బిగ్ బాస్ షో వల్ల నా కెరీర్ నాశనం అయ్యింది.. టాలీవుడ్ హీరోయిన్..

Rajitha Chanti

Pic credit - Instagram

01 April 2026

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ తేజస్వి మదివాడ. అందం, అభినయంతో తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యింది.

ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె బిగ్ బాస్ షో గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ముఖ్యంగా ఆ షో కారణంగా తన కెరీర్ నాశనం అయ్యిందని.. తనకున్న ఫేమ్ కూడా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. తేజస్వి మదివాడ కామెంట్స్ మరోసారి తెరపైకి వచ్చాయి.

బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొంది తేజస్వి. అయితే ఆ షోకు వెళ్లడం కారణంగా తనకు మంచి ఫేమ్ వస్తుందని ఆశించనని.. కానీ తనను చూపించిన విధానం భిన్నంగా ఉందని వాపోయింది.

తాను స్ట్రెట్ ఫార్వర్డ్ గా మాట్లాడే వ్యక్తినని..అదే తనకు నెగిటివ్ అయ్యింది తెలిపింది. జరిగింది ఒకటి.. చూపించింది మరోటి అంటూ చెప్పుకొచ్చింది తేజస్వి. 

దీంతో తనపై ప్రేక్షకులలో నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చిందని తెలిపింది. ఆ తర్వాత తనకు తెలుగులో సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయని చెప్పుకొచ్చింది. 

బిగ్ బాస్ తర్వాత వచ్చిన ట్రోలింగ్, విమర్శలు తన పై తీవ్ర మానసిక ఒత్తిడిని తీసుకొచ్చాయని.. దాదాపు రెండేళ్లు సినిమాలు లేకుండా ఖాళీగా ఉన్నానని చెప్పుకొచ్చింది.

ఆ సమయంలో ఆ షో ద్వారా సంపాదించిన డబ్బుతోనే జీవించానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తేజస్వి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది.