AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఇండస్ట్రీని షేక్ చేసిన గ్లామర్ క్వీన్.. ఆమె డ్రెస్‏తోనే పాటను సూపర్ హిట్ చేసేది..

నటి సిల్క్ స్మిత క్రేజ్ గురించి కాస్ట్యూమ్ డిజైనర్ సాయిబాబు సంచలన విషయాలు చెప్పారు. అప్పట్లోనే ఆమె ఒక్కో డ్రెస్ కోసం లక్ష రూపాయలు ఖర్చు చేసేవారట. బయ్యర్లు ఆమె పాట ఉంటేనే సినిమా కొనేవారని, అంతటి స్టార్‌డమ్ ఉన్నా చివరకు ఎవరూ లేని స్థితిలో ఆమె మరణించడం ఎంతో బాధాకరమని ఆయన ఇంటర్వ్యూలో ఆవేదనతో గుర్తుచేసుకున్నారు. ఆమె సినీ ప్రయాణం ఒక సంచలనం.

Rajitha Chanti
|

Updated on: Apr 01, 2026 | 10:46 PM

Share
నటి సిల్క్ స్మిత అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. ఒకానొక సమయంలో స్టార్ హీరోల సినిమాలకు సమానంగా ఆమె క్రేజ్ ఉండేది. ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ సాయిబాబు సిల్క్ స్మితతో తనకున్న అనుబంధాన్ని, ఆమె వ్యక్తిత్వం గురించి ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

1 / 5
సిల్క్ స్మిత తన దుస్తుల విషయంలో చాలా స్పష్టంగా ఉండేవారు. పాట విన్న తర్వాత, ఆ పాటకు ఎలాంటి డ్రెస్ బాగుంటుందో ఆమె స్వయంగా నిర్ణయించుకునేవారు. వివిధ ఆల్బమ్స్ చూసి డిజైన్లను ఎంపిక చేసుకునేవారు. 30 ఏళ్ల క్రితమే ఆమె తన ఒక్కో డ్రెస్ కోసం దాదాపు లక్ష రూపాయల వరకు ఖర్చు చేసేవారని సాయిబాబు తెలిపారు. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. ఆమె కట్టే డ్రెస్సులలో ఉండే పూసలు, రాళ్లు మరియు హ్యాంగింగ్స్ ఆమె డాన్స్‌కు తగ్గట్టుగా కదులుతూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేవి.

2 / 5
ఆ కాలంలో పంపిణీదారులు సినిమా కొనాలంటే మొదట " స్పెషల్ సాంగ్ ఉందా? అందులో సిల్క్ స్మిత ఉందా?" అని అడిగేవారట. ఆమె ఉంటేనే సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అవుతుందని బయ్యర్లు నమ్మేవారు. ఒక హీరోయిన్‌కు ఇచ్చే రెమ్యునరేషన్‌ను ఆమె కేవలం ఒకే ఒక్క పాట కోసం తీసుకునేవారని, అప్పట్లో ఆమెకు 2 నుండి 3 లక్షల రూపాయల వరకు చెల్లించేవారని సాయిబాబు గుర్తు చేసుకున్నారు.

3 / 5
తెరపై ఎంత ఎక్స్పోజింగ్ చేసినా, బయట మాత్రం ఆమె చాలా స్టైలిష్‌గా,పద్ధతిగా ఉండేవారని ఆయన చెప్పారు.ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించిన సిల్క్ స్మిత జీవితం విషాదాంతం కావడం తనను ఎంతో బాధించిందని సాయిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 32 ఏళ్ల వయసులో, కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఆమె ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

4 / 5
ఆమె చనిపోయిన తర్వాత హాస్పిటల్‌లో ఆమెను పట్టించుకునే నాథుడే లేకపోవడం, అతి సామాన్యంగా ఆమె మృతదేహం ఉండటం చూసి తాను ఎంతో చలించిపోయానని ఆయన వివరించారు. పేరు, డబ్బు ఉన్నప్పటికీ ఆమె వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఒత్తిళ్లు ఆమెను ఈ నిర్ణయం వైపు నడిపించాయని అన్నారు.

5 / 5
Follow Us