AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పసిడి పతనం.. సామాన్యుడికి సంబరం.. ఇన్వెస్టర్లకు షాక్.. రేట్లు తగ్గడానికి అసలు కారణాలు ఇవే..

పసిడి పరుగులకు కళ్లెం పడింది. ఆకాశాన్నంటిన బంగారం, వెండి రేట్లు ఇప్పుడు నేలచూపులు చూస్తుండటంతో పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు భారీ ఊరట లభిస్తోంది. మరోవైపు అధిక ధరలకు బంగారంలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లలో మాత్రం ఆందోళన మొదలైంది. అసలు బంగారం ధరలు ఇంతలా తగ్గడానికి కారణమేంటి? ఇప్పుడే కొనడం మంచిదా లేక మరికొంత కాలం ఆగాలా? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పసిడి పతనం.. సామాన్యుడికి సంబరం.. ఇన్వెస్టర్లకు షాక్.. రేట్లు తగ్గడానికి అసలు కారణాలు ఇవే..
Why Are Gold Prices FallingImage Credit source: AI Image
Siva Nagaraju
| Edited By: |

Updated on: Nov 19, 2026 | 9:55 PM

Share

ఆకాశాన్నంటిన బంగారం ధరలు ఒక్కసారిగా దిగొస్తున్నాయి. కొన్నాళ్లుగా పెరుగుతూ వచ్చిన పసిడికి ఇప్పుడు బ్రేక్ పడింది. వెండి ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభిస్తోంది. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్‌లో ఈ పరిణామం కుటుంబాలకు కలిసొచ్చేలా ఉంది. మరోవైపు అధిక ధరలకు బంగారంలో పెట్టుబడులు పెట్టినవారికి ఆందోళన మొదలైంది. మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న ఈ మార్పులు అటు సామాన్యులను, ఇటు పెట్టుబడిదారులను ఆలోచనలో పడేస్తున్నాయి. నవంబర్ 19న హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,28,260గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,22,150 పలుకుతోంది. ఇక వెండి కిలో ధర ఐబీజేఏ సాయంత్రపు సూచిక ప్రకారం రూ.1,60,439గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో మార్పులకు అనుగుణంగా దేశీయ ధరల్లోనూ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అయితే నగల దుకాణాలను బట్టి ధరల్లో తేడాలు ఉండొచ్చు. వీటికి మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ అదనం. రికార్డు స్థాయి నుంచి వెనక్కి ఈ ఏడాది పసిడి ధరలు అనూహ్యంగా పెరిగాయి. సామాన్యులు కొనలేనంత స్థాయికి చేరాయి. పది గ్రాముల ధర రికార్డులను తాకింది. వెండి కూడా అదే దారిలో పయనించింది. అయితే ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో మారిన పరిస్థితులతో ధరలు దిగివస్తున్నాయి. గతంలో కొండెక్కిన రేట్లు ఇప్పుడు నేల చూపులు చూస్తుండటంతో మార్కెట్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. డాలర్ బలం – బంగారంపై భారం ఈ పతనానికి అంతర్జాతీయ పరిణామాలు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి....

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
పసిడి పతనం.. సామాన్యుడికి సంబరం.. ఇన్వెస్టర్లకు షాక్..
పసిడి పతనం.. సామాన్యుడికి సంబరం.. ఇన్వెస్టర్లకు షాక్..
డీమార్ట్‌లో గడియారాలు, కిటికీలు ఎందుకు ఉండవో తెలుసా..? ఈ సీక్రెట్
డీమార్ట్‌లో గడియారాలు, కిటికీలు ఎందుకు ఉండవో తెలుసా..? ఈ సీక్రెట్
దేవ ఉత్థాన ఏకాదశి: నవంబర్ 20న మేల్కొంటున్న శ్రీమహావిష్ణువు..
దేవ ఉత్థాన ఏకాదశి: నవంబర్ 20న మేల్కొంటున్న శ్రీమహావిష్ణువు..
స్పెషల్ సాంగ్ చేసిన స్టార్ హీరోయిన్.. కట్ చేస్తే..
స్పెషల్ సాంగ్ చేసిన స్టార్ హీరోయిన్.. కట్ చేస్తే..
OTTలో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ హవా.. IMDBలోనూ టాప్ రేటింగ్
OTTలో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ హవా.. IMDBలోనూ టాప్ రేటింగ్
క్రెడిట్ కార్డు బిల్లు లేట్‌గా చెల్లిస్తున్నారా..? ఇకపై వడ్డీలు..
క్రెడిట్ కార్డు బిల్లు లేట్‌గా చెల్లిస్తున్నారా..? ఇకపై వడ్డీలు..
సూర్యుడి అనురాధ నక్షత్ర ప్రవేశంతో ఈ 4 రాశులకు అదృష్టం.. ఆ లక్కీ..
సూర్యుడి అనురాధ నక్షత్ర ప్రవేశంతో ఈ 4 రాశులకు అదృష్టం.. ఆ లక్కీ..
4 వీల్​ డ్రైవ్​తో చిన్న సైజ్​ ఎలక్ట్రిక్​ Defender SUV వివరాలివే
4 వీల్​ డ్రైవ్​తో చిన్న సైజ్​ ఎలక్ట్రిక్​ Defender SUV వివరాలివే
ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..
ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..
ఏపీ అభివృద్ధికి 3 ఎకనామిక్ రీజియన్లు.. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం
ఏపీ అభివృద్ధికి 3 ఎకనామిక్ రీజియన్లు.. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం