టాటా కార్లపై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా రూ.3 లక్షల వరకు డిస్కౌంట్‌

May 11, 2026

Subhash

టాటా మోటర్స్‌ కూడా కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు సంస్థలు కస్టమర్లను ఆకట్టుకోవడానికి భారీగా రాయితీలు ప్రకటించాయి.

 టాటా మోటర్స్‌ 

ఇదే జాబితాలోకి టాటా మోటర్స్‌ కూడా చేరింది. కంపెనీకి చెందిన అన్ని రకాల మోడళ్లపై రూ.3 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనాలు అందిస్తోంది.

అన్ని రకాల మోడళ్లపై

దీంట్లో ఎక్సేంజ్‌ బోనస్‌, డిస్కౌంట్‌, కార్పొరేట్‌ డిస్కౌంట్‌, నగదు, అలాగే ఇతర ఆర్థిక ప్రయోజనాలు ఇస్తున్నట్టు తాజాగా ప్రకటించింది.

ఎక్సేంజ్‌ బోనస్‌

ప్రముఖ వాహన సంస్థ టాటా మార్కెట్లోకి నెక్సాన్‌ ప్యూర్‌+ పీఎస్‌ మోడల్‌ను తీసుకొచ్చింది. పానోరమిక్‌ సన్‌రూఫ్‌తో తీర్చిదిద్దిన ఈ కారు ప్రారంభ ధర రూ.9.59 లక్షలుగా నిర్ణయించింది. 

నెక్సాన్‌ ప్యూర్‌+ పీఎస్‌

పెట్రోల్‌ రకం రూ.9.59 లక్షల నుంచి రూ.10.14 లక్షల లోపు ఉండగా, సీఎన్‌జీ మాడల్‌ రూ.10.39 లక్షలుగాను, డీజిల్‌ రకం రూ.10.54 లక్షల నుంచి రూ.11.19 లక్షల లోపు ఉన్నాయి. ఇవి న్యూఢిల్లీ షోరూం ధరలు

పెట్రోల్‌ రకం

1.2 లీటర్‌ టర్బోచార్జ్‌ ఇంజిన్‌ కలిగిన ఈ మాడల్‌ పెట్రోల్‌, ట్విన్‌ సిలిండర్‌ ఐసీఎన్‌జీ రకంతోపాటు డీజిల్‌ ఇంజిన్‌తో కూడా తీర్చిదిద్దింది.

టర్బోచార్జ్‌ ఇంజిన్‌

వాయిస్‌తో పానోరమిక్‌ సన్‌రూఫ్‌ను కంట్రోల్‌ చేసే టెక్నాలజీతో తయారైన ఈ కారులో 26 సెంటిమీటర్ల ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ ఉన్నాయి.

పానోరమిక్‌ సన్‌రూఫ్‌

అలాగే ఇందులో ఆరు స్పీకర్లు, హెచ్‌డీ రియర్‌ కెమెరా, ఆటో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్‌ వంటి ఫీచర్స్‌తో తయారు చేసినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

హెచ్‌డీ రియర్‌ కెమెరా