AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేందీ మావ..! వెంకటేష్ వాయిస్ ఇచ్చిన ఈ సినిమా రూ.9వేల కోట్లు రాబట్టింది.!!

దగ్గుబాటి హీరో వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో కూడా నటిస్తున్నారు. అలాగే బాలకృష్ణతో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నారు. అలాగే సోలో హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

ఇదేందీ మావ..! వెంకటేష్ వాయిస్ ఇచ్చిన ఈ సినిమా రూ.9వేల కోట్లు రాబట్టింది.!!
Movie News
Rajeev Rayala
|

Updated on: Nov 25, 2025 | 12:05 PM

Share

హాలీవుడ్ సినిమాలకు మనదేశంలోనూ భారీగా అభిమానులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా మంది ఈ ఇంగ్లిష్ సినిమాలను ఎగబడి చూస్తారు. అలా యాక్షన్ జానర్ కు సంబంధించి హాలీవుడ్‌ ఫ్రాంఛైజీల్లో సూపర్ హిట్ అయిన సిరీస్ చాలా ఉన్నాయి. అలాగే సూపర్ హీరోల సినిమాలకు మన దగ్గర విపరీతంగా క్రేజ్ ఉంది. మార్వెల్ సినిమాలు మన దగ్గర అన్నీ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. ఇండియాలోనూ ఈ సిరీస్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక హాలీవుడ్ సినిమాలు తెలుగులో కూడా మార్కెట్ చేసుకోవడానికి చాలా మంది మన తెలుగు హీరోల వాయిస్ ఓవర్లతో రిలీజ్ చేస్తున్నారు. అవైజర్స్ ఎండ్ గేమ్ లో థానోస్ పాత్రకు రానా వాయిస్ ఇచ్చారు. అదిరిపోయే తన వాయిస్ తో సినిమాకు హైలైట్ గా నిలిచారు రానా..

ఏం సినిమా రా బాబు.! భయంతో వాంతులు చేసుకోవడం ఖాయం.. ఎక్కడ చూడొచ్చంటే

ఆతర్వాత సూపర్ మహేష్ బాబు కూడా హాలీవుడ్ సినిమాకు వాయిస్ ఇచ్చారు. లయన్ కింగ్ సినిమాకు ప్రీక్వెల్ గా వచ్చిన ముఫాసా సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఇచ్చారు. అలాగే సత్యదేవ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రకు వాయిస్ ఇచ్చారు. అయితే దగ్గుబాటి స్టార్ హీరో వెంకటేష్ కూడా ఓ హాలీవుడ్ సినిమాకు వాయిస్ ఇచ్చారు. ఆ సినిమా ఎదో మీకు తెలుసా.? అవును వెంకటేష్ ఓ హాలీవుడ్ మూవీకి తన వాయిస్ ఇచ్చారు.

లక్ అంటే ఈ బ్యూటీదే.. స్టార్ హీరో సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న క్రేజీ హీరోయిన్.. 11ఏళ్ల తర్వాత ఇలా..

ఆ సినిమా ఎదో కాదు హాలీవుడ్ లో తెరకెక్కిన అల్లాదీన్. ఈ సినిమా 2019లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో హాలీవుడ్ హీరో విల్ స్మిత్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. అల్లాదీన్ సినిమాలో విల్ స్మిత్ జీనీ పాత్రలో కనిపించాడు. ఈ సినిమాకు విల్ స్మిత్ పాత్రకు వెంకటేష్ వాయిస్ ఇచ్చారు. అలాగే అల్లాదీన్ పాత్రకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వాయిస్ ఇచ్చాడు. ఈ సినిమాలో వెంకీ వాయిస్‌తో మ్యాజిక్ చేశాడు. ఇక ఈ సినిమా తెలుగులో రూ.55 కోట్లు వసూల్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 9వేల కోట్లుకు పైగా వసూల్ చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బిజినెస్ ఐడియా మీది.. పెట్టుబడి వీళ్లది!
బిజినెస్ ఐడియా మీది.. పెట్టుబడి వీళ్లది!
అనంత్ అంబానీ వాచ్ విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
అనంత్ అంబానీ వాచ్ విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్.. కట్ చేస్తే 200కు పైగా
ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్.. కట్ చేస్తే 200కు పైగా
మీ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసే యాప్స్‌ సురక్షితమేనా..? గుర్తించడం ఎలా
మీ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసే యాప్స్‌ సురక్షితమేనా..? గుర్తించడం ఎలా
పనికిరావని పారేస్తున్నారా? ఈ గింజలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష!
పనికిరావని పారేస్తున్నారా? ఈ గింజలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష!
భూగర్భంలో అతిపెద్ద బంగారు నిధి.. 3400 టన్నుల గోల్డ్‌ గుర్తింపు!
భూగర్భంలో అతిపెద్ద బంగారు నిధి.. 3400 టన్నుల గోల్డ్‌ గుర్తింపు!
అప్పుడెప్పుడో మాయం అయ్యింది.. ఇప్పుడు మెగాస్టార్ మూవీతో ఛాన్స్..
అప్పుడెప్పుడో మాయం అయ్యింది.. ఇప్పుడు మెగాస్టార్ మూవీతో ఛాన్స్..
నారింజ పండ్ల తొక్కలు పడేస్తున్నారా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే
నారింజ పండ్ల తొక్కలు పడేస్తున్నారా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే
దుర్వాసనను స్పాంజ్‌లా పీల్చేస్తుంది.. యాపిల్ చేసే మ్యాజిక్ ఇదే
దుర్వాసనను స్పాంజ్‌లా పీల్చేస్తుంది.. యాపిల్ చేసే మ్యాజిక్ ఇదే
గంగవ్వ శతాయుష్కురాలు.. 101 పడిలోకి అడుగు
గంగవ్వ శతాయుష్కురాలు.. 101 పడిలోకి అడుగు