ఆ హీరోయిన్‌ను నేను చెల్లెలుగా భావిస్తా: విజయ్ దేవరకొండ 

01 April 2026

Basha Shek

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా లు ఫిబ్రవరిలో పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే.

పెళ్లికి ముందు చాలా ఏళ్లుగా ప్రేమలో మునిగి తేలిన ఈ లవ్ బర్డ్స్ రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదికగా పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు

ఇక పెళ్లి తర్వాత కొద్ది రోజులు ఇంట్లోనే గడిపిన ఈ కొత్త దంపతులు ఇటీవల హనీమూన్ కు కూడా వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే.

వీటి సంగతి పక్కన పెడితే.. విజయ్ దేవరకొండ తన సినిమా కెరీర్ లో చాలా మంది హీరోయిన్లతో నటించాడు. బాలీవుడ్ బ్యూటీస్ తోనూ రొమాన్స్ చేశాడు

అయితే రష్మికతో పెళ్లికి ముందు విజయ్ దేవరకొండ- మెగా డాటర్ నిహారిక లు పెళ్లి చేసుకోనున్నారని నెట్టింట ప్రచారం జరిగింది.

అయితే ఈ రూమర్లపై ఓ సందర్భంలో స్వయంగా స్పందించిన విజయ్ దేవరకొండ  నిహారిక తనకు చెల్లెలు లాంటిదని చెప్పాడట

 తాను నటించిన గీత గోవిందం సినిమాలో నాగబాబు తనకు తండ్రి పాత్రలో నటించారని, అందుకే నిహారికను చెల్లెలుగా భావిస్తానని విజయ్ చెప్పాడట.

నిహారిక నిర్మాతగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా రాకాస. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగానే విజయ్ దేవరకొండ గురించి మాట్లాడింది నిహారిక.