May 9, 2026
Subhash
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్-2026 (Amazon Great Summer Sale-2026) ప్రారంభమైంది. ఇందులో మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులపై భారీ తగ్గింపులు ఉన్నాయి.
అయితే ప్రైమ్ మెంబర్ల (Prime Members) కోసం ముందే అందుబాటులోకి వచ్చిన ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు (Discounts) లభిస్తున్నాయి.
HDFC బ్యాంక్ కార్డ్ వినియోగదారులకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ (గరిష్టంగా రూ. 9,500 వరకు) అదనపు ప్రయోజనంగా ఉంది.
ఈ సేల్‌లో శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా 5జీ ధర భారీగా తగ్గింది. రూ.1,29,999 ఉన్న ఈ ఫోన్ ఇప్పుడు రూ.99,999 కే లభిస్తోంది.
అదేవిధంగా ఈ ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.70,000 వరకు అదనపు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. పైగా రూ.2,000 విలువైన కూపన్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది.
ఇక బడ్జెట్ ఫోన్ చూస్తున్న వారి కోసం రెడ్ మీ ఏ7 ప్రొ 5జీ రూ.11,999 (రూ. 15,999) కే లభిస్తోంది. ఇందులో 6.9 ఇంచుల డిస్ప్లే, 6,300mAh భారీ బ్యాటరీ ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి.
ఆపిల్ ఐప్యాడ్ ప్రియుల కోసం ఆపిల్ ఐపాడ్ 11-అంగుళాల మోడల్ రూ.32,900 ధర వద్ద సేల్‌లో ఉంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా దీని ధరను రూ.31,150 వరకు తగ్గించుకోవచ్చు.
పాత లాప్‌టాప్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే మరో రూ.8,850 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇటీవలే లాంచ్ అయిన శాంసంగ్ 43-అంగుళాల క్రిస్టల్ యూహెచ్ డీ 4కే విజన్ ఏఐ స్మార్ట్ టీవీపై డిస్కౌంట్ ఇస్తోంది.