయి దిశగా వెండి..!

Gold Price: అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 4,399 డాలర్లుగా ఉంటే, వెండి ఔన్సు ధర 65 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. హర్మూజ్ జలసంధి తెరిచే అంశంలో కొనసాగుతున్న అనిశ్చితి కారణంగా క్రూడాయిల్ ధరలు మండుతున్నప్పటికీ, ట్రేడర్ల నుంచి..

Gold Price: మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. రూ.9,800 పెరిగిన బంగారం ధర.. రికార్డ్‌ స్థాయి దిశగా వెండి..!
Gold Rate
Subhash Goud
|

Updated on: Aug 11, 2026 | 9:25 PM

Share

Gold Price: దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. గత కొన్ని రోజుల కిందటి నుంచి దిగి వచ్చిన బంగారం, వెండి ధరలు.. మళ్లీ రెండు, మూడు రోజుల నుంచి రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. మరోసారి బంగారం, వెండి ధరలు పుంజుకోవడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ప్రధాన నగరాల్లో పసిడి ధరలు రెండు నెలల గరిష్ఠ స్థాయికి చేరగా, వెండి సైతం అదే బాటలో పయనిస్తోంది.

వరుసగా పెరుగుతున్న ధరలు:

ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర తాజాగా రూ. 1,200 పెరిగి రూ. 1.57 లక్షల స్థాయికి చేరుకుంది. అటు వెండి ధర కూడా కిలోకు రూ. 2,000 పెరిగి రూ. 2.42 లక్షలకు చేరింది. గడిచిన ఆరు రోజుల్లోనే 10 గ్రాముల పసిడి ధర మొత్తంగా రూ. 9,800 మేర పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

జూన్ 12న 10 గ్రాముల పసిడి ధర రూ. 1.56 లక్షలుగా ఉండగా, ఆగస్టు 3 నాటికి రూ. 1.47 లక్షలకు తగ్గింది. అయితే, స్వల్ప వ్యవధిలోనే మళ్లీ పుంజుకుని ప్రస్తుత స్థాయికి చేరింది. ఇటు వెండి కూడా గత ఏప్రిల్ 30 తర్వాత మళ్లీ గరిష్ఠంగా రూ. 2.42 లక్షల మార్కును తాకింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లోనూ మంగళవారం సాయంత్రానికి బంగారం ధర రూ. 1.57 లక్షలు, వెండి రూ. 2.42 లక్షల వద్ద ట్రేడయ్యాయి.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా, అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 4,399 డాలర్లుగా ఉంటే, వెండి ఔన్సు ధర 65 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. హర్మూజ్ జలసంధి తెరిచే అంశంలో కొనసాగుతున్న అనిశ్చితి కారణంగా క్రూడాయిల్ ధరలు మండుతున్నప్పటికీ, ట్రేడర్ల నుంచి బలమైన డిమాండ్ ఉండటంతో బంగారం, వెండి ధరలు గరిష్ఠ స్థాయిల్లోనే కొనసాగుతున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Electric Scooter: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సగం ధరకే.. నెలకు EMI కేవలం రూ.1,863..!

మరోవైపు, జులై నెలకు సంబంధించి అమెరికా వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలు త్వరలోనే వెలువడనున్నాయి. ఈ డేటా ఆధారంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ తమ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోనుంది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో పసిడి, వెండి రేట్లపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: DMart Offers: రక్షాబంధన్ సందర్భంగా భారీ ఆఫర్లు.. డీమార్ట్‌లో 80 శాతం వరకు డిస్కౌంట్లు..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us