AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Cylinder: బుక్ చేసిన 4 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. ఇక నుంచి రోజుల పాటు వేచి ఉండక్కర్లేదు.. టెన్షన్ తీరినట్లే..

గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త. ఇక నుంచి బుక్ చేసుకున్న 4 గంటల్లోనే ఇంటికి సిలిండర్ డోర్ డెలివరీ కానుంది. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్స్‌ప్రెస్ డెలివరీ సేవలను ఇండేన్ ప్రారంభించింది. దీంతో అందుబాటులోకి ఈ సేవలు వచ్చేశాయి.

Gas Cylinder: బుక్ చేసిన 4 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. ఇక నుంచి రోజుల పాటు వేచి ఉండక్కర్లేదు.. టెన్షన్ తీరినట్లే..
Gas Cylinder
Venkatrao Lella
|

Updated on: Aug 12, 2026 | 7:16 AM

Share

బుక్ చేసిన 3 నుంచి 4 గంటల్లోనే ఇంటికి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ డెలివరీ కానుంది. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ డెలివరీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇండేన్ ఎక్స్‌ట్రా లైట్ నౌ పేరుతో సూపర్ ఫాస్ట్ డెలివరీ సేవలను ప్రారంభించింది. ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నాక ఇంటికి రావడానికి వారం రోజుల సమయం పడుతుంది. కొన్ని సమయాల్లోనే రెండు, మూడు రోజులకు డోర్ డెలివరీ అవుతుంది. అయితే ఇక నుంచి రోజుల పాటు వెయిట్ చేయాల్సిన పని ఉండదు. కేవలం గంటల వ్యవధిలోనే ఇంటికి వచ్చేస్తుంది. గ్యాస్ వినియోగదారులకు ఇది పెద్ద ఊరటగా చెప్పవచ్చు. వినియోగదారులకు వేగవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఇండేన్ ఈ సేవలను ప్రారంభించింది.

ఎక్స్‌ప్రెస్ డెలివరీ సేవలు ప్రారంభం

ఈ ఎక్స్‌ప్రెస్ డెలివరీ సేవలు కాంపోజిట్ గ్యాస్ సిలిండర్‌కు వర్తించనున్నాయి. 14.2 కేజీల సిలిండర్‌ కాకుండా 10 కేజీల కాంపోజిట్ సిలిండర్‌ను ఇండేన్ సంస్థ తీసుకొచ్చింది. ఈ సిలిండర్‌ను బుక్ చేసుకున్న 4 గంటల్లోపే పొందవచ్చు. ఈ సిలిండర్‌ను మాత్రమే ఎక్స్‌ట్రా లైట్ నౌ డెలివరీ సేవల కింద ఇండేన్ వేగవంతంగా అందించనుంది. ఉదయం 7 గంటలకు సిలిండర్ బుక్ చేసుకుకంటే 11 గంటలకల్లా ఇంటికి చేరుతుంది. ఇండియన్ ఆయిల్ వన్ యాప్ లేదా ఇండియన్ ఆయిల్ కస్టమర్ వెబ్ సైట్, వాట్సప్ నెంబర్ ‘7588888824’ ద్వారా ఈ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఇక ఈ 10 కేజీల సిలిండర్ కొత్తగా తీసుకోవాలంటే ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. ఎక్కువ పత్రాలు కూడా అవసరం లేదు.

కాంపోజిట్ సిలిండర్ ప్రత్యేకతలు ఇవే..

కాంపోజిట్ సిలిండర్ 14.2 కేజీల సిలిండర్ కంటే చాలా తేలికగా ఉంటుంది. ఎవరైనా ఈ సిలిండర్‌ను ఒక చోట నుంచి మరో చోటకు సులువుగా తీసుకెళ్లవచ్చు. బరువు ఎక్కువగా ఉండదు గనుక ఒక ప్రాంతం నుంచి మరే ప్రాంతానికి ఈజీగా తీసుకెళ్లవచ్చు. మహిళలు, వృద్దులు కూడా దీనిని ఎత్తి వేరే ప్రదేశంలో పెట్టవచ్చు. ఇక ఈ సిలిండర్‌కు ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. ఎంత గ్యాస్ మిగిలి ఉందనేది బయటకు కనిపిస్తూ ఉంటుంది. దీని వల్ల గ్యాస్ ఎప్పుడు అయిపోతుందనే టెన్షన్ ఉండదు. ఎప్పటికప్పుడు కనిపిస్తూ ఉంటుంది గనుక ముందే జాగ్రత్త పడి రీఫిల్లింగ్ కోసం ఆర్డర్ పెట్టుకోచ్చు. ఫైబర్ పదార్థాలతో ఈ సిలిండర్ డిజైన్ చేశారు. దీంతో ఇవి తుప్పు పట్టవు. ఇందులో అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. సిలిండర్ పేలినప్పుడు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఇనుప సిలిండర్లు పేలితే భారీ ప్రమాదం జరుగుతుంది. కానీ ఈ కొత్త సిలిండర్లతో ప్రమాదాల తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది.

Follow Us