Telangana: తెలంగాణలో పెరిగిన మీసేవ సర్వీస్ ఛార్జీలు.. ఒకేసారి భారీగా పెంపు.. ఎంతంటే..?
తెలంగాణలో మీ సేవ సర్వీస్ ఛార్జీలు పెరిగాయి. ఒకసారి భారీగా పెరిగాయి. గతంలో రూ.35 ఉన్న కనీస ఛార్జీలను రూ.62కి పెంచారు. తమకు కమిషన్ సరిపోవడం లేదని మీ సేవ నిర్వహకులు ఎప్పటినుంచో కోరుతన్నారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణ ప్రజలకు షాక్ తగిలింది. రాష్ట్రంలో మీ సేవ సర్వీస్ ఛార్జీలను భారీగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీ సేవ నిర్వహకుల నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు ప్రభుత్వం ధరలను పెంచింది. ఈ మేరకు ఐటీ, కమ్యూనికేషన్ శాఖ కొత్త ఛార్జీలపై ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచే పెరిగిన ఛార్జీలు అమల్లోకి వస్తాయిని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలోని ప్రజలపై అదనపు భారం పడనుంది. తమకు వచ్చే కమిషన్‌ను పెంచాలని ప్రభుత్వాన్ని మీ సేవ నిర్వహకులు ఎప్పటినుంచో కోరుతున్నారు. కరెంట్, ఇంటర్నెట్, సిబ్బంది ఖర్చులు పెరిగిన క్రమంలో పెంచాలని కోరుతున్నారు. దీంతో ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఎంత పెరిగిందంటే..?
ఇన్ కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ గతంలో రూ.45 నుంచి రూ.55 వరకు ఉండగా.. ఇప్పుడు రూ.80కి పెరిగింది. ఇక స్థానిక ధృవీకరణ పత్రంకు రూ.80కి పెరిగింది. ఇక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్‌కు గతంలో రూ.40 నుంచి రూ.45 వరకు ఉండగా.. ఇప్పుడు రూ.62కి చేరుకుంది. గతంలో కనిష్టంగా ఉన్న రూ.35 సర్వీస్ ఛార్జీలను ఇప్పుడు రూ.62కి పెంచారు. ఏ కేటగిరీ సర్టిఫికెట్ ప్రింట్ వంటి వాటికి రూ.62 వసూలు చేయనున్నారు. ఇక ఆర్టీఏ, కరెంట్ బిల్లు చెల్లింపులు, ప్రభుత్వ అప్లికేషన్లపై కూడా అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు.
వాట్సప్ మీ సేవ
తెలంగాణ ప్రభుత్వం వాట్సప్ మీ సేవ సేవలను ప్రారంభించింది. మీ సేవ కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా వాట్సప్‌లోనే మీ సేవ సేవలను పొందవచ్చు. దాదాపు 581 రకాల సేవలను వాట్సప్‌లోనే పొందవచ్చు. ఇందుకోసం 8096958096 నెంబర్‌ను ప్రవేశపెట్టింది. ఆ నెంబర్ ద్వారా 24 గంటల పాటు ప్రభుత్వ శాఖలకు చెందిన డాక్యుమెంట్స్ పొందవచ్చు. దాదాపు 10కిపైగా శాఖలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు పొందవచ్చు.
